
హైదరాబాద్: సినీ నటి సాయి సుధ, ఎస్‌ఆర్ నగర్ ఇన్‌స్పెక్టర్‌పై చేసిన అవినీతి ఆరోపణల కేసులో పురోగతి కనిపిస్తోంది. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మధ్యవర్తులను విచారిస్తున్నారు. బాపూనగర్‌లో ఉండే రాజేష్ నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించారు. ఇదే కేసులో మరో ప్రముఖ మధ్యవర్తిని కూడా విచారించనున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నటి సాయి సుధ ఫిర్యాదు చేసింది. ఇదే కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ఎస్‌ఆర్ నగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మురళీ కృష్ణ తనవద్ద నుంచి లంచం తీసుకున్నట్లు నటి సాయి సుధ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (సీఐ మురళీకృష్ణపై ఏసీబీకి నటి శ్రీసుధ ఫిర్యాదు)
Comments
Please login to add a commentAdd a comment