bommala Ramaram
-
బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్.. గురువారం విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ లీగల్ సెల్ ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. గురువారం డివిజన్ బెంచ్‌లో విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. అదే విధంగా బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో బీజేపీ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చారు. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చారు. అరెస్టు సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పోలీసులు పాటించలేదని పిటిషన్లో తెలిపారు. కాగా తీవ్ర ఉద్రిక్తత నడుమ మంగళవారం అర్థరాత్రి కరీంనగర్లో బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బలవంతంగా పోలీస్ వాహనంలో బొమ్మలరామారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే ఎందుకు అరెస్టు చేశారనే విషయంపై పోలీసుల నుంచి స్పష్టత రాలేదు. బండి సంజయ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. 41crpc కింద ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయనున్నారు. అనంతరం నల్గొండకు తరలించే అవకాశం ఉంది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పీఎస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బొమ్మలరామరం పీఎస్‌కు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మహిళాకార్యకర్తలు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. సంజయ్‌ను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డుకున్న పోలీసులతో రఘునందన్ రావు వాగ్వాదానికి దిగారు. చదవండి: బండి సంజయ్ అరెస్ట్.. బొమ్మలరామారం పీఎస్ వద్ద హైటెన్షన్! -
హాజీపూర్ నిందితుడిని కూడా అలానే చంపండి
సాక్షి, హైదరాబాద్: హాజీపూర్ వరుస హత్యలు చేసిన నిందితుడిని ఉరి తీయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘం నేతలు గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను కోరారు. ఈ మేరకు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయాలని, తమ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి జిల్లాకో ఘటనలు జరుగుతున్నాయి. గవర్నర్ కూడా తన లిస్ట్‌లో హాజీపూర్ సమస్య ఉందని, తనకు మొత్తం తెలుసన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని సానుకూలంగా స్పందించార’ని పేర్కొన్నారు. బాధితురాళ్ల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలన్నారు. దిశ ఘటనలో నిందితులను ఎలా చంపారో శ్రీనివాస్‌ను కూడా అదే విధంగా చంపాలని గవర్నర్ కోరామని తెలిపారు. చదవండి: తుదిదశకు ‘హాజీపూర్’ విచారణ -
‘దిశ’ ఘటన నేపథ్యంలో మళ్లీ తెరపైకి ‘హాజీపూర్’
సాక్షి, బొమ్మలరామారం: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో యువతులు, మహిళలు, బాలికలపై దారుణాలు నానాటికి పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆగ్రహం తారస్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లాలో దిశపై సామూహిక అత్యాచారం, హత్య, వరంగల్‌లో గాదం మానస అత్యాచారం, హత్యల నేపథ్యం, ముగ్గురు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి అతి దారుణంగా హత్యలు చేసిన నిందితుడు సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష పడడంలో జరుగుతున్న జాప్యంపై మండల ప్రజలు గుర్రుగా ఉన్నారు. మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే కఠిన శిక్షలు ఖారారు అయితేనైనా నేరం చేసే వారికి వెన్నులో వణుకు పుట్టేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఎవ్వరిని కదిలించినా సైకో శ్రీనివాస్ రెడ్డి దారుణాలనే గుర్తు చేసుకుంటున్నారు. కొందరు మహిళలు కంటతడి పెడుతూ మర్రి శ్రీనివాస్ రెడ్డిపై శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రంలో యువతులపై జరుగుతున్న దారుణాలపై హాజీపూర్ గ్రామంలో ప్రజలందరూ శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలపై చర్చించుకుంటున్నారు. అక్టోబర్ నుంచి హాజీపూర్ కేసు కోర్టులో విచారణ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు అక్టోబర్ 10వ తేదీన నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. బాధిత కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్తులు, జిల్లా పోలీస్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు 120 మందికి కోర్టు సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జూలై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే.. నేరాలకు పాల్పడే వారిపై చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల మాదిరిగా నేరం చేసిన వారికి తక్షణమే శిక్షలు పడే వ్యవస్థ రావాలి. కోర్టులు, పోలీసులు విచారణలంటూ జాప్యం చేస్తే చట్టంలో ఉన్న లోసుగులు నేరస్తులకు తప్పించుకునే వెసులుబాటు దొరుకుతుంది. హాజీపూర్ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే శిక్ష పడితే ఇతర ప్రాంతాల్లో నేరం చేయాలనే వ్యక్తులకు కనువిప్పు కలిగేది. – దాసరి జంగారెడ్డి, హాజీపూర్ బతకనివ్వొద్దు జైలుకు వెళ్లయినా సరే శ్రీనివాస్ రెడ్డిని చంపాలనే కసి ఉంది. ముగ్గురు పిల్లలను పాడు చేసిన వాళ్ల పానాలు తిన్న శ్రీనివాస్ రెడ్డిని జైలుకు వెళ్లిన సరే చంపేయాలన్నా కసిగా ఉంది. ఇలాంటి రాక్షసులను భూమి మీద బతకనివ్వొద్దు. శ్రీని వాస్ రెడ్డి దారుణాలలో కుటుంబ సభ్యుల పాత్ర ఉంది. వారికి ఉన్న ఆస్తులను అమ్మి గ్రామాభివృద్ధికి వినియోగించాలి. – గోండ్రు జయమ్మ హాజీపూర్ రక్షణ కరువైంది.. హాజీపూర్‌లో జరిగిన ఘోరాలు మరవలేకపోతున్నాం. తప్పు చేసినోన్ని ఎన్ని రోజులు మేపుతారు. నెలలు గడుస్తున్నా నేటికీ భయంగానే ఉంది. ఎక్కడ చూసినా ఆడోళ్లకు రక్షణ లేకుండా పోయింది. శ్రీనివాస్ రెడ్డికి శిక్ష పడితేనే కొంత ఉపశమనం కలుగుతుంది. సర్కారోళ్లు నేరస్తుల పట్ల కఠినంగా ఉండకనే కొత్తోళ్లు తయారవుతున్నారు. – పరిధ దుర్గమ్మ, హాజీపూర్ ప్రజలకు అప్పగిస్తే బాగుండు.. ఆడ పిల్లల ఉసురు తీసిన మర్రి శ్రీనివాస్ రెడ్డిని సంఘటన జరిగినప్పడే ప్రజలకు అప్పగిస్తే బాగుండే. ఊరోళ్లే సరైన శిక్ష వేసేటోళ్లు. జైళ్లలో కూసపెట్టి సాదుడు ఎందుకు ఇదివరకే సావ కొడితే ఆడోళ్ల దిక్కు చూసేటోళ్లు ఉండకపోదురు. ప్రజలందరికీ ఎప్పటికి గుర్తుండే శిక్షపడితే తప్పు చేసేటోళ్లకు సిగ్గొస్తది. – దాసరి చంద్రారెడ్డి, హాజీపూర్ ఉరిశిక్షే సరైంది నిందితుడు సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్షే సరైంది. అతని పేరు వింటేనే ఆడపిల్లలు ఉలిక్కి పడే పరిస్థితి ఉంది. గ్రామంతో పాటు మండల ప్రజలందరూ నిందితుడికి బహిరంగంగా శిక్ష విధించాలని కోరుతున్నారు. అతనికి పడిన శిక్షతోనే చిన్నారుల ఆత్మలు శాంతిస్తాయి. – పక్కీరు రాజేందర్‌రెడ్డి, హాజీపూర్ విచారణలో వేగం పెరిగింది హాజీపూర్ బాలి కల వరుస హత్య ల కేసులో విచారణలో వేగం పెరి గింది. ఈ కేసుల్లో ప్రథమంగా బలైన తుంగని కల్పన కేసు మూడేళ్ల క్రితం నాటిది కావడంతో కొంత జాప్యం జరి గింది. నేటికీ 100 మందికి పైగా సాక్షులను కోర్టు విచారణ చేసింది. మరికొంత మందిని విచారణ చేయాల్సి ఉంది. మరో రెండు వారాల పాటు కోర్డులో సాక్షుల విచారణ జరిగే అవకాశం ఉంది. అనంతరం నిందితుడికి కోర్డు శిక్షను ఖరారు చేయనుంది. మహిళలు, యువతులు పోలీసులు వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అవగాహన పెంచుకోవాలి. స్మార్ట్ ఫోన్లలో యువత మహిళల రక్షణ కోసమే రూపొందించిన హాక్–ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ మేరకు అన్ని కళాశాలల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఏసీపీ భుజంగరావు, హాజీపూర్ బాలికల హత్య కేసుల విచారణ అధికారి -
హాజీపూర్ కేసు నేడు కోర్టులో విచారణ
సాక్షి, బొమ్మలరామారం: పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు సోమవారం నల్లగొండ కోర్టులో విచారణకు రానుంది. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు కోర్టునుంచి సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన విషయం విధితమే. ఈ కేసుల్లో వరంగల్ సెం ట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జులై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఎలాంటి శిక్షలు ఖరారు చేస్తుందోనని మండలంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. చదవండి: సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు -
మర్రిబావిలో మరో రెండు మృతదేహాలు?
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్‌రెడ్డి.. తన మర్రి బావిలో మరో రెండు మృతదేహాలను పూడ్చిపెట్టాడనే ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి తనతో పాటు లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే దంపతులను హతమార్చి మర్రిబావిలోనే పూడ్చిపెట్టాడని గ్రామంలో చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ పోలీస్ కస్టడీ నల్లగొండ లీగల్: ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌రెడ్డిని 3 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నల్లగొండ అదనపు జిల్లా జడ్జి ఎస్‌వీవీఎన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని గతనెలలో వారంపాటు పోలీసు కస్టడీకి ఇచ్చిన కోర్టు.. మరో రెండు కేసుల విచారణ నిమిత్తం మూడు రోజులు కస్టడీకి అనుమతించింది. -
హాజీపూర్ బాధితుల దీక్ష భగ్నం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్‌కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళ్తే.. హత్యకు గురైన ముగ్గురు బాలికల కుటుంబాలు, బంధువులు, గ్రామస్తులు బొమ్మలరామారంలో గురువారం నుంచి ఆందోళన చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా దీక్ష శిబిరంలో నిద్రిస్తున్న బాధితులను శనివారం తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 మందిని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న దీక్ష శిబిరాన్ని తొలగించి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు. దీక్షలో కూర్చుని అనారోగ్యం బారిన పడిన పక్కీరు రాజేందర్‌రెడ్డి, పాముల ప్రవీణ్‌లను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. వారి ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడ్డాక తిరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శనివారం ఉదయం మొదటి విడతలో 15 మందిని వదిలివేశారు. మిగతా వారిని తర్వాత వదిలేశారు. కొనసాగుతున్న పోలీస్ పికెట్ ఆందోళనలతో అట్టుడుకుతున్న హాజీపూర్ గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. వరుస హత్యలు వెలుగు చూసిన నాటినుంచి గ్రామంలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. కాగా, శాంతియుతంగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారనే సమాచారంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుం ది. గ్రామంలోని మహిళలందరూ కలసి బొమ్మలరామారం మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేసేం దుకు సిద్ధమయ్యారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వ్యక్తులను విడిచి పెట్టారని తెలిసి ధర్నా ప్రయత్నా న్ని విరమించారు. పోలీసులు వదలిపెట్టాక బాలికల ను హత్య చేసిన బావిలోకి దిగి నిరసన చేట్టారనే సమాచారంతో తెట్టెబావి వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. తెట్టె బావిలోకి దిగిన బాధితులు ప్రభుత్వం తాము శాంతియుతంగా చేపట్టిన దీక్షను భగ్నం చేసిందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బాధిత కుటుంబాల సభ్యులు శ్రావణి, మనీషాలపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన తెట్టెబావిలోకి దిగి అరగంటకుపైగా నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించి బావి నుంచి బయటకు వచ్చారు. తర్వాత కలెక్టర్‌ను కలసి తమ డిమాండ్లను వివరించారు. బాధితుల డిమాండ్లను సావధానంగా విన్న కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నా కొడుకును ఉరి తీయాలి శ్రీనివాస్‌రెడ్డి తండ్రి బాల్‌రెడ్డి బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసులో తన కొడుకు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలని నిందితుడి తండ్రి బాల్‌రెడ్డి శనివారం మీడి యా ముందు కోరారు. శ్రీనివాస్‌రెడ్డి దురాగతాలు తమకు తెలియవన్నారు. గతంలో కర్నూల్లో ఓ కేసు విషయమై బెయిలుపై విడిపించామని తెలిపారు. శ్రావణి హత్యకు పాల్పడినప్పుడు మృతదేహాన్ని వెలికి తీస్తున్న సమయంలో తమతోపాటే తన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి బావి వద్దనే ఉన్నాడన్నారు. మృతదేహాన్ని వెలికి తీసే సమయంలో, మరుసటి రోజు అతని ముఖంలో ఎలాంటి భ యం, ఆందోళన కనిపించలేదన్నారు. ఏదైనా పనిచేయాలని చెబితే తనవైపు ఉరిమి చూసేవాడని బాల్‌రెడ్డి వెల్లడించారు. అనుమానంతో పోలీసులు ఇంటికి వస్తే ఈ హత్యలలో నీ హస్తం ఏమైనా ఉందా? అని అడిగితే.. ‘నీకేం భయం వద్దు. ఆ హత్యలతో నాకేం సంబంధం లేదు’అని బుకాయించాడన్నారు. ఆధారాలు లభించవు అన్నాడు శ్రావణి పోస్ట్‌మార్టంలో అన్ని విషయాలు బయటæపడతాయని తాను కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు శ్రీనివాస్‌రెడ్డి తనకేమీ పట్టనట్లుగా ఉన్నాడని అతని సోదరుడు మర్రి సుధాకర్‌రెడ్డి తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిందని.. పోస్టుమార్టంలో కూడా ఆధారాలు లభించవని శ్రీనివాస్‌రెడ్డి బుకాయించాడని పేర్కొన్నారు. తన సోదరుడు ఇలాంటి క్రూరుడనే విషయం తెలిసి చాలా బాధపడుతున్నామని తెలిపారు. తాను కష్టపడి కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన సోదరుడు చేసిన పనికి తమను ఎవరూ రానివ్వడం లేదని, హైదరాబాద్ బస్టాండ్లలో తల దాచుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న బాధిత కుటుంబాలు బాధితుల డిమాండ్లు ఇవీ.. - నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఉరిశిక్ష పడేట్టు చేయాలి. దీనిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కరించాలి. - ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. - బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. - హజీపూర్–మాచన్‌పల్లి మధ్యన శామీర్‌పేట వాగుపై బ్రిడ్జిని నిర్మించాలి. హజీపూర్, మైసిరెడ్డిపల్లి, తిరుమలగిరి, నాగినేనిపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి. - నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన భూమిని బాధిత కుటుంబాలకు పంచాలి. -
మేడిచెట్టుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి పూజలు
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడి అమానుషంగా చంపిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి దినచర్యలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఎవరితోనూ పెద్దగా స్నేహంగా ఉండని శ్రీనివాస్‌రెడ్డి గ్రామ సమీపంలోని శమాసుల బావి వద్ద గల మేడిచెట్టుకు నిత్యం పూజలు నిర్వహించేవాడు. శ్రీనివాస్‌రెడ్డి అరాచ కాలు వెలుగులోకి రాక ముందు నుంచే ఈ మేడిచెట్టుకు అతను పూజలు నిర్వహించేవాడని తెలుస్తోంది. మేడిచెట్టు ఉన్న ప్రాంతంలోనే వేప, రాగి చెట్లు కూడా ఉన్నాయి. ఏమైనా దోషాలు ఉంటే నివారణ కోసం చెట్లకు పూజలు చేయడం సాధారణం. మరి కొందరు తమకు అంతా శుభం జరగాలనే ఇలాంటి చెట్లకు పూజలు నిర్వహిస్తారు. అదే కోణంలో శ్రీనివాస్‌రెడ్డి మేడిచెట్టుతో పాటు రాగి, వేప చెట్లకు పూజలు చేయడాన్ని గ్రామస్తులు పట్టించుకోలేదు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పూజలపై ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. మేడిచెట్టుపై మూడు పేర్లు శ్రీనివాస్‌రెడ్డి నిత్యం పూజచేసే మేడిచెట్టుపై మూడు పేర్లు చెక్కి ఉన్నాయి. అందులో ఒక పేరు మనీషాది కనిపిస్తోంది. మరో రెండు శ్రావణి, కల్పన పేర్లుగా భావిస్తున్నారు. రోజూ ఈ చెట్ల వద్దకు వచ్చే శ్రీనివాస్‌రెడ్డి నీళ్లు పోసి పసుపు, కుంకుమ బొట్లను చెట్టు మొదట్లో పెట్టి పూజలు చేసేవాడని సమాచారం. హత్యలు వెలుగులోకి వచ్చినా పూజలు.. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి మేడిచెట్టు, రాగి, వేప చెట్లకు చేస్తున్న పూజల వెనక బలమైన కారణం ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాలలో మొదటగా వెలుగులోకి వచ్చిన శ్రావణి హత్య అనంతరం కూడా ఈ చెట్లకు పూజలు కొనసాగించాడని తెలిసింది. హాజీపూర్ గ్రామంతోపాటు మండల ప్రజలందరూ భువనగిరి జిల్లా ఆస్పత్రికి శ్రావణి మృతదేహంతో ధర్నాకు వెళ్తుంటే ఇతను మాత్రం ఈ మేడి, రాగి, వేప చెట్లకు పూజలు చేస్తూ గ్రామస్తుల కంట్లో పడ్డాడు. బాలికలపై దారుణాలకు ఒడికట్టింది శ్రీనివాస్‌రెడ్డేనని తెలియక ఈ అంశాన్ని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. మూడు హత్యలకు పాల్పడి.. ఎలాంటి బెరుకు లేకుండా చెట్లకు పూజలు చేయడమేంటని హాజీపూర్ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్‌లో కలకలం
-
చెట్లపై చిన్నారుల పేర్లు.. హాజీపూర్‌లో కలకలం
సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రావణి, మనీషా, కల్పన అనే చిన్నారులను అత్యంత పాశవికంగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి హతమార్చాడు. ఈ సీరియల్ మర్డర్స్‌పై ఒకవైపు పోలీసులు విచారణ జరుపుతుండగా.. మరోవైపు హాజీపూర్ గ్రామస్తులు ఆ కామాన్మాదిని ఉరితీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తన పొలానికి తీసుకెళ్లి బాలికలపై అత్యాచారం జరిపి.. హతమార్చిన శ్రీనివాస్‌రెడ్డి.. తన పొలంలోని పాడుబడ్డ బావిలో బాలికల మృతదేహాలను విసిరేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాజీపూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మేడిచెట్టుపై మనీషా అనే పేరును రాసి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. మేడిచెట్టుపై మృతురాలైన బాలిక పేరు ఉండటం హాజీపూర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ రావి, మేడి, వేపచెట్లు పక్కపక్కనే ఉండడంతో.. వాటికి శ్రీనివాస్‌రెడ్డి గతంలో పూజలు చేస్తూ ఉండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల వరుస హత్యలు వెలుగుచూసిన నేపథ్యంలో ఇక్కడ మేడిచెట్టుపై మనీషా అనే పేరు చెక్కి ఉన్న విషయాన్ని తాజాగా గుర్తించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డే.. మేడిచెట్టుపై ఇలా చెక్కి ఉండాటని, బాలికలను హతమార్చిన తర్వాత వారి పేర్లను అతను చెట్ల మీద చెక్కుతున్నట్టు కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్‌లో కలకలం -
‘శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్ మృతుల కుటుంబాలతో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చర్చలు ముగిసాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ఔట్సోర్సింగ్ ద్వారా బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వారు ఎప్పుడైనా ఉద్యోగంలో చేరవచ్చన్నారు. ఇప్పటికే హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాము.. దాంతో పాటు మరిన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సీసీ కెమరాలను మరమత్తు చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు. డీజీపీని కలిసిన టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు హాజీపూర్‌లో బాలికలను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన దారుణ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారని టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉన్నవారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, పోలీసులతో సీఎం చర్చించి పూర్వాపరాలు వెలికి తీయాలని ఆమె కోరారు. హాజీపూర్ వంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
నాలుక్కరుచుకున్న ఉమా మాధవరెడ్డి..!
