దాదాపు వెయ్యి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సీనియర్ నటి సుధ. బాలనటిగా, హీరోయిన్‌గా, అత్తగా, అమ్మగా, వదినగా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో కష్టనష్టాలను చవిచూసింది. దీని గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను డైమండ్ స్పూన్‌తో పుట్టాను. పెద్ద ఇల్లు, ఇంటినిండా పనివాళ్లు, ముగ్గురు డ్రైవర్లు.. ఇలా చాలా రాజసంగా బతికాం.
మా నాన్నకు నలుగురు కొడుకుల తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు అమృతం అన్న అర్థం వచ్చేలా సుధ అని పేరు పెట్టారు. ఇంట్లో 20 తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదాన్ని. ఆస్తి, ఐశ్వర్యం అన్నీ చూశాను. కానీ తమ్ముడు పుట్టిన కొంతకాలానికే నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పటినుంచి ఆస్తి అంతా కరిగిపోవడం మొదలైంది. నేను ఆరో తరగతి చదివే సమయంలో అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అలా అన్నీ ఉన్న స్టేజ్ నుంచి ఏమీ లేని స్థాయికి వచ్చాం.
అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో నన్ను కూడా యాక్టింగ్ ఫీల్డ్‌కు తీసుకొచ్చింది. డబ్బు, పేరు రావడంతో చుట్టాలు తిరిగి మావంక చూడటం మొదలుపెట్టారు. చిన్నతనంలో సుఖసంతోషాలతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాము. ఆ మధ్య ఢిల్లీలో హోటల్ ప్రారంభించడంతో ఉన్న డబ్బంతా పోయింది. ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయాను. ఇంకా కొన్ని అప్పులైతే ఇప్పుడిప్పుడే వాటినుంచి బయటపడ్డాను. నా కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయాడు. నాతో గొడవపడి వెళ్లిపోయాడు. ఇప్పటికీ మాట్లాడట్లేదు' అని చెప్తూ ఎమోషనలైంది సుధ.
చదవండి: రాకీ భాయ్ స్థానంలో వేరే హీరో.. షాకిచ్చిన నిర్మాత
తమ్ముడి బర్త్‌డే పార్టీలో శ్రీముఖి రచ్చ
Comments
Please login to add a commentAdd a comment