
ఎక్కడా రాజీపడొద్దు: డీజీపీ అనురాగ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ ఐపీఎస్ అధికారులతో ఆ ప్రాంత డీజీపీ అనురాగ్ శర్మ సమావేశమయ్యారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడొద్దని అనురాగ్ శర్మ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని వారికి సూచించారు.
ఉమ్మడి రాజధానిలో రాజకీయ ప్రముఖుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. సిబ్బంది కొరతపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఖాళీల భర్తీకి త్వరలోనే రిక్రూట్మెంట్ చేపట్టాలని ఉన్నతాధికారులను డీజీపీ ఆదేశించారు.