
సాక్షి, హైదరాబాద్: శ్రీనివాసరెడ్డి చేసిన దురాగతాలతో హాజీపూర్ వణికిపోతోంది. ఎప్పుడు, ఏం బయటపడుతుందోనన్న ఆందోళన గ్రామస్థులను వెంటాడుతోంది. తమ మధ్యే అమాయకంగా తిరిగిన శ్రీనివాసరెడ్డి... ఓ నరరూప రాక్షసుడనుకోలేదన్నది జనం మాట. ఇప్పటివరకు స్వేచ్ఛగా వ్యవహరించిన పిల్లలు, పెద్దలు ఇప్పుడు చీకటి పడిందంటే ఆందోళన చెందుతున్నారు. రోడ్డు నుంచి బావి మీదుగా ఊరికి వచ్చేప్పుడు జనాన్ని భయం వెంటాడుతోంది. ఆరు రోజుల నుంచి ఇప్పటివరకు హాజీపూర్ ఎలా ఉంది? ఈ పరిస్థితులను తెలుసుకునేందుకు సాక్షి టీవీ గ్రామంలో పర్యటించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. హాజీపూర్ నుంచి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వప్న అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది.
హాజీపూర్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్‌ను ఇక్కడ చూడండి..