
టీఎస్ డీజీపీ ఎంపిక కోసం జాబితా
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ రాష్ట్రానికి పంపింది. ఈ జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అరుణా బహుగుణ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ పేర్లు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఈ ముగ్గురు అధికారుల్లో ఒకరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించనుంది. తెలంగాణ డీజీపీగా ప్రస్తుతం అనురాగ్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.