సాక్షి, భువనగిరి : సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి చర్యతో టీఆర్ఎస్ నాయకులు, ఆమె తనయుడు అవాక్కయ్యారు. బొమ్మల రామారం జెడ్సీటీసీ అభ్యర్థిగా ఆమె కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తరపున ప్రచారం నిర్వహించిన ఉమా పొరపాటుగా మాట్లాడి నాలుక్కచురుకున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరి అక్కడున్న వారందర్నీ షాక్‌కు గురిచేశారు. పక్కనే ఉన్న సందీప్‌రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నాయకులు కారు గుర్తు అని సూచించడంతో తేరుకున్న ఆమె.. కారు గుర్తుకు ఓటేసి సందీప్‌రెడ్డిని భారీ మెజారితో గెలిపించాలని కోరారు. కాగా, తెలుగుదేశం పార్టీని వీడి గులాబీ గూటికి చేరినా ఉమా మాధవరెడ్డి పాత పార్టీని మరచిపోనట్టున్నారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. (చదవండి : టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా) -
ఛార్జ్‌షీట్
-
హాజీపూర్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: శ్రీనివాసరెడ్డి చేసిన దురాగతాలతో హాజీపూర్ వణికిపోతోంది. ఎప్పుడు, ఏం బయటపడుతుందోనన్న ఆందోళన గ్రామస్థులను వెంటాడుతోంది. తమ మధ్యే అమాయకంగా తిరిగిన శ్రీనివాసరెడ్డి... ఓ నరరూప రాక్షసుడనుకోలేదన్నది జనం మాట. ఇప్పటివరకు స్వేచ్ఛగా వ్యవహరించిన పిల్లలు, పెద్దలు ఇప్పుడు చీకటి పడిందంటే ఆందోళన చెందుతున్నారు. రోడ్డు నుంచి బావి మీదుగా ఊరికి వచ్చేప్పుడు జనాన్ని భయం వెంటాడుతోంది. ఆరు రోజుల నుంచి ఇప్పటివరకు హాజీపూర్ ఎలా ఉంది? ఈ పరిస్థితులను తెలుసుకునేందుకు సాక్షి టీవీ గ్రామంలో పర్యటించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. హాజీపూర్ నుంచి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వప్న అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. హాజీపూర్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్‌ను ఇక్కడ చూడండి.. -
సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి బైక్ వీడియో వైరల్
శ్రీనివాస్‌రెడ్డి ఎప్పుడూ ఎవరితోనూ కలవడు. ఎవరికీ ఎక్కువగా కనిపించడు. కానీ, ఏదైనా అఘాయిత్యం చేసినప్పుడు మాత్రం అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తాడు. తద్వారా తనపై అనుమానం రాకుండా చూసుకుంటాడని తెలుస్తోంది. అదే క్రమంలో ఈ నెల 26వ తేదీన హఠాత్తుగా ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. ఊరి మధ్యలో ఉన్న చిన్న ఖాళీ ప్రదేశంలో పిల్లలు క్రికెట్ ఆడుతుంటే తాను కూడా ఆడాడు. మర్నాడు తన పాఠశాల మిత్రుడి పెళ్లికి భువనగిరి వెళ్లాడు. మిత్రులతో కలిసి విందులో పాల్గొని చిందులేశాడు. శ్రీనివాసరెడ్డిలో ఉత్సాహం చూసి తాము ఆశ్చర్యపోయామని.. ముభావంగా ఉండే అతను ఇంతలా ఆనందించడం తాము ఎప్పుడూ చూడలేదని చిన్ననాటి మిత్రులు తెలిపారు. అయితే, తాను చేసిన ఘోరం బయటపడకుండా, అనుమానం రాకుండా ఉండేందుకే తన స్వభావానికి విరుద్ధంగా శ్రీనివాస్‌రెడ్డి ప్రవర్తించాడని ఇప్పుడు అర్థమవుతోందన్నారు. 25న పాఠశాలకు వెళ్లివస్తున్న బాలికకు లిఫ్ట్ ఇచ్చి బావివద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. దీని వెనుక తానే ఉన్నట్లు ఎవరికీ అనుమానం రాకూడదనే... ఊర్లోకి వచ్చి క్రికెట్ ఆడినట్లు, తర్వాత రోజు మిత్రులతో కలిసి పెళ్లిలో చిందులు వేసినట్లు విశ్లేషిస్తున్నారు. తాజాగా అతను ఒక బైక్ మీద వెనుక కూర్చొని.. హల్చల్ చేస్తూ ప్రయాణిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్‌రెడ్డి మొహంలో ఎప్పుడూ ఎలాంటి భావం కనిపించదని... అతడితోపాటు పదో తరగతి వరకూ చదివినవాళ్లు చెబుతున్నారు. వాళ్ల క్లాస్‌లో 150 మంది ఉండేవారని, వారిలో ఏ ఒక్కరితోనూ శ్రీనివాస్‌రెడ్డి కలిసిపోయేవాడు కాదన్నారు. చదువుల్లో వెనుకబడి ఉండేవాడని, ఒక్కోసారి ఉపాధ్యాయులు కర్రతో కొడుతుంటే ఎన్ని దెబ్బలైనా తినేవాడు కానీ అతడి మొహంలో బాధ, భయం వంటి భావాలేవీ కనిపించేవి కాదంటున్నారు. ఊర్లోనూ ఎవరితో కలిసేవాడు కాదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంతటి తీవ్రనేర స్వభావం ఉన్న వ్యక్తి ఇన్నేళ్ల నుంచీ ఎందుకు ఖాళీగా ఉంటాడనేది ప్రశ్న. ఈ మధ్యకాలంలోనూ ఇలాంటి అఘాయిత్యాలు చేసి ఉండొచ్చని, అవేవీ బయటకు వచ్చి ఉండవని పోలీసులు అనుమానిస్తున్నారు. లిఫ్టు మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌రెడ్డి అనేక ప్రాంతాలు తిరుగుతుంటాడు. దీనిలో భాగంగానే కర్నూలు వెళ్లి అక్కడ ఒక యువతిని హత్యచేసి పీపాలో కుక్కాడు. ఫేస్బుక్ ఖాతాలో 631 మంది స్నేహితులు ఉంటే వారిలో పురుషులు 50 మంది కూడా లేరు. మిగతా యువతులంతా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారు. ఆ పరిచయంకొద్ది ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఏమైనా చేసి ఉంటాడా? అనేది అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో అదృశ్యమైన యువతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాంతోపాటు హాజీపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విచారిస్తున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ద్వారా ఈ అనుమానాలన్నీ నివృత్తి చేసుకునేందుకు మరోమారు తమ అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఒక మహిళను వేధించడంతో ఊరివారంతా కలిసి శ్రీనివాస్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అది శ్రీనివాస్‌రెడ్డి మనసులో బలంగా నాటుకుపోయిందని అతన్ని విచారించిన అధికారులు చెబుతున్నారు. ఎవర్నైనా బలవంతం చేసినప్పుడు వారు ఒప్పుకోకపోతే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేసేవాడు కాదని...ఒకవేళ వారు బయటకెళ్లి చెబితే మళ్లీ కొడతారనే భయంతో అక్కడే హతమార్చేవాడని తెలిపారు. ఇదే అతడి మనస్తత్వమని శ్రీనివాస్‌రెడ్డిని విచారించిన ఓ అధికారి తెలిపారు. యాదాద్రి భువనగిరిజిల్లా హాజిపూర్‌లోని సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని పోలీసులు కస్టడీకి కోరనున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పథకం ప్రకారమే సిరియల్ హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ఫోన్ డేటా, ఫేస్బుక్ ఐడీని పోలీసులు పరిశీలిస్తున్నారు.నిందితుడు శ్రీనివాసరెడ్డి తరచూ కరీంనగర్ ప్రాంతాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. బొమ్మలరామారం బాలికల అదృశ్యం, హత్య ఘటనలపై తీవ్రంగా స్పందించిన రాచకొండ సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
బృందావన్ గెస్ట్‌హౌస్‌లో ఫేర్వెల్..! అదే చివరి పార్టీ
బొమ్మలరామారం (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు సాయి చైతన్యారెడ్డి, మేరెడ్డి స్ఫూరిరెడ్డి, ప్రణీతలు మృతిచెందగా తీవ్రంగా గాయపడిన వినిత్‌రెడ్డి (22)ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. మరో విద్యార్థి మనీష్‌రెడ్డి రాజధానిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే..ప్రమాదానికి మైసిరెడ్డిపల్లి శివారులోని ప్రమాదకరంగా ఉన్న మూలమలుపే ప్రధాన కారణంగా తెలుస్తోంది. (చదవండి : కన్నవారికి...కడుపు కోత) ఇబ్రహీంపట్నం శ్రీ హిందు ఇంజనీరింగ్ కళశాల విద్యార్థులు పరీక్షలు ముగిశాక మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని బృందావన్ గెస్ట్‌హౌస్‌లో ఫేర్వెల్ చేసుకున్నారు. వేడుకలో 16 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. మధ్యాహ్నం ప్రారంభమైన పార్టీ రాత్రి పది గంటల వరకు కొనసాగినట్లు సమాచారం. పార్టీ జరుగుతున్న క్రమంలోనే ఐదుగురు విద్యార్థులు మండల కేంద్రం నుంచి బీబీనగర్ వైపు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో ఎదురుగా పోలీస్ వాహనం ఎదురైంది. దానిని కట్ కొట్టి కారును వేగంగా ముందుకు నడిపారు. పోలీసులు గమనించి రాత్రివేళ ఇంత వేగంతో కారు వెళ్లడమేంటని తిరిగి వారు తమ వాహనంలో కారును ఫాలోఅయ్యారు. కొద్దిదూరం వెళ్లగానే విద్యార్థుల కారు ఫల్టీకొట్టి కనిపించింది. అయితే కారు నడుపుతున్న విద్యార్థికి మైసిరెడ్డిపల్లి శివారులో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ప్రమాదకర మూలమలుపుపై అవగాహన లేకపోవడం.. అతివేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఘటనాస్థలిని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా.. మండలంలో పలు ఫాం హౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొమ్మలరామారం మండలం రాజధానికి అతి మీపంలో ఉండడంతో కొందరు యువత వీకెండ్ పార్టీలకు ఇతర జల్సాలకు మండలంలోని పలు ప్రాంతాల్లో గల ఫాం హౌస్‌లను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొందరు ఫాంహౌŠలు నిర్వహిస్తూ యువతను ఆకర్షించేందుకు విఫలయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిషేధిత మాధకద్రవ్యాలతో పాటు హూక్కా, మద్యం సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ‘బృందావన్పూర్’లో అన్నీ.. మంగళవారం శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు వేడుక జరుపుకున్న బృందావన్ ఫాంహౌస్‌పై కూడా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. అయితే గెస్ట్ హౌస్‌ను అద్దెకు తీసుకుంటే కస్టమర్ల అవసరం మేరకు మద్యంతో పాటు డ్రగ్స్‌ను అందజేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ గెస్ట్ హౌస్‌లో ప్రతి వీకెండ్లతో పాటు రాత్రి సమయాల్లో యువకుల కేరింతలు, హోరెత్తే లౌడ్ స్పీకర్ల సౌండ్లతో ఇబ్బందులు పడుతున్నామని పరిసరాల ప్రజలు వాపోతున్నారు. ఈ గెస్ట్ హౌస్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు గంజాయి,కొకైన్ లాంటి డ్రగ్స్‌కు మండలానికి చెందిన కొంత మంది యువకులు బానిసలుగా మారుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఇలాంటి ఘనటలు ఆందోళన కల్గిస్తున్నాయి. పోలీసులు నిఘా వైఫల్యంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండల ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. (చదవండి : అతివేగమే నలుగురిని బలి తీసుకుంది..!) కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత భువనగిరిఅర్బన్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాలకు బుధవారం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఏరియా ఆస్పత్రి మిన్నంటిపోయింది. మృతుల కుటుంబాలకు పరామర్శ మృతుల కుటుంబాలను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పరామర్శించారు. భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించారు. ప్రమాదం జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. నరేందర్‌రెడ్డిని ఓదారుస్తున్న రాజగోపాల్‌రెడ్డి -
అతి వేగం...దానికి తోడు మూల మలుపు..
సాక్షి, యాదాద్రి : బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో గత రాత్రి జరిగిన ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. దానికి తోడు మూల మలుపు. దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మలుపు వద్ద బోల్తా పడినట్టు ఘటనా స్థలంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదంలో కారు తుక్కుతుక్కయింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి విషమంగా వుంది. వారంతా ఇబ్రహీంపట్నం శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా భావిస్తున్నారు. చదవండి...(రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల దుర్మరణం) బొమ్మలరామారంలోని ఓ పెట్రోల్ బంక్ ఆవరణలో వున్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌజ్‌లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. అనంతరం అందరూ కలిసి హోండా కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రాత్రి 10.30-10.45 గంటల మధ్య నాగినేనిపల్లి వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ఘోరం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నల్లగొండకు చెందిన స్ఫూర్తి, చాదర్‌ఘాట్‌కు చెందిన ప్రణీత, చంపాపేట ప్రగతినగర్‌కు చెందిన చైతన్యలు అక్కడికక్కడే చనిపోయారు. ఇదే ఘటనలో కుంట్లూరుకు చెందిన మనీష్ రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా వినీత్ రెడ్డి తుది శ్వాస విడవగా మనీష్ రెడ్డి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఇక మృతి చెందినవారిలో ప్రణీత వాళ్ళ అమ్మ, నాన్న అమెరికాలో ఉంటున్నట్లు తెలిసింది. చాదర్‌ఘాట్‌లోని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది. స్ఫూర్తిరెడ్డి స్వస్థలం నల్గొండ. చైతన్య స్వస్థలం అవంగపట్నం, నారాయణ పేట్ మండలం, మహబూబ్ నగర్, ప్రస్తుతం వీరు హైదరాబాద్ జిల్లలగూడా గాయత్రి నగర్లో ఉంటున్నారు. వినీత్ రెడ్డి స్వస్థలం కోహెడ, అబ్దుల్లా పూర్ మెట్. ఈ ఘటనలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనీష్ రెడ్డి స్వస్థలం హయత్ నగర్, కుంట్లూరు. మృతి చెందిన చైతన్య, స్ఫూర్తి, వినీత్, ప్రణీత మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఉదయం భువనగిరి ఏరియా ఆస్పత్రికిని విద్యార్థుల మృతదేహాలను సందర్శించి, సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. -
కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరు : బూడిద భిక్షమయ్య
సాక్షి, బొమ్మలరామారం : కాంగ్రెస్ గెలుపును ఏ శక్తీ అ డ్డుకోలేదని ఆలేరు అసెంబ్లీ మహాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పిల్లిగుండ్ల తండా, మర్యాల, చౌదర్పల్లి, కాండ్లకుంట తండా, గోవింద్ తండా, లక్క తండా, సీత తండా, చీకటిమామిడి, సోలిపేట్, ప్యారారం, తి మ్మాపూర్, బోయిన్పల్లి గ్రామాల్లో సోమవారం ని ర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవాలంటే కాంగ్రెస్æ పార్టీకే పట్టం కట్టాలన్నారు. మరోసారి తనను ఆదరించి ఆలేరు అభివృద్ధికి దో హదం చేయాలని భిక్షమయ్యగౌడ్ ఓటర్లను కో రారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభయహస్తం పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచుతామన్నారు. ఆడ పిల్లలకు వరంలాంటి బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ఆరు లక్షలతో ఎస్సీ, ఎస్టీలకు, ఐదు లక్షల వ్యయంతో బీసీ ఓసీ లకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. బంగారు తెలంగాణ అంటూ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుం బమే బంగారుమయం చేసుకున్నాడన్నారు. కేసీ ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకితోసి రెండు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. పీఏ సీఎస్ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సింగిర్తి మల్లేష్, బొల్లంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పడమటి పావని, తిరుమల కృష్ణగౌడ్, అన్నెమైన వెంకటేష్, కట్టా శ్రీకాంత్‌గౌడ్, మర్రి ఆగం రెడ్డి, రామిడి జంగారెడ్డి, ఎనగండ్ల వీరేశం, మాందాల రామస్వామి, చీర సత్యనారాయణ, బండ వెంకటేష్, మోటే గట్టయ్య, మ హదేవుని రాజు, మోటే వెంకటేష్, గుర్రం శ్రీని వాస్‌రెడ్డి, రాజు నాయక్, గుర్రాల సత్తిరెడ్డి, బో యిన్‌పల్లి రమేష్, శ్రీరాములు నాయక్, చంద్రశేఖర్, మోహన్‌నాయక్, రవికుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక.. మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో సోమవా రం గొల్లకురుమ సామాజిక వర్గానికి చెందిన 30 మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.