నర్సాపూర్: పెళ్లి బట్టలు కుట్టించుకునేందుకు వెళ్లిన యువతి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేశారు. సోమవారం స్థానిక ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివారల ప్రకారం.. మండలంలోని చిట్కూల్ గ్రామానికి చెందిన కామగొల్ల కిష్టయ్య పెద్దకూతురు సుధ (21) ఇంటర్మీడియట్ వరకు చదివింది. జోగిపేటలోని ఓప్రైవేటు ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది.
ఆమెకు ఇటీవలె కొల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం అయ్యింది. పిబ్రవరి నెలలో పెళ్లి నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఏర్పాట్లుచేస్తున్నారు. అందులో భాగంగా సుధ డిసెంబర్ 26వ తేదిన జోగిపేటలో బట్టలు కుట్టించుకునేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పివెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. బందువులు తెలిసిన చోట వెతికినా ఆచూకి తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారిస్తున్నారు.
పెళ్లి బట్టలు కుట్టించుకునేందుకు వెళ్లి..
Published Mon, Jan 18 2016 9:51 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM
Advertisement
Advertisement