somashekhar
-
ఆర్జీవీ ఇంట విషాదం: సోదరుడిని మిస్ అవుతున్న వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్ కరోనాకు బలయ్యాడు. కొద్దిరోజులుగా కోవిడ్‌తో పోరాడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఆదివారం తుది శ్వాస విడిచాడు. కాగా సోమశేఖర్ రంగీలా, దౌడ్, సత్య, జంగల్, కంపెనీ వంటి పలు చిత్రాల నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాడు. అనురాగ్ కశ్యప్ రచయితగా పని చేసిన హిందీ సినిమా 'ముస్కురాకే దేఖ్ జర'కు దర్శకుడిగానూ పని చేశాడు. అతడి మరణంపై ఆర్జీవీ ఎమోషనల్ అయ్యాడు. "కొన్నేళ్లుగా అతడు మాతో లేడు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలాకాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా జీవితంలో సోమశేఖర్ చాలా కీలకమైన వ్యక్తి. అతడిని చాలా మిస్ అవుతున్నాను" అని పేర్కొన్నాడు. In this turbulent time just got to know about our old associate #PSomShekar passing away. He was taking care of his mother who had Covid. He got infected too but did not stop taking care of her. #RIPPSomShekhar pic.twitter.com/yqtJ4Xs6pK — Boney Kapoor (@BoneyKapoor) May 23, 2021 'తల్లి కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్న శేఖర్, కరోనా సోకిన తర్వాత కూడా ఆమె కోసం పరితపించాడు. ఈ క్రమంలో అతడూ కరోనా బారిన పడ్డాడు. అయినప్పటికీ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెను కాపాడుకోగలిగాడు కానీ తను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు' అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ విచారం వ్యక్తం చేశాడు. సత్య చిత్రీకరణ సమయంలో వర్మ కంటే సోమశేఖర్‌కే ఎక్కువ భయపడేవాళ్లమన్న జేడీ చక్రవర్తి ఇద్దరి అభిరుచి ఒకటే కావడంతో చిన్న చిన్న తగాదాలు కూడా జరిగేవని తెలిపాడు. అయితే తొందరగానే అన్నింటినీ సర్దుకుపోయేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. ఈ మధ్య శేఖర్ ఒంటరివాడిగా మారిపోయాడని, కనీసం ఫోన్ కాల్స్ కూడా మాట్లాడకపోవడం ఆందోళనకు గురి చేసిందన్నాడు. ఇంతలోనే ఆయనను కరోనా కబళించడం విషాదకరమన్న జేడీ అతడు మన మధ్య లేనందుకు ఎక్కువగా బాధపడేది ఆర్జీవీనే అని తెలిపాడు. చదవండి: నా చావుకు సుపారీ ఇచ్చాను, ఆ అవసరం రాదు: ఆర్జీవీ -
అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్: అవాక్కైన బిగ్‌బాస్ కంటెస్టెంట్
తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు రన్నర్‌ను, కానీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న విన్నర్‌ను అని చెప్పుకుంటాడు అఖిల్ సార్థక్. ప్రస్తుతం అతడు తెలుగు అబ్బాయి - గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోమశేఖర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా అతడి ఫొటో ఫ్రేమ్‌ను ప్రత్యేక కానుకగా పంపించాడు. ఈ విషయాన్ని అతడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో అభిమానులతో పంచుకున్నాడు. "హలో రాక్‌స్టార్, హ్యాపీ బర్త్‌డే. మనిద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయి. అందుకే ఇలా కనెక్ట్ అయిపోయాం. మా అమ్మది తమిళ్. అలా నాకు ఆ భాష కాస్తోకూస్తో అర్థమవుతుంది, కానీ మాట్లాడలేను. నేను తమిళ బిగ్‌బాస్ షో చూశాను. ఇద్దరం బిగ్‌బాస్ 4 నుంచి వచ్చినవాళ్లమే. లవ్ యూ రాక్‌స్టార్" అంటూ వీడియో సందేశం పంపాడు. ఇక అతడు పంపిన గిఫ్ట్ చూసి సోమశేఖర్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. "ఓ మై గాడ్, చాలా బాగుంది బ్రదర్" అంటూ త్వరలోనే కలుద్దామని చెప్పుకొచ్చాడు. సోమశేఖర్ విషయానికొస్తే.. బాక్సింగ్ మ్యాచ్‌లో గోల్డ్ మెడల్, తమిళనాడు స్టేట్ లెవల్ మువైతాయ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 'అజగియ తమిళ్ మ్యాగన్' టీవీ షోలో తళుక్కున మెరిశాడు. బైకులను అమితంగా ప్రేమించే ఇతడు ఈ మధ్యే కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొని అందరి ఆదరాభిమానాలను అందుకున్నాడు. గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న ఇతడు నాలుగో రన్నరప్‌గా నిలిచాడు. చదవండి: అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్ ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు -
భర్త హత్యకు భార్య ప్లాన్ చేసింది
కృష్ణరాజపుర: తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను హత్య చేయించడానికి ఓ భార్య ప్రయత్నించిన ఘటన శనివారం కాడుగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెళతూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బెళతూరు గ్రామానికి చెందిన సోమశేఖర్‌కు అదే గ్రామానికి చెందిన సుధాతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఇటీవలె ఆమెకు అరుణ్ అనే వ్యక్తితో ఏర్పడ్డ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం ఇటీవల భర్త సోమశేఖర్‌కు తెలియడంతో కొద్ది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇరువురి మధ్య గొడవ జరగడంతో సుధా భర్త సోమశేఖర్‌ను హత్య చేయాలంటూ ప్రియుడు అరుణ్‌కు సూచించింది.దీంతో అరుణ్ శుక్రవారం రాత్రి పనిపై బయటకు వచ్చిన సోమశేఖర్‌పై తన సహచరులతో కలసి అరుణ్ ఇనుపరాడ్లు,కత్తులతో దాడి చేసారు. దీంతో సోమశేఖర్ సృహ తప్పి పడిపోవడంతో సోమశేఖర్ మరణించాడని భావించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న కాడుగోడి పోలీసులు సోమశేఖర్‌ను కే.ఆర్.పుర ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.