ఆలేరు మ హాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ కాం గ్రెస్ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సైనికుడిలా పనిచేయాలని కోరారు. రామిడి జంగారెడ్డి, బోగ వెంకటేష్, క్రిష్ణ, రామిడి బాల్‌రెడ్డి, ఇప్పల పల్లి స్వామి, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజాపేటలో.. రాజాపేట : మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రంగ కిష్టయ్య గౌడ్, రంగ బాలస్వామి గౌడ్‌లతోపాటు 50 మంది యువకులు సోమవారం డీసీసీ ప్రెసిడెంట్ బూడిద భిక్షమయ్య గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుచేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ గెలపుకోసం కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిని పాండు, కార్యదర్శి రంగ నరేష్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రంగ పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటికి కటకట
బొమ్మలరామారం : మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని కింది తండాలో మంచి నీటి ఎద్దడి తలెత్తింది.తండాకు మిషన్ భగిరథ నీరు అందుతున్నా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తండాలో కొందరి గిరిజనుల పరిస్థితి. వివరాల్లోకి వెళితే కింది తండాకు మిషన్ భగిరథ ద్వారా నీటిని అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నూతనంగా నిర్మించి నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఓ పది ఇళ్లకు మాత్రం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన బోరు బావే దిక్కైంది. తండాలోని చివరగా ఉన్న ఓ పది కుటుంబాలు ఇప్పటికీ భగీరథ నీటిని చూడలేదు.పైప్‌లైన్ ఏర్పాటులో సాంకేతిక లోపం కారణంతోనే లేక మరో కారణంగానే ఈ పది కటుంబాలకు గత మూన్నెళ్లుగా నీటి కటకట మొదలైంది. ఈ పది కుటుంబాలను మొన్నటి వరకు ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ బోరు బావి సైతం వట్టిపోవడంతో వీరికి నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అరగంటకు ఒకసారి పనులు మానుకొని బోరు బావి వద్ద నీటి కోసం పడిగాపులు తప్పడం లేదు. ఎన్నిసార్లు నాయకులకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాథుధుడే కరువైయ్యాడని తండా గిరిజనులు వాపోతున్నారు. ఇకనైనా తమకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. నీళ్లకు తిప్పలవుతోంది తండాలో బోరు బావి వద్ద అరగంటకు ఒక బిందె నీళ్లు వస్తున్నాయి. నీళ్ల కోసం పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నం. సర్కారోళ్లు వేసిన నల్లాల్లో నీళ్లు రాక సిలుము పడుతున్నాయి. తండా కొందరికే నీళ్లు వస్తున్నాయి. అందరికీ వచ్చేటట్లు చేయాలే. నీళ్లు సరిపోను లేక రెండు, మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నాం. వంతుల వారీగా నీళ్లకు లైన్ల నిలబడి పంచాయతీలు అవుతున్నాయి. ఎండాకాలంలో నీళ్లకు తిప్పల ఎక్కువైంది. -
బస్సు - లారీ ఢీ: మహిళ మృతి
నల్లగొండ: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురం వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హాజిపేట వెళ్తున్న క్రమంలో... సాయిధామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న మహిళ (58) అందులోనే ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందింది. మరో పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కథను నమ్మి తీశారు
‘‘ఎటువంటి అశ్లీలతకు తావు లేకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తీసిన తీరు అభినందనీయం. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది’’ అని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. నూతన నటీనటులతో మీడీవల్ స్టోరీ టెల్లర్స్ పతాకంపై నిశాంత్ పుదారి దర్శకత్వంలో పుదారి అరుణ నిర్మించిన చిత్రం ‘బొమ్మల రామారం’. ఇటీవల ప్రముఖ గాయని పి.సుశీల చేతుల మీదుగా ఈ చిత్రం పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం తొలి కాపీని దర్శక-నిర్మాతలు విద్యాసాగర్ రావుకు చూపించారు. ‘‘పాటలన్నీ బాగున్నాయి. కథను నమ్మి ఈ చిత్రం తీశారు. మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నా’’ అని విద్యాసాగర్ రావు అన్నారు. ‘‘మార్చి 4న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బివి అమర్నాథ్ రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల.