
Matru Devo Bhava 2022 Movie Ready To Release In July: 1993లో వచ్చిన 'మాతృదేవోభవ' సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అంతా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. అన్ని వర్గాల ఆడియన్స్ నీరాజనం పలికారు. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల చేత థియేటర్స్‌లోనే కన్నీళ్లు పెట్టించాయి. సంవత్సరాల తరబడి ఈ సినిమా థియేటర్స్‌లో ఆడటమే గాక ప్రతి ఒక్క ఫ్యామిలీని సినిమా హాలుకు తీసుకొచ్చింది. అయితే ఇన్నేళ్లకు మళ్లీ అదే రకమైన సెంటిమెంట్ కంటెంట్‌తో 'మాతృదేవోభవ' టైటిల్‌తో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం 'మాతృదేవోభవ'. దీనికి ఓ అమ్మ కథ అనేది ట్యాగ్ లైన్. బలమైన ఫ్యామిలీ సబ్జెక్టుతో జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆమె భర్తగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు. భర్త ప్రమాదంలో చనిపోవడంతో తన పిల్లలను సుధ ఏ విధంగా పెంచిందనే కథాంశంతో ఎమోషనల్ ఎలిమెంట్స్ జొప్పిస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఎంఎస్ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె. హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పతాంజలి శ్రీను, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.
చదవండి: ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు
వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన
సెంటిమెంట్ ప్రధానంగా రాబోతున్న ఈ చిత్రానికి కెజెఎస్ రామా రెడ్డి కథ అందించగా చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మారుధూరి రాజా డైలాగ్స్ రాశారు. డైమండ్ వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేశారు. అనంత శ్రీరాం, పాండురంగ రావు, దేవేందర్ రెడ్డి లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలో సుధ, సుమన్, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి లాంటి ప్రఖ్యాత తారాగణం నటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment