భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ వార్షికోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. దీంతో కోర్టు ఆవరణలోని ఆడిటోరియంలో బాలీవుడ్ చిత్రాన్ని నేడు ప్రదర్శించనున్నారు. లింగ సమానత్వం ఇతివృత్తంగా రూపొందించిన 'లాపతా లేడీస్' చిత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రీ సభ్యులు ఈ రోజు సాయంత్రం 4.15 గంటలకు చూడనున్నారు. ఇలాంటి అవకాశం దక్కించుకన్న ఏకైక సినిమాగా లాపతా లేడీస్‌కు దక్కింది.
సుప్రీమ్ కోర్టు ఆవరణలో ప్రదర్శిస్తున్న ఈ సినిమా ఈ స్క్రీనింగ్‌కు చిత్ర నిర్మాత, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో పాటు చిత్ర దర్శకులు కిరణ్ రావు కూడా హాజరుకానుంది. లింగ సమానత్వం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా స్క్రీనింగ్ సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంలో జరగనుంది. సమాజంలో లింగ సమానత్వం అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి నొక్కిచెప్పడంలో భాగంగా ఈ స్క్రీనింగ్ జరగనుంది. సుప్రీంకోర్టు స్థాపన జరిగిన 75వ సంవత్సరంలో నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా ఈ స్క్రీనింగ్ ఉంటుంది. రిజిస్ట్రీ అధికారులను కూడా సినిమాకు ఆహ్వానించారు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.
కిరణ్ రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే 'లాపతా లేడీస్' చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ నటించారు. రామ్ సంపత్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కొత్తగా పెళ్లయిన ఇద్దరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శితమై సినీ ప్రేమికుల ప్రశంసలు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment