మలయాళ నటులు అర్జున్ అశోకన్, సంగీత్ ప్రతాప్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎమ్‌జీ రోడ్డుపై వెళ్తున్న వీరి కారు రెండు బైక్స్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు, నటుడు అర్జున్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగంలో కూర్చున్న నటుడు సంగీత్ మెడకు ఫ్రాక్చర్ అవడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బైక్‌పై ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
కారు యాక్సిడెంట్
బ్రొమాన్స్ సినిమాలోని ఛేజింగ్ సీన్ చిత్రీకరించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్‌లో కారు వెనకభాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
సినిమా..
అర్జున్ అశోకన్.. ఈ ఏడాది అబ్రహాం ఒజ్లర్, భ్రమయుగం, వన్స్ అపాన్ ఎ టైమ్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం బ్రొమాన్స్ సహా మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. సంగీత్ ప్రతాప్.. హృదయం, ప్రేమలు సినిమాలతో అలరించాడు.
చదవండి: మాస్ డ్యాన్సర్.. పోలకి విజయ్
Comments
Please login to add a commentAdd a comment