Serial murders
-
Nithari Killings: నిఠారి వరుస హత్యల కేసులో దోషులకు విముక్తి
ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: 2006 నాటి నిఠారి వరుస హత్యల కేసులో నిందితులుగా మణీందర్ సింగ్ పంధేర్, పని మనిషి సురేంద్ర కోలీలకు అలహాబాద్ హైకోర్టు విముక్తి కల్పించింది. వారికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. నోయిడాలోని ఓ బంగ్లా వెనుక 8 మంది చిన్నారుల ఎముకలు కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఇద్దరూ కలిసి పలువురు బాలికలపై లైంగికదాడికి, దారుణ హత్యలకు పాల్పడటంతోపాటు నరమాంస భక్షకులుగా మారినట్లు కూడా ఆరోపణలొచ్చాయి. అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ పంధేర్, కోలీలు వేసిన పిటిషన్‌ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్విల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎటువంటి సందేహాలకు తావు లేకుండా వీరిద్దరికీ వ్యతిరేకంగా కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పుతో పంధేర్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందని ఆయన లాయర్ మనీషా భండారి చెప్పారు. అయితే, మరో కేసులో జీవిత ఖైదు శిక్షపడిన కోలీ మాత్రం జైలులోనే ఉంటాడని అన్నారు. తీర్పు ప్రతి అందాక తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.2007లో పంధేర్, కోలీలపై 19 కేసులు నమోదయ్యాయి. అయితే, సాక్ష్యాలు దొరకలేదంటూ మూడు కేసుల్లో మాత్రమే సీబీఐ అభియోగ పత్రాలు నమోదు చేయగలిగింది. మిగతా 16 కేసులకుగాను మూడు కేసుల నుంచి కోలీ బయటపడ్డాడు. ఒక కేసులో విధించిన మరణశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చింది. కోలీకి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో 12 కేసుల నుంచి అతడికి విముక్తి లభించింది. అదే సమయంలో, పంధేర్‌పై ఉన్న ఆరు కేసుల్లో, ఒకటి సీబీఐ వేసింది కాగా, మరో అయిదు బాధితుల కుటుంబాలవి. గతంలో సెషన్స్ కోర్టు అతడిపై ఉన్న మూడు కేసులను కొట్టివేసింది. మిగతా మూడింటిలో 2009లో ఒకటి, తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో రెండు కేసుల నుంచి పంధేర్ బయటపడినట్లయిందని అతడి లాయర్ చెప్పారు. కోలీ ఘజియాబాద్ కారాగారంలో, అతడి మాజీ యజమాని పంధేర్ నోయిడా జైల్లో ఉన్నారు. -
హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు
-
హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు
సాక్షి, నల్లగొండ: హాజీపూర్ హత్యల కేసులో పోక్సో స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హాజీపూర్ హత్యలకు సంబంధించిన మూడు కేసుల్లోనూ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ముగ్గురు చిన్నారి బాలికలపై అత్యాచారం జరిపి.. శ్రీనివాస్‌రెడ్డి అత్యంత దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఈ మూడు హత్యలకు సంబంధించి పోక్సో స్పెషల్ కోర్టు వేర్వేరుగా తీర్పులు వెలువరించింది. శ్రావణి, కల్పన కేసులలో హంతకుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధించిన కోర్టు.. మనీషా కేసులో జీవితఖైదు విధించింది. ఎఫ్ఐఆర్ నంబర్లు 110, 109 కేసుల్లో దోషికి ఉరిశిక్ష పడింది. ముగ్గురు బాలికలను కామాంధుడైన శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో గత నెల 17వ తేదీన వాదనలు ముగిశాయి. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. బాలికలపై అత్యాచారం, హత్యలకు సంబంధించి కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలు కేసులో కీలకంగా నిలిచాయి. హాజీపూర్ కేసులో మొత్తం 90 రోజుల్లో దర్యాప్తు పూర్తయింది. గత ఏడాది జూలై 31న నల్లగొండలోని పోక్సో స్పెషల్ కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 14 నుంచి ఈ కేసులలో కోర్టు విచారణ ప్రారంభించింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. గత ఏడాది ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన పాములు శ్రావణి కేసు మొదట వెలుగులోకి వచ్చింది. హాజీపూర్‌కు వెళ్లేదారిలోని తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకొని విచారించగా.. మనీషా, కల్పనలను శ్రీనివాస్‌రెడ్డే దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది. ఈ మూడు కేసులలో వేగంగా దర్యాప్తు చేపట్టిన యాదాద్రి పోలీసులు 90 రోజుల్లో కోర్టుకు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. బాధిత కుటుంబసభ్యుల హర్షం శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధించడంపై బాధిత బాలికల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగిందని, శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఉరితీయాలని, శిక్ష అమలులో ఏమాత్రం తాత్సారం చేయవద్దని కోరుతున్నారు. -
ఛార్జ్‌షీట్
-
హాజీపూర్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: శ్రీనివాసరెడ్డి చేసిన దురాగతాలతో హాజీపూర్ వణికిపోతోంది. ఎప్పుడు, ఏం బయటపడుతుందోనన్న ఆందోళన గ్రామస్థులను వెంటాడుతోంది. తమ మధ్యే అమాయకంగా తిరిగిన శ్రీనివాసరెడ్డి... ఓ నరరూప రాక్షసుడనుకోలేదన్నది జనం మాట. ఇప్పటివరకు స్వేచ్ఛగా వ్యవహరించిన పిల్లలు, పెద్దలు ఇప్పుడు చీకటి పడిందంటే ఆందోళన చెందుతున్నారు. రోడ్డు నుంచి బావి మీదుగా ఊరికి వచ్చేప్పుడు జనాన్ని భయం వెంటాడుతోంది. ఆరు రోజుల నుంచి ఇప్పటివరకు హాజీపూర్ ఎలా ఉంది? ఈ పరిస్థితులను తెలుసుకునేందుకు సాక్షి టీవీ గ్రామంలో పర్యటించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. హాజీపూర్ నుంచి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వప్న అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. హాజీపూర్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్‌ను ఇక్కడ చూడండి.. -
సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి బైక్ వీడియో వైరల్
శ్రీనివాస్‌రెడ్డి ఎప్పుడూ ఎవరితోనూ కలవడు. ఎవరికీ ఎక్కువగా కనిపించడు. కానీ, ఏదైనా అఘాయిత్యం చేసినప్పుడు మాత్రం అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తాడు. తద్వారా తనపై అనుమానం రాకుండా చూసుకుంటాడని తెలుస్తోంది. అదే క్రమంలో ఈ నెల 26వ తేదీన హఠాత్తుగా ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. ఊరి మధ్యలో ఉన్న చిన్న ఖాళీ ప్రదేశంలో పిల్లలు క్రికెట్ ఆడుతుంటే తాను కూడా ఆడాడు. మర్నాడు తన పాఠశాల మిత్రుడి పెళ్లికి భువనగిరి వెళ్లాడు. మిత్రులతో కలిసి విందులో పాల్గొని చిందులేశాడు. శ్రీనివాసరెడ్డిలో ఉత్సాహం చూసి తాము ఆశ్చర్యపోయామని.. ముభావంగా ఉండే అతను ఇంతలా ఆనందించడం తాము ఎప్పుడూ చూడలేదని చిన్ననాటి మిత్రులు తెలిపారు. అయితే, తాను చేసిన ఘోరం బయటపడకుండా, అనుమానం రాకుండా ఉండేందుకే తన స్వభావానికి విరుద్ధంగా శ్రీనివాస్‌రెడ్డి ప్రవర్తించాడని ఇప్పుడు అర్థమవుతోందన్నారు. 25న పాఠశాలకు వెళ్లివస్తున్న బాలికకు లిఫ్ట్ ఇచ్చి బావివద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. దీని వెనుక తానే ఉన్నట్లు ఎవరికీ అనుమానం రాకూడదనే... ఊర్లోకి వచ్చి క్రికెట్ ఆడినట్లు, తర్వాత రోజు మిత్రులతో కలిసి పెళ్లిలో చిందులు వేసినట్లు విశ్లేషిస్తున్నారు. తాజాగా అతను ఒక బైక్ మీద వెనుక కూర్చొని.. హల్చల్ చేస్తూ ప్రయాణిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్‌రెడ్డి మొహంలో ఎప్పుడూ ఎలాంటి భావం కనిపించదని... అతడితోపాటు పదో తరగతి వరకూ చదివినవాళ్లు చెబుతున్నారు. వాళ్ల క్లాస్‌లో 150 మంది ఉండేవారని, వారిలో ఏ ఒక్కరితోనూ శ్రీనివాస్‌రెడ్డి కలిసిపోయేవాడు కాదన్నారు. చదువుల్లో వెనుకబడి ఉండేవాడని, ఒక్కోసారి ఉపాధ్యాయులు కర్రతో కొడుతుంటే ఎన్ని దెబ్బలైనా తినేవాడు కానీ అతడి మొహంలో బాధ, భయం వంటి భావాలేవీ కనిపించేవి కాదంటున్నారు. ఊర్లోనూ ఎవరితో కలిసేవాడు కాదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంతటి తీవ్రనేర స్వభావం ఉన్న వ్యక్తి ఇన్నేళ్ల నుంచీ ఎందుకు ఖాళీగా ఉంటాడనేది ప్రశ్న. ఈ మధ్యకాలంలోనూ ఇలాంటి అఘాయిత్యాలు చేసి ఉండొచ్చని, అవేవీ బయటకు వచ్చి ఉండవని పోలీసులు అనుమానిస్తున్నారు. లిఫ్టు మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌రెడ్డి అనేక ప్రాంతాలు తిరుగుతుంటాడు. దీనిలో భాగంగానే కర్నూలు వెళ్లి అక్కడ ఒక యువతిని హత్యచేసి పీపాలో కుక్కాడు. ఫేస్బుక్ ఖాతాలో 631 మంది స్నేహితులు ఉంటే వారిలో పురుషులు 50 మంది కూడా లేరు. మిగతా యువతులంతా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారు. ఆ పరిచయంకొద్ది ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఏమైనా చేసి ఉంటాడా? అనేది అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో అదృశ్యమైన యువతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాంతోపాటు హాజీపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విచారిస్తున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ద్వారా ఈ అనుమానాలన్నీ నివృత్తి చేసుకునేందుకు మరోమారు తమ అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఒక మహిళను వేధించడంతో ఊరివారంతా కలిసి శ్రీనివాస్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అది శ్రీనివాస్‌రెడ్డి మనసులో బలంగా నాటుకుపోయిందని అతన్ని విచారించిన అధికారులు చెబుతున్నారు. ఎవర్నైనా బలవంతం చేసినప్పుడు వారు ఒప్పుకోకపోతే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేసేవాడు కాదని...ఒకవేళ వారు బయటకెళ్లి చెబితే మళ్లీ కొడతారనే భయంతో అక్కడే హతమార్చేవాడని తెలిపారు. ఇదే అతడి మనస్తత్వమని శ్రీనివాస్‌రెడ్డిని విచారించిన ఓ అధికారి తెలిపారు. యాదాద్రి భువనగిరిజిల్లా హాజిపూర్‌లోని సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని పోలీసులు కస్టడీకి కోరనున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పథకం ప్రకారమే సిరియల్ హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ఫోన్ డేటా, ఫేస్బుక్ ఐడీని పోలీసులు పరిశీలిస్తున్నారు.నిందితుడు శ్రీనివాసరెడ్డి తరచూ కరీంనగర్ ప్రాంతాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. బొమ్మలరామారం బాలికల అదృశ్యం, హత్య ఘటనలపై తీవ్రంగా స్పందించిన రాచకొండ సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
కల్పన మృతదేహం వెలికితీత!
సాక్షి, బొమ్మలరామారం : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని బావి నుంచి చిన్నారి కల్పన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో వెతికిన పోలీసులు.. ఎట్టకేలకు కల్పన ఆస్తికలను గుర్తించారు. ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఒకే బావిలో లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనీషా బ్యాగు దొరికిన మరో బావిలో కల్పన మృతదేహం ఉండి ఉండవచ్చునని అనుమానంతో పోలీసులు వెతికారు. ఆ బావిలోనే కల్పన మృతదేహం లభించింది. ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల కల్పన నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. ఆ చిన్నారిని కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు మానవమృగం శ్రీనివాస్‌రెడ్డి తాజాగా పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇదేవిధంగా శ్రావణి, మనీషాలను కూడా అత్యాచారం చేసి.. శ్రీనివాస్‌రెడ్డి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. సిట్ ఏర్పాటు హజీపూర్ వరుస హత్యల కేసులో దర్యాప్తు విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు కోసం ఏసీపీ భుజంగరావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. భువనగిరి ఇన్స్పెక్టర్తోపాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లను ఈ సిట్‌లో నియమించారు. -
ఓ తల్లి.. ఓ గ్రాడ్యుయేట్.. సుపారీ కిల్లర్స్..!
ఏడుగురు సంతానమున్న గృహిణి.. ఓ సైన్స్ గ్రాడ్యుయేట్, ప్రాపర్టీ డీలర్, ఒక నిరుద్యోగి, ఓ ఫిజియో థెరపిస్ట్...వైవిధ్య నేపథ్యమున్న వీరంతా ఎవరు ? ఏదైనా గొప్ప పని చేసి రికార్డ్ సృష్టించారని అనుకుంటున్నారా ? ఈ జాబితాలోని వారంతా కూడా కాంట్రాక్ట్ కిల్లర్స్ ! డబ్బిస్తే చాలు పిస్తోల్ ట్రిగ్గర్ నొక్కేందుకు, విషం ఇంజెక్షన్ ఇచ్చేందుకు, కత్తులు,ఇతర మారణాయుధాలు ఝుళిపించేందుకు వెనుకాడని హంతకులు. గతేడాది 50 కేసుల ఛేదన.. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క 2017 సంవత్సరంలోనే తక్కువలో తక్కువ 50 కాంట్రాక్ట్ హత్య కేసులను అక్కడి పోలీసులు ఛేదించారు. ఈ హంతకుల్లో కొంత మందికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఇందులో కొందరైతే మొదటిసారి నేరం చేసిన వారు. ఈ కాంట్రాక్ట్ హత్యల కోసం సుపారీగా తక్కువలో తక్కువగా రూ. 40 వేల వరకు కూడా ఇచ్చినట్టు వెల్లడైంది. ఈ హత్యలకు ఒక పద్ధతి లేదా ఒక విధానం అంటూ లేదు.కానీ ఢిల్లీ మహానగరంలో బతుకు వెళ్లదీసేందుకు అవసరమయ్యే పైకం కోసం హత్య, ఇతర నేరాలకు సిద్ధమవుతున్నట్టు తేలింది.ఢిల్లీ కాంట్రాక్ట్ కిల్లర్లలో ఎక్కువశాతం ఉత్తరప్రదేశ్, బిహార్ గ్రామాలకు చెందినవారే. దేశ వాణిజ్య రాజధాని ముంబై మొదలుకుని ఇతర నగరాల్లో కాంట్రాక్ట్ హత్యల ముఠాలు పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం వ్యవస్థీకృత కాంట్రాక్ట్ కిల్లర్లు లేరు. రూ. 4 కోట్ల సుపారీ... ఢిల్లీ పోలీస్ రికార్డుల ప్రకారం...గతేడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ హత్యల్లో అత్యధికంగా రూ. 4 కోట్ల మొత్తానికి సుశీల్, అమిత్, సునీల్, రమేశ్ (ఒక్కోక్కరికి కోటి చొప్పున) ఒప్పందం కుదిరింది. హరియాణాకు చెందిన సందీప్ బద్‌సావనియా అనే గ్యాంగ్‌స్టర్ హత్యకు అతడి ప్రత్యర్థి రామ్ కరణ్ ఈ మేరకు పథకం రచించాడు. గ్యాంగ్‌వార్‌లో భాగంగా ఇదో హైప్రొఫైల్ కాంట్రాక్ట్ హత్యగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ హత్యలో నలభైమంది పాలుపంచుకున్నారు. కొన్నినెలల పాటు బద్‌సావనియా కదలికలను గమనించారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా రికార్డు, అనుపానులు తెలుసుకునేందుకు ప్రైవేట్ గూఢచారుల సేవలు ఉపయోగించుకున్నారు. హత్య చేశాక మృతదేహాన్ని 400 కి.మీ అవతల పడేసి వచ్చారు. ప్రధాన హంతకులు నలుగురు 2016–17 మధ్యకాలంలో 9 హత్యలు చేసినట్టు బయటపడింది. చిన్న కారణాలకూ హత్యలు... గ్యాంగ్‌లపై ఆధిపత్యం కోసం జరిగిన హత్యలకు భిన్నంగా, ఢిల్లీలో ఈర్ష్య, అసూయ, ఆస్తి వివాదం, పెళ్లి పెటాకులు కావడం మొదలు చిన్న చిన్న కారణాలకు కూడా కాంట్రాక్ట్హత్యలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 1973లో విడాకుల కారణంగా నరేంద్రసింగ్ జైన్ అనే కంటి డాక్టర్ తన భార్య విద్యాజైన్ హత్యకు రూ. 25 వేల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఢిల్లీలో జరిగిన తొలి కాంట్రాక్ట్ హత్యల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. 1977లో నరేంద్రసింగ్‌కు శిక్ష పడింది. గతేడాది నవంబర్‌లో తన భర్త హత్యకు బరేలికి చెందిన అబ్దుల్ మున్నార్‌కు ఓ యువతి కాంట్రాక్ట్నిచ్చింది. తనకిస్తానన్న రూ. 