Shyam K. Naidu
-
నటి శ్రీసుధ కేసు: సుప్రీం కోర్టులో శ్యామ్ కె. నాయుడికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ శ్రీసుధ వేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు సహజీవనం చేసి శ్యామ్ కె.నాయుడు మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్యామ్ కె.నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని.. ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో శ్యామ్ కె. నాయుడికి ఊరటనిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. చదవండి: (సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే..) -
శ్యామ్ కె. నాయుడికి సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లోగా వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శ్యామ్ కె.నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని... ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టి శ్యామ్ కె.నాయుడితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సహజీవనం చేసి మోసగించాడని శ్రీసుధ గతంలో అతనిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడు నకిలీ పత్రాలతో బెయిల్ తెచ్చుకున్నాడని శ్రీసుధ ఆరోపించింది. పెళ్లి పేరుతో నమ్మించి ఐదేళ్లు తనతో సహజీవనం చేసిన శ్యామ్ కె.నాయుడు.. ఆ తర్వాత తనను మోసం చేశారని గత ఏడాది మేలో శ్రీసుధ మొదటిసారి హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ కె నాయుడిని అరెస్ట్ చేయగా రెండు రోజుల్లోనే బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే ఈ కేసులో శ్యామ్ కె. నాయుడి తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా బెయిల్ పొందాడని శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పత్రాలు నకిలీవని తేలడంతో అప్పట్లో అతని బెయిల్ కూడా రద్దయినట్లు కథనాలు వచ్చాయి. ఈ విషయంపై గత నెలలో మరోసారి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీసుధ. ఇప్పటివరకూ అతన్ని అరెస్ట్ చేయలేదని ఆమె ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు... కొద్ది రోజుల క్రితం నటి శ్రీసుధ, శ్యామ్ కె నాయుడిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును ఢీకొట్టించి హత్యాయత్నం చేశారని... ఈ కుట్ర వెనుక శ్యామ్ కె నాయుడు ఉన్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తాను శ్యామ్ కె నాయుడుపై పెట్టిన కేసుకు, ఈ యాక్సిడెంట్‌కు లింకు ఉందని ఆరోపించారు. తనను అడ్డు తొలగించుకునేందుకు యాక్సిడెంట్ చేసి చంపేసేలా కుట్ర చేసి ఉంటాడని శ్రీసుధ అనుమానం వ్యక్తం చేశారు. శ్యామ్ కె.నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: నాపై ఉన్న కేసులన్నింటిని సిమ్లాకు మార్చండి -
నాపై హత్యాయత్నం చేశారు: నటి శ్రీసుధ
సాక్షి, కృష్ణాజిల్లా: నటి శ్రీ సుధ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును గుద్దిన దుండగులు హత్యాయత్నానికి ఒడిగట్టారని ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడుపై తనకు అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు సహజీవనం చేసి శ్యామ్ కె.నాయుడు మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనను బెదిరించాడని, దీంతో తనకు అతడి వల్ల ప్రాణహాని ఉందంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేసుకు, విజయవాడ ఘటనకు సంబంధం ఉందంటూ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషనులో శ్రీసుధ గురువారం ఫిర్యాదు చేశారు. తనను హత్యచేసే క్రమంలో భాగంగానే యాక్సిడెంట్ చేయించి ఉంటాడంటూ శ్యామ్ కె. నాయుడిపై సందేహం వ్యక్తం చేశారు. ఇక శ్యామ్ కె. నాయుడుపై హైదరాబాద్‌లో పెట్టిన కేసు దర్యాప్తు కోసం ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణ తన దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ కేసులో నిందితుడు, తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. చదవండి: అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు! -
శ్యామ్ కె.నాయుడుతో ప్రాణహాని: నటి శ్రీసుధ
సాక్షి, హైదరాబాద్: సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు ఎస్ఆర్నగర్ పోలీసులకు శుక్రవారం కంప్లైంట్ రాసిచ్చారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు కలిసున్న తరువాత శ్యామ్ కె.నాయుడు తనను మోసం చేశాడంటూ గత ఏడాది మే 26న శ్రీసుధ ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి కోర్టులో దాఖలు చేశారని, శ్యామ్ కె.నాయుడును ఇంత వరకు అసలు అరెస్టు కూడా చేయలేదని రెండోసారి తన ఫిర్యాదులో శ్రీసుధ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటి.. శ్యామ్ కె.నాయుడిపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, రాజీ కుదుర్చుకోవాలని బెదిరించారని ఆమె వాపోయారు. గత ఏడాది ఆగస్టు 5న మాదాపూర్‌లోని చిన్నా నివాసానికి తనను పిలిపించి శ్యామ్ కె.నాయుడు, చిన్నా, సాయిరాం మాగంటి తదితరులు బెదిరించడంతోపాటు దూషించారని, శారీరక దాడికి పాల్పడ్డారని తెలిపారు. సినీ పరిశ్రమలో కొనసాగాలంటే తప్పనిసరిగా రాజీ కుదుర్చుకోవాలని, విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించినట్లు చెప్పారు. తాను భయంతో అప్పటి నుంచి ముందుకు రాలేదని, ప్రస్తుతం తనకు శ్యామ్ కె.నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మిత్రులతో ప్రాణహాని ఉన్నందున మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీసుధ తన ఫిర్యాదులో పేర్కొన్న చిన్నా నివాసం మాదాపూర్‌లో ఉండటంతో ఎఆర్‌నగర్ పోలీసులు శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటి తదితరులపై జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. ఈ కేసును మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
నటి శ్రీసుధ అవినీతి ఆరోపణల కేసులో పురోగతి
హైదరాబాద్: సినీ నటి సాయి సుధ, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్పై చేసిన అవినీతి ఆరోపణల కేసులో పురోగతి కనిపిస్తోంది. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మధ్యవర్తులను విచారిస్తున్నారు. బాపూనగర్‌లో ఉండే రాజేష్ నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించారు. ఇదే కేసులో మరో ప్రముఖ మధ్యవర్తిని కూడా విచారించనున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో నటి సాయి సుధ ఫిర్యాదు చేసింది. ఇదే కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ఎస్ఆర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణ తనవద్ద నుంచి లంచం తీసుకున్నట్లు నటి సాయి సుధ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (సీఐ మురళీకృష్ణపై ఏసీబీకి నటి శ్రీసుధ ఫిర్యాదు) (పెళ్లి పేరుతో మోసం చేశాడు) -
సీఐ మురళీకృష్ణపై నటి శ్రీసుధ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణ తన దగ్గర లంచం తీసుకున్నారంటూ నటి శ్రీసుధ ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ)కు ఫిర్యాదు చేశారు. కాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో నటి సాయి సుధ గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం సీఐ మురళీకృష్ణ తన దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక ఈ కేసులో శ్యామ్ కే నాయుడు తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఆధారాలు సమర్పించారు. (పెళ్లి పేరుతో మోసం చేశాడు) చదవండి: (సుశాంత్ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు) -
శ్యామ్ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో నటి సాయి సుధ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్‌కేనాయుడుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. అయితే రిమాండ్‌కు వెళ్లిన రెండు రోజుల్లోనే అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. (శ్యామ్ కే నాయుడిపై మోసం కేసు) బాధితురాలు సాయి సుధతో తను రాజీ కుదుర్చుకున్నట్లు నాంపల్లి కోర్టులో శ్యామ్ బెయిల్ ఫిటిషన్ దాఖలు చేశాడు. దీంతో అతడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే శ్యామ్‌కు న్యాయస్థానం బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సాయి సుధ కోర్టును ఆశ్రయించింది. దొంగ సంతకం పెట్టి బెయిల్‌కు తాను ఒప్పకున్నట్లు ఓ నకిలీ పత్రాన్ని సృష్టించాడని న్యాయస్థానానికి బాధితురాలు తెలిపింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం శ్యామ్ కే నాయుడు బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో అతడు మరింత చిక్కుల్లో పడ్డాడు. -
నాకు సిగరెట్ అలవాటే లేదు!
