పొలంలో పని చేసుకుంటున్న మహిళా రైతు పాము కాటుకు గురై మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
పొలంలో పని చేసుకుంటున్న మహిళా రైతు పాము కాటుకు గురై మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరమాసు సుధ(26) బావి వద్ద పని చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేయడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.