5 లక్షల్లో కేవలం రూ. 50 వేలే అందడంతో షార్ప్‌షూటర్‌గా పేరుపొందిన మున్నార్ కాలిపై మాత్రమే కాల్పులు జరిపాడు. హత్యకు ముందే కాంట్రాక్ట్ మొత్తం డబ్బు పొందేందుకు వేచిచూస్తున్న అతడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మర్డర్ కాంట్రాక్ట్‌లో రికార్డున్న మున్నార్, 10,15 పర్యాయాలు జైలుకెళ్లి అక్కడ అనేక మందిని మిత్రులు చేసుకున్నాడు. ఒకరి హత్యకు జైల్లో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నందుకు 2015లో పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఫిజియో థెరపిస్ట్... ప్రేంకుమార్ అనే నిరుద్యోగ ఫిజియో థెరిపిస్ట్ తన పెళ్లి ఖర్చు కోసం రూ.5 లక్షలకు ఓ హత్యా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఈ హత్య కోసం విషపూరితమైన రెండు ఇంజక్షన్లు ఉపయోగించాడు. తూర్పు ఢిల్లీ కోండ్లిలో ఓ పాలవ్యాపారి హత్యకు అతడి భార్య రూ. 40 వేలకు కాంట్రాక్ట్ ఇచ్చింది. అక్కడి పాదరక్షల ఫ్యాక్టరీలో పనిచేసే ప్రమోద్‌కుమార్, వివేక్‌కుమార్ ఈ హత్య చేశారు. ఇది వారి మొదటి నేరం. నోయిడాలోని ఓ హోటల్ యజమాని హత్యకు పథకం పన్నిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రాపర్టీ డీలర్లు మొదలుకుని జిమ్ ట్రైనర్ల వరకున్నారు. ఏడుగురు సంతానమున్న బసిరన్ అనే 62 ఏళ్ల మహిళ రూ. 60 వేలకు హత్యా కాంట్రాక్ట్ తీసుకుంది. దొంగతనం, హత్య, బలవంతపు వసూళ్లు వంటి నేరాలపై జైలుశిక్ష అనుభవిస్తున్న తన కొడుకుల కోర్టు ఫీజుల కోసం ఆమె రూ. 18 వేలు అట్టే పెట్టుకుంది. మిగతా డబ్బును ఇద్దరు నిరుద్యోగులకిచ్చి హత్య చేయాల్సిన వ్యక్తి ముఖం కాల్చేసి శివార్లలోని అడవుల్లో పూడ్చేయాలని ఆదేశించింది. కొన్ని ముఖ్యమైన కేసులు... 2017 అక్టోబర్‌లో ఢిల్లీలోని షాదరా మానససరోవర్ పార్కులో నలుగురు మహిళలు, ఓ సెక్యూరిటీగార్డు హత్యకు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ. 2 లక్షల చొప్పున చెల్లింపు. వీరిపై 3 దొంగతనం కేసులున్నాయి. 2017 జూన్‌లో అండర్‌వరల్డ్ డాన్ ఛోటారాజన్ హత్యకు అతడి పాలవాడి కొడుకు జునైద్ చౌదరికి రూ. 1.5 లక్షలకు కాంట్రాక్ట్. అయితే ఈ నేరం చేయక ముందే అతడిని అరెస్ట్‌చేశారు. జునైద్పైనా రెండు కేసులున్నాయి. 2017 మేలో బీఎస్పీ నేత చౌదరి మునవ్వర్ హసన్, భార్య, 4 పిల్లల హత్యకు రూ.3 లక్షలకు మునవ్వర్ స్నేహితుడు కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఈ పనిని ఫిరోజ్, జుల్ఫీకర్ అనే నిరుద్యోగ యువకులకు అప్పగించాడు. వీరిపైనా కేసులున్నాయి. 2016 మేలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ లీగల్ అఫీసర్ ఎంఎంఖాన్ను ఆయన ఇంటి బయటే కాల్చిచంపారు. ఈ హత్యకు ఢిల్లీకి చెందిన హోటల్ యజమాని రూ.3.5 లక్షలకు ఇజ్రాయిల్, సలీంఖాన్, అమిర్ అల్వి, అన్వర్ ఒవైస్ అనే యువకులకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఫ్యాక్షన్.. యాక్షన్
దేవరకొండ : కత్తితో కాదురా.. కంటి చూపుతో చంపేస్తానని ఓ సినిమాలో హీరో డైలాగ్. కానీ మనం సినిమాలో నటిచడంలేదు. ఫ్యాక్షన్ ఏరియాలో అంతకంటే లేం. అయినా ఆ ఫ్యాక్షన్ పరివాహక గ్రామాల.. యాక్షన్ ప్రభావం మాత్రం మన జిల్లాకూ పాకుతోంది. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉండే ఫ్యాక్షన్ తరహా యాక్షన్ ఇప్పు డు మనకూ విస్తరిస్తోంది.. జిల్లాలోనే కంబాలపల్లి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆ వాతావరణమే. సోమవారం రాత్రి నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం చింతలపాలెం ఉప సర్పంచ్ ధర్మానాయక్‌ను అతికిరాతకంగా బాంబులతో మట్టుబెట్టారు. ఈ ఉదంతం ఫ్యాక్షన్ సంస్కృతికి అద్దం పడుతోంది. కక్ష సాధించడానికి వంద ఎకరాలు అమ్ముకోవడానికైనా.. కన్నవాళ్లు, మనోళ్లు అనే తేడా లేకుండా చంపుకోవడానికైనా.. తెగించే విష సంస్కృతి ఫ్యాక్షన్ది. ప్ర త్యర్థుల నుంచి తమ వారిని రక్షించుకోవడానికి రా ష్ట్రాలు, దేశాలు దాటించైనా.. కక్ష సాధించేందుకు కా పుకాసే పరిస్థితి ఫ్యాక్షన్ గ్రామాలది. ఈ దుస్థితి ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నా ఇప్ప టి వరకు తెలంగాణలో మాత్రం కనిపించేంది కాదు. కానీ.. కంబాలపల్లిలో.. 52 మందిపై రౌడీషీట్ కేసులు, 22 వర్గదాడులు, ఏడాది పొడవునా కక్షసాధింపు, కవ్వింపు చర్యలు ఇదీ కంబాలపల్లి గ్రామం. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత ఫ్యాక్షన్‌ను కాస్త ఒంటపట్టించుకున్న గ్రామం ఇది. ఇప్పటి వరకు ఎన్నోసార్లు బాంబుదాడులు, వర్గదాడులు జరిగాయి. ఎంతో మందిపై కేసులు నమోదయ్యా యి. గత మేలో కూడా గ్రామంలో వర్గదాడులు జరి గాయి. ప్రస్తుతం ఇక్కడ కొంత మార్పు కనిపిస్తోంది. ఇక్కడ గొడవలకు చెక్ పెట్టేందుకు పోలీసుల ప్రయత్నం ఫలించింది. గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, గ్రామంలో జరి గే పరిస్థితిని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం, గొడవలకు దిగే ప్రధాన వ్యక్తులకు గ్రామ బహిష్కరణ నోటీసులు ఇవ్వడంతో ఈ పరిస్థితిలో కొంతమార్పు కనిపిస్తోంది. అక్కడి ప్రభావమే.. కంబాలపల్లి అయినా, తిరుమలగిరి అయినా, పీఏపల్లి అయినా ఇవ్వన్నీ కృష్ణా పరివాహక ప్రాంతాలే కావడంతో ఆ ఫ్యాక్షన్ ప్రభావం ఇక్కడి గ్రామాలపై పడుతోంది. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, భయపెట్టేందుకు ఫ్యాక్షన్ గ్రామాల్లో నాటు బాంబులు విసురుకునే సంస్కృతిని ఇక్కడి గ్రామాలు కూడా అనుసరిస్తున్నాయి. పోలీసులు దృష్టి సారించాలి.. కంబాలపల్లిలో ఏళ్లుగా కొనసాగుతున్న ఫ్యాక్షన్ తరహా గొడవలకు చెక్ పెట్టేందుకు పోలీసులు తీసుకున్న చర్యలను అభినందించాలి. గతంలో ఎస్పీగా పనిచేసిన ప్రకాశ్‌రెడ్డి ఈ గ్రామంలో గొడవలు జరగకుండా.. కౌన్సిలింగ్ ఇవ్వడం, గ్రామాల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో ఏ గొడవ జరిగినా ఇరు వర్గాలను బాధ్యులను చేయడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఇటువంటి ఫ్యాక్షన్ గ్రామాలపై పోలీసులు ఎప్పుడు ఓ కన్నేసి ఉంచితేనే అటువంటి విష సంస్కృతి నుంచి జిల్లాను కాపాడుకోవచ్చు. -
బిరదవోలు హడలు
అడవిలో వెలుగుచూస్తున్న హత్యలు పొదలకూరు : మండలంలోని బిరదవ లు గుండెలు అదురుతున్నాయి. సమీప అటవీ ప్రాంతంలో మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. ఎక్కడో హత్యలు చేసి, ఇక్కడ పడేసిపోతుండంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. గత రెండేళ్ల కాలంలో నాలుగు హత్యోదంతాలు వెలుగులోకి వచ్చా యి. ఈ ప్రాంతంలో పగటి వేళల్లోనే నర సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటిది రాత్రి వేళల్లో ఆటోల్లో వచ్చి శవాలను పడేస్తున్నారు. 2014 మే 24వతేదీన బిరదవోలు పంచాయతీ బ్రాహ్మణపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకువచ్చి ముళ్లకంపతో తగులబెట్టారు. శవం సగం కాలి మొండెం మిగిలింది. అప్పట్లో ఈ ప్రాంతంలో సగం కాలిన మృతదేహం గుర్తింపు సంచనలం రేపింది. అయితే ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి చిన్న క్లూ కూడా లభ్యం కాలేదు. కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. మన్ మిస్సింగ్ కేసు కూడా చుట్టుపక్కల పోలీసుస్టేషన్లలో నమోదు కాకపోవడంతో పోలీసులు చేతులెత్తేశారు. తర్వాత అదే ఏడాది డిసెంబర్ 30వ తేదీన మండలంలోని ఉలవరపల్లికి చెందిన భాగ్యలక్ష్మి దారుణ హత్యకు గురై మృతదేహం ఇదే అటవీ ప్రాంతంలో బయటపడింది. 2014లోనే 35 ఏళ్ల గిరిజన యువకుడు బిరదవోలు పంచాయతీ చీకిరేనితిప్ప అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాజాగా బ్రాహ్మణపల్లి శ్మశానానికి సమీపంలోని పొదల్లో కోళ్ల వ్యాపారి వద్ద కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న గోవర్ధన్ మృతదేహాన్ని గుర్తించడం సంచలం కలిగిస్తోంది. దీంతో ఈ ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు. హతుడు గోవర్ధన్ జేబులో గుర్తింపు కార్డులు ఉండడం వల్ల పోలీసులు మృతదేహాన్ని వెంటనే గుర్తుపట్టారు. గతంలో జరిగిన ఘటనల్లో మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులకు సమయం పట్టింది. వీటన్నింటిని పరిశీలిస్తే నేరాలు చేసేందుకు నేరస్తులు ఇక్కడి అటవీప్రాంతాన్ని అనువుగా ఎంచుకుంటున్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి శ్మశానానికి సమీపంలో హత్య చేసి పడేసిన పీవీఆర్ చికెన్స్ కలెక్షన్ ఏజెంట్ గోవర్ధన్ మృతదేహాన్ని ఆత్మకూరు డీఎస్పీ సుబ్బారెడ్డి శుక్రవారం పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో క్లూస్ కోసం ప్రయత్నించారు. పోలీసు అధికారులు ప్రాథమికంగా గోవర్ధన్‌ది హత్యగానే భావిస్తున్నారు. సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ప్రసాద్‌రెడ్డి ద్వారా డీఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గూడూరు-1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గోవర్ధన్‌కు సంబంధించి మిస్సింగ్ కేసు నమోదు కావడంతో డీఎస్పీ వారితో కూడా మాట్లాడారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసు జాగిలం రాక గోవర్ధన్ హత్య కేసును ఛేదించేందుకు పోలీసు అధికారులు జాగిలాన్ని రప్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జాగిలం మృతదేహం పడి ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో కలియ తిరిగింది. అనంతరం మనుబోలు మార్గంలో కొంత దూరం వెళ్లి నిలిచిపోయింది. దీన్ని బట్టి హంతకులు మనుబోలు మీదుగా మృతదేహాన్ని వాహనంలో తీసుకు వచ్చి బ్రాహ్మణపల్లి వద్ద పడేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. -
ఉలికిపాటు
♦ పర్చూరు మండలం చెన్నుంబొట్లవారిపాలెంలో ♦ కలకలం రేపిన వరుస హత్యలు పట్టపగలే ముగ్గురు హతం ♦ చిన్నపాటి వివాదాలే హత్యలకు కారణం ♦ గతంలోనూ పలుమార్లు ఘర్షణలు పర్చూరు: పచ్చగా ఉన్న పల్లెలో పట్టపగలు వరుస హత్యలతో కలకలం రేగింది. చిన్నపాటి వివాదాలే ముదిరి ముగ్గురి ప్రాణాలు తీసింది. పగతో రగిలిన ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో గొడ్డళ్లతో దాడిచేసి భార్యాభర్తలను, అడ్డొచ్చిన మరొకరిని దారుణంగా హతమార్చారు. పర్చూరు మండలం చెన్నుంబొట్లవారిపాలెంలో మంగళవారం జరిగిన ఈ ఘటన గ్రామస్తులను భయూందోళనకు గురిచేసింది. హతులు ముగ్గురూ రైతు కూలీలే. హత్యకు గురైన కీర్తిపాటి రత్తయ్య (50), జంగా బాబు (45), జంగా సుశీల (40)పై దాడి పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీ కొడుకులు దిడ్ల శాంసన్, బోస్‌లు గొడ్డళ్లతో రత్తయ్యపై దాడిచేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న జంగా బాబుపై కూడా మెడపై గొడ్డలితో నరికారు దీంతో అతనూ రక్తపు మడుగులో పడి మృతిచెందాడు. భర్త మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య జంగా సుశీల (40)ను సైతం హంతకులు వదలకుండా మెడపై గొడ్డలితో నరికి దారుణంగా చంపారు. పట్టపగలు రచ్చబండ వద్ద ఈ మారణకాండ జరుగుతున్నా గ్రామస్తులెవరూ అడ్డుకోలేకపోయూరు. భయంతో పరుగులు పెట్టారు. దాడిని అడ్డుకోబోరుున మృతుల బంధువు కీర్తిపాటి రాజుపై కూడా దాడిచేయడంతో తలకు గాయూలయ్యూరుు. అదే సందర్భంలో రత్తయ్య భార్య బూదెమ్మపై హంతకులు దాడికి యత్నించగా పరుగుపెట్టింది. అందరూ చూస్తుండగానే దాదాపు 20 నిమిషాల పాటు హత్యాకాండ సాగింది. చిన్నపాటి వివాదాలే పెద్దవై...: హతులు, హంతకులు ఒకే కాలనీకి చెందినవారు. కాలనీలో ఆటల పోటీల సందర్భంగా ఏర్పడిన వివాదాలు ఘర్షణకు దారితీశారుు. రత్తయ్య కుమారునిపై బోసు గతంలో కత్తితో దాడిచేశాడు. ఈ విషయం అప్పట్లో పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. దాడి అనంతరం రత్తయ్య వర్గీయుల నుంచి ముప్పు పొంచి ఉందన్న భయంతో దిడ్ల శ్యాంసన్ కుటుంబం యద్దనపూడి మండలం డేగరమూడికి మకాం మార్చింది. అయితే ఇటీవల రుణమాఫీ పత్రాల కోసం మళ్లీ గ్రామానికి వచ్చారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అనాథలైన పిల్లలు: మృతులు జంగా బాబు, సుశీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ఉషా నర్సింగ్ పూర్తి చేసింది. చిన్నకుమార్తె సుస్మిత ఇంటర్ చదివింది. కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ రక్తపు మడుగుల్లో విగత జీవులై పడి ఉండటాన్ని చూసి కుమారుడు తల్లడిల్లిపోతున్నాడు. తల్లిదండ్రుల మరణంతో పిల్లలు అనాథలయ్యారు. మృతులంతా రైతుకూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. భర్త దారుణ హత్యకు గురికావడంతో కీర్తిపాటి రత్తయ్య భార్య బూదెమ్మ భోరున విలపించింది. కాలనీకి చెందిన ముగ్గురు హత్యకు గురికావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.