
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పలు సూచనలు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో నిరుద్యోగులకు గాలం వేసి ఉద్యోగాల పేరుతో దళారులు మోసం చేస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్టు అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిజికల్ టెస్ట్‌లు పాసైన వారు ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు.
కొంతమంది బ్రోకర్స్ తమకు పోలీస్ అధికారులతో పరిచయాలు ఉన్నాయని, డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని అభ్యర్థులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తమ వద్దకు వస్తున్నాయని, పోలీస్ ఉద్యోగ పరీక్షలు పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా జరుగుతున్నాయని కమిషనర్ వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment