సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్ మృతుల కుటుంబాలతో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చర్చలు ముగిసాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ ద్వారా బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వారు ఎప్పుడైనా ఉద్యోగంలో చేరవచ్చన్నారు. ఇప్పటికే హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాము.. దాంతో పాటు మరిన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సీసీ కెమరాలను మరమత్తు చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు.
డీజీపీని కలిసిన టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు
హాజీపూర్‌లో బాలికలను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన దారుణ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారని టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉన్నవారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, పోలీసులతో సీఎం చర్చించి పూర్వాపరాలు వెలికి తీయాలని ఆమె కోరారు. హాజీపూర్ వంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment