మర్రి శ్రీనివాస్‌రెడ్డి (ఫైల్)
సాక్షి, బొమ్మలరామారం: పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు సోమవారం నల్లగొండ కోర్టులో విచారణకు రానుంది. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు కోర్టునుంచి సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన విషయం విధితమే. ఈ కేసుల్లో వరంగల్ సెం ట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జులై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఎలాంటి శిక్షలు ఖరారు చేస్తుందోనని మండలంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.
చదవండి: సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు
Comments
Please login to add a commentAdd a comment