♦ అలాంటిది డ్రగ్స్ఎలా తీసుకుంటా?: సిట్ అధికారులతో కెమెరామన్ శ్యామ్ కె.నాయుడు ♦ కెల్విన్‌తో సంబంధాలు, పార్శిళ్లపై ప్రశ్నల వర్షం ♦ నేడు సిట్ ముందుకు నటుడు సుబ్బరాజు సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల కేసు విచారణలో భాగంగా గురువారం సిట్ బృందాలు కెమెరామన్ శ్యామ్ కె.నాయుడును ప్రశ్నించాయి. కెల్విన్‌తో సంబంధాలు, కొరియర్ సంస్థ నుంచి వచ్చిన పార్శిళ్లపై ఆరు గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించాయి. ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న శ్యామ్ కె.నాయు డును శ్రీనివాస్ రావు బృందం విచారించింది. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎప్పుడు మొదలైం దని ప్రశ్నించగా.. ఆ అవసరం తనకు రాలేదని ఆయన సమాధానమిచ్చినట్టు తెలిసింది. కెల్విన్‌తో ఎలాంటి పరిచయం ఉంది? ఎందుకు అతడితో ఫోన్లో మాట్లాడారని అధికారులు ప్రశ్నించగా.. సినిమా ఫంక్షన్లకు ఈవెంట్ మేనేజర్‌గా చేసే సందర్భంలో పరిచయం అయ్యాడని, అంతకు మించి అతడితో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. డ్రగ్స్ వాడితే అది ఎవరి నుంచి కొనుగోలు చేశారు? మీకు డ్రగ్స్ అలవాటు చేసిందెవరని సిట్ వర్గాలు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అయితే తనకు సిగరెట్ అలవాటు కూడా లేదని, డ్రగ్స్ తీసుకోవడం తెలియదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. పదేపదే ఓ ప్రముఖ కొరియర్ కంపెనీ నుంచి పార్శిల్స్ వచ్చాయని, వాటిల్లో డ్రగ్స్ తెప్పించుకున్నట్టు కెల్విన్ తమ విచారణలో చెప్పాడని శ్యామ్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. పార్శిల్లో వచ్చినవన్ని డ్రగ్స్ అనుకుంటే దానికి తానేం చేయలేనని శ్యామ్ అన్నట్టు సమాచారం. విచారణలో ఆయన పెద్దగా ఎలాంటి సమాధానాలు చెప్పలేదని తెలిసింది. సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్ల తనకు పెద్దగా సమయం ఉందని, ప్రైవేట్ వ్యక్తులతో కలసి పబ్బులు, క్లబ్బులకు తిరిగే అలవాటు కూడా లేదని శ్యామ్ స్పష్టం చేసినట్టు సమాచారం. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో పరిచయం, డ్రగ్స్ వ్యవహారాల్లో ఆయనతో లింకులున్నాయా అని ప్రశ్నించగా.. పూరి సినిమాలకు తాను పని చేశానని, అయితే ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియదని శ్యామ్ అన్నట్టు తెలిసింది. ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైన విచారణలో 11.45కు టీ బ్రేక్, 1.35 గంటలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత 2.15 గంటల నుంచి 3.50 గంటల వరకు మళ్లీ విచారించింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన తన వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. ఆ కొరియర్లపై నిఘా పెంచండి: సిట్ డ్రగ్స్ సరఫరాకు పెడ్లర్లు వాడుకుంటున్న కొరియర్ మార్గాన్ని నియంత్రించడంపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రముఖ కొరియర్ కంపెనీలైన బ్లూడార్ట్, ఫెడెక్స్, డీహెచ్ఎల్ ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు. డ్రగ్స్ సరఫరాపై నిఘా పెంచాలని, ఈ మేరకు డ్రగ్స్ కొరి యర్లను గుర్తించేందుకు సిట్ రూపొందించిన సూచనల కాపీలను ఆ కంపెనీల ప్రతినిధులకు అందజేశారు. నేడు విచారణకు సుబ్బరాజు సిట్ అధికారులు శుక్రవారం సినీ నటుడు సుబ్బరాజును ప్రశ్నించనున్నారు. విచారణలో కెల్విన్ వెల్లడించిన వివరాల ఆధారంగా సుబ్బరాజును విచారించనున్నట్టు అధికారులు తెలిపారు. లోతుగా విచారిస్తున్నాం: ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ డ్రగ్స్ వ్యవహారంపై విచారణ లోతుగా సాగుతోందని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ చెప్పారు. గురువారం అబ్కారీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసును ఆషామాషీగా కాకుండా అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్న కొందరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, మరికొందరికి త్వరలో అందిస్తామని వివరించారు. శ్యామ్ కె.నాయుడు విచారణకు పూర్తిగా సహకరించారన్నారు. నోటీసులు అందుకున్న వారు దర్యాప్తు అధికారులకు సహరించాలని సూచించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగే డ్రగ్స్ నియంత్రణ శిక్షణకు డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి నేతృత్వంలో ఆరుగురు అధికారుల బృందం వెళ్లనున్నట్టు చంద్రవదన్ తెలిపారు.