యాదిగిరిగుట్ట: నల్లగొండ జిల్లా యాదిగిరి గుట్టలో కొలువైన శ్రీ లక్ష్మినరసింహ స్వామిని సోమవారం తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ దర్శించుకున్నారు. తొలిసారి పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకంలో పాల్గొన్నారు. కాగా, యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక సోమవారం సందర్భంగా స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.