భర్త హత్యకు భార్య ప్లాన్‌ చేసింది | wife planed to kill her husband | Sakshi
Sakshi News home page

భర్త హత్యకు భార్య ప్లాన్‌ చేసింది

Published Sun, Jun 4 2017 3:18 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

భర్త హత్యకు భార్య ప్లాన్‌ చేసింది

భర్త హత్యకు భార్య ప్లాన్‌ చేసింది

కృష్ణరాజపుర: తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను హత్య చేయించడానికి ఓ భార్య ప్రయత్నించిన ఘటన శనివారం కాడుగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బెళతూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బెళతూరు గ్రామానికి చెందిన సోమశేఖర్‌కు అదే గ్రామానికి చెందిన సుధాతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఇటీవలె ఆమెకు అరుణ్‌ అనే వ్యక్తితో ఏర్పడ్డ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం ఇటీవల భర్త సోమశేఖర్‌కు తెలియడంతో కొద్ది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇరువురి మధ్య గొడవ జరగడంతో సుధా భర్త సోమశేఖర్‌ను హత్య చేయాలంటూ ప్రియుడు అరుణ్‌కు సూచించింది.దీంతో అరుణ్‌ శుక్రవారం రాత్రి పనిపై బయటకు వచ్చిన సోమశేఖర్‌పై తన సహచరులతో కలసి అరుణ్‌ ఇనుపరాడ్లు,కత్తులతో దాడి చేసారు. దీంతో సోమశేఖర్‌ సృహ తప్పి పడిపోవడంతో సోమశేఖర్‌ మరణించాడని భావించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న కాడుగోడి పోలీసులు సోమశేఖర్‌ను కే.ఆర్‌.పుర ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement