కంబాలపల్లి గ్రామంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు
దేవరకొండ : కత్తితో కాదురా.. కంటి చూపుతో చంపేస్తానని ఓ సినిమాలో హీరో డైలాగ్. కానీ మనం సినిమాలో నటిచడంలేదు. ఫ్యాక్షన్ ఏరియాలో అంతకంటే లేం. అయినా ఆ ఫ్యాక్షన్ పరివాహక గ్రామాల.. యాక్షన్ ప్రభావం మాత్రం మన జిల్లాకూ పాకుతోంది. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉండే ఫ్యాక్షన్ తరహా యాక్షన్ ఇప్పు డు మనకూ విస్తరిస్తోంది.. జిల్లాలోనే కంబాలపల్లి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆ వాతావరణమే. సోమవారం రాత్రి నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం చింతలపాలెం ఉప సర్పంచ్ ధర్మానాయక్‌ను అతికిరాతకంగా బాంబులతో మట్టుబెట్టారు. ఈ ఉదంతం ఫ్యాక్షన్ సంస్కృతికి అద్దం పడుతోంది.
కక్ష సాధించడానికి వంద ఎకరాలు అమ్ముకోవడానికైనా.. కన్నవాళ్లు, మనోళ్లు అనే తేడా లేకుండా చంపుకోవడానికైనా.. తెగించే విష సంస్కృతి ఫ్యాక్షన్‌ది. ప్ర త్యర్థుల నుంచి తమ వారిని రక్షించుకోవడానికి రా ష్ట్రాలు, దేశాలు దాటించైనా.. కక్ష సాధించేందుకు కా పుకాసే పరిస్థితి ఫ్యాక్షన్ గ్రామాలది. ఈ దుస్థితి ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నా ఇప్ప టి వరకు తెలంగాణలో మాత్రం కనిపించేంది కాదు.
కానీ.. కంబాలపల్లిలో..
52 మందిపై రౌడీషీట్ కేసులు, 22 వర్గదాడులు, ఏడాది పొడవునా కక్షసాధింపు, కవ్వింపు చర్యలు ఇదీ కంబాలపల్లి గ్రామం. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత ఫ్యాక్షన్‌ను కాస్త ఒంటపట్టించుకున్న గ్రామం ఇది. ఇప్పటి వరకు ఎన్నోసార్లు బాంబుదాడులు, వర్గదాడులు జరిగాయి. ఎంతో మందిపై కేసులు నమోదయ్యా యి. గత మేలో కూడా గ్రామంలో వర్గదాడులు జరి గాయి. ప్రస్తుతం ఇక్కడ కొంత మార్పు కనిపిస్తోంది. ఇక్కడ గొడవలకు చెక్ పెట్టేందుకు పోలీసుల ప్రయత్నం ఫలించింది. గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, గ్రామంలో జరి గే పరిస్థితిని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం, గొడవలకు దిగే ప్రధాన వ్యక్తులకు గ్రామ బహిష్కరణ నోటీసులు ఇవ్వడంతో ఈ పరిస్థితిలో కొంతమార్పు కనిపిస్తోంది.
అక్కడి ప్రభావమే..
కంబాలపల్లి అయినా, తిరుమలగిరి అయినా, పీఏపల్లి అయినా ఇవ్వన్నీ కృష్ణా పరివాహక ప్రాంతాలే కావడంతో ఆ ఫ్యాక్షన్ ప్రభావం ఇక్కడి గ్రామాలపై పడుతోంది. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, భయపెట్టేందుకు ఫ్యాక్షన్ గ్రామాల్లో నాటు బాంబులు విసురుకునే సంస్కృతిని ఇక్కడి గ్రామాలు కూడా అనుసరిస్తున్నాయి.
పోలీసులు దృష్టి సారించాలి..
కంబాలపల్లిలో ఏళ్లుగా కొనసాగుతున్న ఫ్యాక్షన్ తరహా గొడవలకు చెక్ పెట్టేందుకు పోలీసులు తీసుకున్న చర్యలను అభినందించాలి. గతంలో ఎస్పీగా పనిచేసిన ప్రకాశ్‌రెడ్డి ఈ గ్రామంలో గొడవలు జరగకుండా.. కౌన్సిలింగ్ ఇవ్వడం, గ్రామాల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో ఏ గొడవ జరిగినా ఇరు వర్గాలను బాధ్యులను చేయడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఇటువంటి ఫ్యాక్షన్ గ్రామాలపై పోలీసులు ఎప్పుడు ఓ కన్నేసి ఉంచితేనే అటువంటి విష సంస్కృతి నుంచి జిల్లాను కాపాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment