mahesh bagavath
-
రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక నిర్ణయం.. కబ్జాపై ‘ఎస్ఓటీ’
సాక్షి, హైదరాబాద్: మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి నేరస్తులను పట్టుకోవటంలో దిట్టయిన స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు.. ఇక నుంచి భూ ఆక్రమణదారులపైనా దృష్టి సారించనున్నారు. భూ తగాదాలు పెరిగిపోతుండటం, వీటిని ఆసరాగా చేసుకొని కొందరు పోలీసులు అక్రమాలకు పాల్పడటం, చివరికి హత్యలకూ దారితీస్తున్న నేపథ్యంలో... రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. భూ ఆక్రమణలు, కబ్జాలపై పోలీసులకు మార్గదర్శకాలు ఖరారు చేశారు. ఆయా విధి విధానాలకు లోబడే చర్యలు తీసుకోవాలని సూచించారు. వేల సంఖ్యలో ఫిర్యాదులు.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ పరిధిలో భూముల విలువలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో కబ్జాదారులు నకిలీ పత్రాలను సృష్టించి ఖాళీ స్థలాలను విక్రయించడం లేదా కబ్జాలకు పాల్పడటం వంటి వాటికి పాల్పడుతున్నారు. దీంతో రోజుకు వేల సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిలో చాలా వరకు కేసులను ‘సివిల్ మ్యాటర్’ అని పోలీసులు పక్కన పెడుతుండగా.. తమ వారి కేసులను మాత్రం ప్రత్యేక దృష్టి సారించి మరీ పరిష్కరిస్తున్నారు. కొన్ని పీఎస్‌లలో సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఏసీపీలు కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి పలు కేసులలో భూ యజమానులు ఆగ్రహం కట్టలు తెంచుకొని.. హత్యలు చేసే స్థాయికి వెళ్లిపోతుండటం గమనార్హం. ఇటీవలి కాలంలో ఇలాంటి భూ తగాదాల నేపథ్యంలో హత్యలు జరగడమే ఇందుకు నిదర్శనం. చదవండి: మరోసారి తెరపైకి సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ పేరు అన్ని కేసుల్లో పోలీసుల ప్రమేయం ఉండదు.. చాలా మంది భూ యజమానులు వారి భూమి ఆక్రమణలకు గురైతే చాలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇది సివిల్ కేసు అని, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించినా సరే పోలీసులు పట్టించుకోవటం లేదని పలువురు భూ యజమానులు ‘పెద్ద’ మనుషులతో ఫోన్లు చేయించి, ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి భూ ఆక్రమణ కేసులో పోలీసుల ప్రమేయం ఉండదు. సివిల్, పోలీస్‌ల మధ్య ఉన్న స్పష్టమైన లక్ష్మణ రేఖను దాటకుండా.. పోలీసులు చర్యలు తీసుకుంటారు. సివిల్ కేసులకు న్యాయస్థానాలు, సబ్–రిజిస్ట్రేషన్ ఆఫీసులు వంటివి ఉన్నాయి. ఎవరి అధికారాల పరిధిలో వాళ్లు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. భూ తగాదాలపై పోలీసులు, బాధితులకు సూచనలు చేసేందుకు ఇద్దరు న్యాయ సలహాదారులను నియమించారు. ఏ తరహా కేసులపై పోలీసులు జోక్యం చేసుకోవాలి, ఏ తరహా విధానాలను అనుసరించాలనే పలు అంశాలపై సూచనలు ఇస్తుంటారు. రోజుకు 15 ఇలాంటి కేసులే.. కమిషనరేట్‌లో నన్ను కలిసేందుకు రోజుకు 20 మంది సందర్శకులు వస్తే.. ఇందులో 15 మంది భూమి తగాదాల బాధితులే ఉంటున్నారు. ఇందులో 5 కేసులు న్యాయబద్ధంగా ఉంటే.. మిగిలినవి క్రిమినల్ కేసులుంటున్నాయి. బాధితులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి దిశా నిర్దేశం చేస్తున్నాం. – మహేశ్ భగవత్, సీపీ, రాచకొండ -
సరూర్ నగర్ చెరువు ను సందర్శించిన రాచకొండ సీపీ మహేష్ భగత్
-
టాస్క్‌ఫోర్స్ పోలీసులమని పెప్పర్ స్ప్రేతో దాడి: సీపీ
సాక్షి, హైదరాబాద్ : టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి పెప్పర్ స్ప్రే తో పెట్రోలింగ్ సిబ్బంది పై దాడి చేసిన దొంగల ముఠాను పోలీసులు చేధించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారి వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు వర్ధన్ మనికందన్‌గా..అతనిది తమిళనాడుగా గుర్తించామన్నారు. ఘటన అనంతరం నిందితుడు వర్ధన్ మనికందన్ పరారయ్యాడని.. సీసీ ఫుటేజీ ద్వారా విచారణ చేపట్టగా వర్ధన్ మనికందన్‌తో పాటు పిల్లా యాదయ్య, షేక్ సయ్యద్, ఉపేంద్ర చారీ, లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుంచి 47.5 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు, 1ఎయిర్ పిస్తోల్, 2పెప్పర్ స్ర్పే బాటిల్స్, 3బైకులు, 3టీవీలు, 1పియానో, చోరీకి పాల్పడే వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2017 నుంచి మనికందన్ గ్యాంగ్ చోరీలు చేస్తున్నారని, వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో 27 కేసులున్నాయని వెల్లడించారు. ఉప్పల్, తుర్కపల్లి, ఎల్బీనగర్, మీర్ పేట్, వనస్థలి పురం, హయత్ నగర్ పీఎస్ లలో కేసులు ఉన్నాయన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన మల్లేష్ తో మనికందన్ గ్యాంగ్ చేతులు కలిపి గుప్తనిధుల కోసం కూడా తవ్వకాలు జరిపినట్లు సమాచారం ఉందని తెలిపారు. వీరిపై నల్గొండ జిల్లా దేవరకొండ పీఎస్‌లో కేసు నమోదైందని, నిందితుల గాలింపులో తమిళనాడు పోలీసులు చాలా సహకారం అందించారని పేర్కొన్నారు. అనంతరం ఈ కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులకు సీపీ రివార్డులు అందించారు. అదే విధంగా జవహర్ నగర్లో జరిగిన చోరీపై సీపీ మహేష్ భగవత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డిసెంబర్ 31 రోజున జరిగిన చోరీ కేసును చేధించామని ఆయన తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన వేలి ముద్రల ఆధారంగా తునా సంజయ్ సింగ్ అలియాస్ టమాటో సంజయ్, మనీష్ ఉపాధ్యాయ, ప్రదీప్ శ్యామ్‌లను అరెస్టు చేశామన్నారు. నిందితులది మేడ్చల్ జిల్లాగా.. నిందితుల నుంచి 66 తులాల బంగారం, 3.74 కేజీల వెండి ఆభరణాలు, రూ. 5,650 నగదు, ఒక డెల్ ల్యాప్‌టాప్, సోనీ హ్యండ్ కెమెరా, ఒక హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడి తునా సంజయ్ సింగ్ పై 8 కేసులు నమోదయ్యయని, నేరెడ్ మెట్, బేగంపేట, చిలకలగూడ పోలీస్ స్టేషన పరిధిలో కేసులున్నాయన్నారు. మనీష్ పై గతంలో ఆరు కేసులు ఉన్నాయని, సంజయ్ సింగ్ గతంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చి మళ్ళి చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. కేసును చేధించడంలో చురుగ్గా స్పందించి నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన వేలిముద్రల బృందానికి, పోలీసులకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ రివార్డులు అందించారు. -
దృశ్యం సినిమాను తలపించేలా కుట్ర చేశారు
-
రవిశేఖర్‌కు 2001 నుంచి నేరచరిత్ర ఉంది
-
‘శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్ మృతుల కుటుంబాలతో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చర్చలు ముగిసాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ఔట్సోర్సింగ్ ద్వారా బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వారు ఎప్పుడైనా ఉద్యోగంలో చేరవచ్చన్నారు. ఇప్పటికే హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాము.. దాంతో పాటు మరిన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సీసీ కెమరాలను మరమత్తు చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు. డీజీపీని కలిసిన టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు హాజీపూర్‌లో బాలికలను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన దారుణ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారని టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉన్నవారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, పోలీసులతో సీఎం చర్చించి పూర్వాపరాలు వెలికి తీయాలని ఆమె కోరారు. హాజీపూర్ వంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఐపీఎల్ మ్యాచ్‌లకు పటిష్ట భద్రత
