ప్రేమిస్తే | 'Premisthe Poye Kaalam' audio release on September 14 | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తే

Published Tue, Sep 2 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

ప్రేమిస్తే

ప్రేమిస్తే

ప్రేమలోని విభిన్న కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమిస్తే పోయే కాలం’. జి. రవిచంద్ర దర్శకత్వంలో తులసి ప్రొడక్షన్స్ పతాకంపై రమణేశ్వరి సమర్పణలో డి.ఇ. రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్, శ్వేత ఇందులో హీరో హీరోయిన్లు. కీలకమైన తల్లి పాత్రను సీనియర్ నటి సుధ పోషిస్తున్నారు. దర్శ, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తల్లీ కొడుకులు అనుబంధాన్ని సరికొత్త రీతిలో ఆవిష్కరించే సినిమా ఇది. ప్రేమ, యువతరం భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తున్నాం. ఈ నెల 14న పాటలను, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: డా. అశోక్, సంగీతం: కె. కార్తీక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement