
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ శ్రీసుధ వేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు సహజీవనం చేసి శ్యామ్ కె.నాయుడు మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
శ్యామ్ కె.నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని.. ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో శ్యామ్ కె. నాయుడికి ఊరటనిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
చదవండి: (సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్‌లో అందరి ముందే..)
Comments
Please login to add a commentAdd a comment