ఊ అంటావా...మార్ ముంత వరకూ
అనేక హిట్ సాంగ్స్‌కి మాస్ స్టెప్పులు
ఏజాస్ మాస్టర్ పరిచయంతో ఇండస్ట్రీకి
రణ్‌వీర్ కపూర్ బాగా ప్రోత్సహించారు
‘సాక్షి’తో కొరియోగ్రాఫర్ పోలకి విజయ్
పుష్ప–1 లో ఊ అంటావా మావా... ఊహూ అంటావా మావ.. పుష్ప–2 లో పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్.. డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మార్‌ముంత చోడ్ చింత.. మ్యాడ్ చిత్రంలో కళ్లజోడు కాలేజీపాప.. కాలేజ్ పోతున్నది.. కోట బొమ్మాళి చిత్రంలోని లింగిడి, లింగిడి.. ఇలాంటి పాటలు వింటుంటే స్టెప్పులు వేయాలనే ఆలోచన తప్పక వస్తుంది.. అలాంటి పాటలకు కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు.. మన తెలుగబ్బాయే.. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు.. కష్టేఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని టాలీవుడ్ టు బాలీవుడ్‌కు పాగా వేసిన మన తెలుగు కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ డెడికేషన్‌కి టాలీవుడ్ అగ్రహీరోలు ఫిదా అవుతున్నారు. స్టెప్పులు వేస్తే.. క్లాస్ టు మాస్ జనాలు ఉర్రూతలూగేలా చేస్తున్న పోలకి విజయ్ జీవితం ఓ ఇన్‌స్పిరేషన్‌లా ఉంటుంది.. ఈ నేపథ్యంలో విజయ్ ‘సాక్షి’తో పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు.
నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా పలాస. చిన్నతనంలోనే అమ్మ నాన్మ చనిపోయారు. అమ్మమ్మ, తాతమ్మల దగ్గరే పెరిగాను. చిన్నతనం నుండే నటన అంటే ఇష్టం. ఆర్టిస్ట్ అవుదామనే కల ఉండేది. కానీ డ్యాన్స్‌లు సైతం బాగా వేసేవాడిని. అలా నటన, డ్యాన్స్‌లలో స్వతహాగా మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాను. అమ్మమ్మ, తాతయ్యలకు భారం కాకూడదని బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ ఇక్కడ ఎవరూ తెలియదు. ఎవరిని కలవాలో తెలియదు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ.. కషే్టఫలి అనేది నమ్మాను. ఎన్నికష్టాలు వచి్చనా నా ప్రయాణాన్ని ఆపలేదు. పనులు చేస్తూ జీవనం గడుపుతూ అక్కడక్కడా నాకు తెలిసిన డ్యాన్స్‌లు వేసేవాడిని.
ఏజాస్ మాస్టర్ పరిచయం..
పని, డ్యాన్స్‌లు తప్ప వేరే వ్యాకపం ఉండేది కాదు.. అలా నా అభిలాషను మెచ్చి ఓ అజ్ఞాతవ్యక్తి ఓ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకువెళ్లాడు. ఏజాస్ మాస్టర్ స్వర్ణలత మాస్టర్ అసిస్టెంట్. అలా డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. చాలా మెళకువలు నేర్చుకున్నాను. నన్ను ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకెళ్లిన ఆ అజ్ఞాతవాసి మరలా కనిపించలేదు.
డ్యాన్సర్‌గా ఇండస్ట్రీకి..
డ్యాన్స్‌లో మంచి పట్టు సాధించాక 2015లో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కార్డ్‌ను తీసుకున్నాను. సినిమాల్లో డ్యాన్సర్‌గా చేసే సమయంలో తోటిడ్యాన్సర్స్ నీలో మంచి టాలెంట్ ఉంది. కొరియోగ్రాఫర్‌గా చేయమని సలహా ఇచ్చారు. కొన్ని డ్యాన్స్ విడియోస్ చేశాక ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయిరాజేష్ నిర్మాణంలోని సంపూర్ణే‹Ùబాబు ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో అవకాశం వచి్చంది. ఆ తర్వాత నేను పుట్టిన పలాస పేరుతో కరుణసాగర్ దర్శకత్వంలోని ‘పలాస’ చిత్రంలో నాదీ నక్కిలీసు గొలుసు పాటకు కొరియోగ్రఫీ చేశాను. ఈ పాటకు మంచి పేరు వచి్చంది. అలా కొరియోగ్రాఫర్‌గా స్థానాన్ని నిలబెట్టుకున్నాను.
పుష్పతో మరోమెట్టు..
దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఊ అంటావా పాటకు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి చేశాను. ఈ పాట దేశంతోపాటు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. పుష్ప–2లో పుష్ప, జాతర పాటకూ కొరియోగ్రఫీ చేశాను. రవితేజ, శర్వానంద్, విజయ్‌దేవరకొండ, నాని చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాను. రీసెంట్ రామ్ ‘డబుల్ ఇస్మార్ట్‌శంకర్’లో మార్‌ముంత చోడ్‌చింతకు కోరియోగ్రఫీ చేశా. యూట్యూబ్‌లో సంచలనంగా మారింది.
బాలీవుడ్‌లో అవకాశం..
హీరో రణ్‌వీర్ కపూర్ నటిస్తున్న ‘తు ఝూతీ మైన్ మక్కర్’ చిత్రంలోని పాటకు కొరియోగ్రఫీ చేశాను. రణ్‌వీర్ కపూర్ బాగా ప్రోత్సహించారు. అంతేకాకుండా నాకు నచి్చన బెస్ట్ మాస్టర్ లారెన్స్ మాస్టర్‌కి ‘రుద్రుడు’ చిత్రంలో కొరియోగ్రఫీ చేశాను. ఈ అనుభవం జీవితంలో మరువలేనిది.
చిరంజీవికి కొరియోగ్రఫీ నా ఆశయం
చిన్నతనం నుండి నా గాడ్‌ఫాదర్ చిరంజీవి. ఆయన డ్యాన్సులు చూసి పెరిగాను. ‘ఇంద్ర’ చిత్రాన్ని 22సార్లు చూశాను. కేవలం దాయి దాయి దామ్మ పాట కోసమే చూశాను. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ మాస్టర్‌కి కొరియోగ్రఫీ చేయడం సంతోషంగా ఉంది. కానీ నా గాడ్‌ఫాదర్ చిరంజీవికి కొరియోగ్రఫీ చేయాలన్నది నా ఆశయం. ఆ దిశగా ఆడుగులు వేస్తున్నాను. డ్యాన్స్‌పై ఇష్టంతో ఈ స్థాయికి వచ్చాను. గుర్తుండిపోయే కొరియోగ్రాఫర్‌గా ప్రజల మదిలో ఉంటూ మరో లక్ష్యం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగించి విజయాన్ని సాధిస్తాను. మీ దీవెనలే నాకు కొండత బలమని నమ్ముతూ.. అందరికీ నా కృతజ్ఞతలు..
Comments
Please login to add a commentAdd a comment