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 38,000 వేల మందికి కెపాసిటీ గల ఉప్పల్ స్టేడియంలో అణువణువు నిఘా ఉంటుందని తెలిపారు. ఐపీఎల్‌కు 2300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు ఉంటుదని చెప్పారు. 300 సీసీ కెమెరాలు నిఘా మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతాయని అన్నారు. స్టేడియంలో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ స్టేడియంలో ఏర్పాటు చేశామన్నారు. స్టేడియం మొత్తం డాగ్ స్వాడ్, బాంబ్ శ్వాడ్ తనిఖీలు చేసినట్లు తెలిపారు. మొబైల్స్, ఇయర్ ఫోన్ స్టేడియం లోకి అనుమతి ఉంటుంది. హెల్మెట్, పవర్ బ్యాంక్, కెమెరా, లాప్ టాప్, బ్యాగ్స్, బ్యానర్ , మిగతా ఎలక్ట్రాన్ వస్తువలకు అనుమతి లేదన్నారు. ఆక్టోపస్, ప్లాటూన్, ఆర్మ్డ్ రిజర్వ్ పోర్స్ అంతా కలిపి 2300 మందితో భద్రత ఉంటుందన్నారు. మ్యాచ్ జరిగే రోజు 3 గంటల ముందు నుంచి స్టేడియం లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. మెట్రో రైలు సమయం రాత్రి 12 గంటల వరకు పొడిగింపు ఉంటుందని కమిషన్ర్ తెలిపారు. -
‘దళారులను నమ్మి మోసపోవద్దు’
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పలు సూచనలు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో నిరుద్యోగులకు గాలం వేసి ఉద్యోగాల పేరుతో దళారులు మోసం చేస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్బోర్టు అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిజికల్ టెస్ట్‌లు పాసైన వారు ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. కొంతమంది బ్రోకర్స్ తమకు పోలీస్ అధికారులతో పరిచయాలు ఉన్నాయని, డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని అభ్యర్థులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తమ వద్దకు వస్తున్నాయని, పోలీస్ ఉద్యోగ పరీక్షలు పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా జరుగుతున్నాయని కమిషనర్ వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
పోలీసుల ఆధీనంలో ఉప్పల్ స్టేడియం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఉప్పల్ స్టేడియానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఉప్పల్‌లో మొత్తం 7 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో రేపటి నుంచి స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. 2,500 మంది పోలీసులతో ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పిస్తామన్నారు. స్టేడియం ప్రాంగణంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. మ్యాచ్ ఉన్న రోజు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 9, 12, 22, 26, మే 5, 7, 19 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరుగనున్న మ్యాచ్( ఏప్రిల్ 22)కి వచ్చే వారికి మధ్యాహ్నం 1 గంట నుంచి అనుమతి ఉంటుందని , రాత్రి 8 గంటల మ్యాచ్‌లకి సాయంత్రం 5 గంటల నుంచి అనుమతి ఇస్తామన్నారు. మ్యాచ్‌లకు వచ్చేవారు ఒక సెల్ ఫోన్ మినహా, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, తిను బండరాలు కానీ అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. -
వాట్సప్ ‘గురు’..!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి...విధి నిర్వహణలో తీరిక లేని పనులు...దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన కమిషనరేట్‌కు బాస్ కావడంతో నిరంతరం శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలై ఉండాల్సిన పరిస్థితి...అయినా దేశంలో అత్యున్నతమైన పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు గురువు అవతారమెత్తారు. సివిల్స్ పరీక్షలో కీలకమైన ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సలహాలు, సూచనలను వాట్సాప్ గ్రూప్‌ల ఏర్పాటు ద్వారా అందించారు. ఇప్పటికే ‘సివిల్స్ గురు’గా అవతారమెత్తిన మహేష్ భగవత్ మార్గదర్శనంలో తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) విడుదలైన ఫలితాల్లో దాదాపు పది మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన అభ్యర్థులకు ఆయన సలహాలు అందించారు. ఇందులో పాటిల్ సుమిత్‌కుమార్ సుభాష్ రావు(7వ స్థానం), కాజోల్ పాటిల్ (11), ఆనంద్‌రెడ్డి (41), తవల్నిఖిల్ దశరథ్ (46), జాదవ్ సుదర్శన్ (47), కస్తూరి ప్రశాంత్ (56), శ్వేత (70), షిండే అమిత్ లక్ష్మణ్ (73), సతీశ్ ఆశోక్ (79), మానే శశాంక్ సుధీర్ (100) విజేతలుగా నిలిచారు. సివిల్స్ ఫలితాల్లో 84 మంది... మహేష్ భగవత్ సలహాలను పాటించిన 300 మందిలో 84 మంది గతేడాది సివిల్స్ ఫలితాల్లో అర్హత సంపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులతో ఆయన లోగడ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమేగాక సందేహాలను నివృత్తి చేశారు. ఆయన సలహాలు పొందిన వారిలో పుణేకు చెందిన వైశ్ణవి గౌడ్ 11వ ర్యాంక్ సాధించడం విశేషం. తొలి 100 ర్యాంకుల జాబితాలో ఆరుగురు స్థానం పొందారు. ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ తనయుడు ముజామిల్ ఖాన్ (22), ఒంగోలుకు చెందిన రిజ్వాన్ భాషా షేక్ (48), స్వప్పిల్ పాటిల్ (55), అన్వేష్ రెడ్డి (80), పర్జీత్ నాయర్ (87), శోడిశెట్టి మాధవి (104), పోలుమెట్ల అభిషేక్ (373), కపిల్ జీబీ గేడ్(401), శరత్చంద్ర ఆర్రోజు (425), వాసగిరి శిల్ప (547), రంజిత్ (555), మధుసూదన్‌రావు (588), కుమార్ చింత (608), పిన్నని సందీప్‌కుమార్ (732), నర్ర చైతన్య (733), బి.రవితేజ (741), కాపల పవన్‌కుమార్ (799), నరేశ్ మన్నే (979), ప్రేమ్ ప్రకాశ్ (1015), శాలిని (1047) వీరిలో ఉన్నారు. భవిష్యత్‌లోనూ అండగా... గతేడాది మొత్తం 1099 మంది సివిల్స్ ఎంపిౖకైతే వారిలో నేను సలహాలిచ్చిన 84 మందికి స్థానం దక్కడం సంతోషంగా ఉంది. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో నా మార్గదర్శనంలో సలహాలు, సూచనలు అందుకున్న పది మంది అభ్యర్థులు విజేతలుగా నిలవడం గర్వంగా భావిస్తున్నా. భవిష్యత్‌లోనూ వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా మరెంతో మంది అధికారులను వెలుగులోకి తెస్తా. అండగా ఉంటా. – మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
నేరాల నిరోధానికి బ్లూకోల్ట్స్: కమిషనర్
భువనగిరి: నేరాల నియంత్రణ కోసం శ్రమించే పోలీసుల కోసం బ్లూ కోల్ట్ వాహనాలను సమకూర్చినట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన భువనగిరి క్యాంపు (హెడ్ క్వార్టర్) ఆఫీస్‌లో 25 బ్లూ కోల్ట్ వాహనాలను ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం పోలీస్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారని చెప్పారు. డయల్-100కు ఫోన్ చేస్తే పోలీస్ సిబ్బంది తక్షణం హాజరై సమస్యలు పరిష్కరిస్తారని సీపీ వివరించారు. ఈ వాహనాలు భువనగిరి రూరల్, టౌన్ ఏరియాల్లో వినియోగించుకోవాలని సూచించారు. అంతకుమునుపు ఆయన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైళ్ల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.