నల్గొండ : నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం నల్గగొండ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న అనురాగ్ శర్మ జిల్లాలో 30 పుష్కరఘాట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పుష్కరఘాట్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ఆ క్రమంలో అనురాగ్ శర్మ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో తెలంగాణలో ఎక్కడ ఏటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.