
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నేత హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ భార్య శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శారదక్క డీజీపి ఎదుట లొంగిపోనున్నారు. శారదక్క లొంగుబాటుపై డీజీపీ మహేందర్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
(చదవండి: చిన్నచూపు చూపడంతో.. వనం నుంచి జనంలోకి..)
గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం బెజ్జరి. ఇటీవల శాదరక్క భర్త హరిభూషణ్ కరోనాతో మృతిచెందిన సంగతి తెలిసిందే. నాటి నుంచి శారదక్క మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దానికి తోడు కరోనా పాజిటివ్ రావడం తో కొంతకాలంగా అస్వస్థతకు గురై చికిత్స పొందారు. కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యం కారణంగా లొంగుబాటు కు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment