sreenivasa reddy
-
హాజీపూర్ నిందితుడిని కూడా అలానే చంపండి
సాక్షి, హైదరాబాద్: హాజీపూర్ వరుస హత్యలు చేసిన నిందితుడిని ఉరి తీయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘం నేతలు గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను కోరారు. ఈ మేరకు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయాలని, తమ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి జిల్లాకో ఘటనలు జరుగుతున్నాయి. గవర్నర్ కూడా తన లిస్ట్‌లో హాజీపూర్ సమస్య ఉందని, తనకు మొత్తం తెలుసన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని సానుకూలంగా స్పందించార’ని పేర్కొన్నారు. బాధితురాళ్ల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలన్నారు. దిశ ఘటనలో నిందితులను ఎలా చంపారో శ్రీనివాస్‌ను కూడా అదే విధంగా చంపాలని గవర్నర్ కోరామని తెలిపారు. చదవండి: తుదిదశకు ‘హాజీపూర్’ విచారణ -
‘దిశ’ ఘటన నేపథ్యంలో మళ్లీ తెరపైకి ‘హాజీపూర్’
సాక్షి, బొమ్మలరామారం: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో యువతులు, మహిళలు, బాలికలపై దారుణాలు నానాటికి పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆగ్రహం తారస్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లాలో దిశపై సామూహిక అత్యాచారం, హత్య, వరంగల్‌లో గాదం మానస అత్యాచారం, హత్యల నేపథ్యం, ముగ్గురు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి అతి దారుణంగా హత్యలు చేసిన నిందితుడు సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష పడడంలో జరుగుతున్న జాప్యంపై మండల ప్రజలు గుర్రుగా ఉన్నారు. మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే కఠిన శిక్షలు ఖారారు అయితేనైనా నేరం చేసే వారికి వెన్నులో వణుకు పుట్టేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఎవ్వరిని కదిలించినా సైకో శ్రీనివాస్ రెడ్డి దారుణాలనే గుర్తు చేసుకుంటున్నారు. కొందరు మహిళలు కంటతడి పెడుతూ మర్రి శ్రీనివాస్ రెడ్డిపై శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రంలో యువతులపై జరుగుతున్న దారుణాలపై హాజీపూర్ గ్రామంలో ప్రజలందరూ శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలపై చర్చించుకుంటున్నారు. అక్టోబర్ నుంచి హాజీపూర్ కేసు కోర్టులో విచారణ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు అక్టోబర్ 10వ తేదీన నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. బాధిత కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్తులు, జిల్లా పోలీస్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు 120 మందికి కోర్టు సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జూలై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే.. నేరాలకు పాల్పడే వారిపై చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల మాదిరిగా నేరం చేసిన వారికి తక్షణమే శిక్షలు పడే వ్యవస్థ రావాలి. కోర్టులు, పోలీసులు విచారణలంటూ జాప్యం చేస్తే చట్టంలో ఉన్న లోసుగులు నేరస్తులకు తప్పించుకునే వెసులుబాటు దొరుకుతుంది. హాజీపూర్ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే శిక్ష పడితే ఇతర ప్రాంతాల్లో నేరం చేయాలనే వ్యక్తులకు కనువిప్పు కలిగేది. – దాసరి జంగారెడ్డి, హాజీపూర్ బతకనివ్వొద్దు జైలుకు వెళ్లయినా సరే శ్రీనివాస్ రెడ్డిని చంపాలనే కసి ఉంది. ముగ్గురు పిల్లలను పాడు చేసిన వాళ్ల పానాలు తిన్న శ్రీనివాస్ రెడ్డిని జైలుకు వెళ్లిన సరే చంపేయాలన్నా కసిగా ఉంది. ఇలాంటి రాక్షసులను భూమి మీద బతకనివ్వొద్దు. శ్రీని వాస్ రెడ్డి దారుణాలలో కుటుంబ సభ్యుల పాత్ర ఉంది. వారికి ఉన్న ఆస్తులను అమ్మి గ్రామాభివృద్ధికి వినియోగించాలి. – గోండ్రు జయమ్మ హాజీపూర్ రక్షణ కరువైంది.. హాజీపూర్‌లో జరిగిన ఘోరాలు మరవలేకపోతున్నాం. తప్పు చేసినోన్ని ఎన్ని రోజులు మేపుతారు. నెలలు గడుస్తున్నా నేటికీ భయంగానే ఉంది. ఎక్కడ చూసినా ఆడోళ్లకు రక్షణ లేకుండా పోయింది. శ్రీనివాస్ రెడ్డికి శిక్ష పడితేనే కొంత ఉపశమనం కలుగుతుంది. సర్కారోళ్లు నేరస్తుల పట్ల కఠినంగా ఉండకనే కొత్తోళ్లు తయారవుతున్నారు. – పరిధ దుర్గమ్మ, హాజీపూర్ ప్రజలకు అప్పగిస్తే బాగుండు.. ఆడ పిల్లల ఉసురు తీసిన మర్రి శ్రీనివాస్ రెడ్డిని సంఘటన జరిగినప్పడే ప్రజలకు అప్పగిస్తే బాగుండే. ఊరోళ్లే సరైన శిక్ష వేసేటోళ్లు. జైళ్లలో కూసపెట్టి సాదుడు ఎందుకు ఇదివరకే సావ కొడితే ఆడోళ్ల దిక్కు చూసేటోళ్లు ఉండకపోదురు. ప్రజలందరికీ ఎప్పటికి గుర్తుండే శిక్షపడితే తప్పు చేసేటోళ్లకు సిగ్గొస్తది. – దాసరి చంద్రారెడ్డి, హాజీపూర్ ఉరిశిక్షే సరైంది నిందితుడు సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్షే సరైంది. అతని పేరు వింటేనే ఆడపిల్లలు ఉలిక్కి పడే పరిస్థితి ఉంది. గ్రామంతో పాటు మండల ప్రజలందరూ నిందితుడికి బహిరంగంగా శిక్ష విధించాలని కోరుతున్నారు. అతనికి పడిన శిక్షతోనే చిన్నారుల ఆత్మలు శాంతిస్తాయి. – పక్కీరు రాజేందర్‌రెడ్డి, హాజీపూర్ విచారణలో వేగం పెరిగింది హాజీపూర్ బాలి కల వరుస హత్య ల కేసులో విచారణలో వేగం పెరి గింది. ఈ కేసుల్లో ప్రథమంగా బలైన తుంగని కల్పన కేసు మూడేళ్ల క్రితం నాటిది కావడంతో కొంత జాప్యం జరి గింది. నేటికీ 100 మందికి పైగా సాక్షులను కోర్టు విచారణ చేసింది. మరికొంత మందిని విచారణ చేయాల్సి ఉంది. మరో రెండు వారాల పాటు కోర్డులో సాక్షుల విచారణ జరిగే అవకాశం ఉంది. అనంతరం నిందితుడికి కోర్డు శిక్షను ఖరారు చేయనుంది. మహిళలు, యువతులు పోలీసులు వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అవగాహన పెంచుకోవాలి. స్మార్ట్ ఫోన్లలో యువత మహిళల రక్షణ కోసమే రూపొందించిన హాక్–ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ మేరకు అన్ని కళాశాలల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఏసీపీ భుజంగరావు, హాజీపూర్ బాలికల హత్య కేసుల విచారణ అధికారి -
హాజీపూర్ కేసు నేడు కోర్టులో విచారణ
సాక్షి, బొమ్మలరామారం: పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు సోమవారం నల్లగొండ కోర్టులో విచారణకు రానుంది. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు కోర్టునుంచి సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన విషయం విధితమే. ఈ కేసుల్లో వరంగల్ సెం ట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జులై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఎలాంటి శిక్షలు ఖరారు చేస్తుందోనని మండలంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. చదవండి: సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు -
చైర్మన్ సీటుపై వరద రాజకీయం
ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డిని సీటు నుంచి దింపేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఆట మొదలు పెట్టారు. ఇందులో భాగంగా 17 మంది టీడీపీ కౌన్సిలర్లు, ముగ్గురు కోఆప్షన్ మెంబర్లు కలిసి తాము పార్టీకి రాజీనామా చేస్తామని కడపలో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని శుక్రవారం రాత్రి కలిశారు. ప్రస్తుత చైర్మన్ గురివిరెడ్డికి రెండేళ్లు, రెండ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ఆసం రఘురామిరెడ్డికి మూడేళ్లు అని ఎన్నికల సందర్భంగా చెప్పారని, అయితే ఉండేల గురివిరెడ్డి రెండేళ్లు దాటినా సీటు దిగకుండా అలాగే కూర్చోవడంపై వారు జిల్లా అధ్యక్షుని దృష్టికి తెచ్చారు. గతంలో కూడా ఇదే విషయంపై పార్టీ పరిశీలకులు చెప్పామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తాము రాజీనామాలు చేస్తున్నట్లు చెప్పారు. తాము చైర్మన్‌తో మాట్లాడుతానని జిల్లా అధ్యక్షుడు కౌన్సిలర్లకు తెలిపారు. చెరి రెండున్నర సంవత్సరం ఉండేలా గతంలో చెర్చించామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి, చైర్మన్‌ను అక్కడికి పిలిపిస్తామని టీడీపీ అధ్యక్షుడు కౌన్సిలర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎవరు ఎలాంటి రాజీనామాలు చేయాల్సిన అవసరం కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం కానీ లేదన్నారు. మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా దిగనన్న చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా దిగనని గతంలో పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారు. ఎన్నికల సందర్భంగా మరో చైర్మన్ అభ్యర్థి కంటే ఎక్కువ తాను ఎక్కువగా రూ.2కోట్లకుపైగా అదనంగా ఖర్చు చేశానని, ఆరోజుకు ఎన్నికలకు డబ్బు తీసుకెళ్లిన నాయకులకు తాను మూడేళ్లు పదవిలో ఉంటానని ఇదివరకే పార్టీ పరిశీలకులకు గురివిరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై వరదరాజులరెడ్డి ఒప్పుకోలేదు. ముందు చెప్పిన విధంగానే 2, 3 ఏళ్లు పదవిలో ఉండాలే తప్ప ఇప్పుడు మూడేళ్లు అంటే కుదరదని దిగాల్సిందేనని పట్టుబట్టారు. ఆట మొదలైంది చైర్మన్‌ను రెండున్నర సంవత్సరం అయ్యే జనవరి 3వ తేదీకి దించాల్సిందేనని వరదరాజులరెడ్డి ఆట మొదలెట్టారు. ఇందులో భాగంగా తన వర్గీయ కౌన్సిలర్లు 17 మందితోపాటు ముగ్గురు కోఆప్షన్ మెంబర్లను పిలిపించారు. ప్రస్తుత చైర్మన్ దిగకపోతే తాము పార్టీకి రాజీనామా చేస్తామని లేఖలు తయారు చేయించారు. ఆ లేఖలపై కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లతో సంతకాలు చేయించారు. ఈ విషయంలో సంతృప్తిగా లేకపోయినా సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు కౌన్సిలర్లు తమ సన్నిహితులతో మాట్లాడారు. మంగళవారం సీఎం నుంచి చైర్మన్‌కు పిలుపు జనవరి 3వ తేదీకి రెండున్నరేళ్లు పూర్తికానున్న ఉండేల గురివిరెడ్డి పదవి నుంచి దిగాలని టీడీపీ జిల్లా అధ్యక్షునితోపాటు వరదరాజులరెడ్డి, ఆయన వర్గీయ కౌన్సిలర్లు సోమ, మంగళవారాల్లో ముఖ్యమంత్రిని కలిసి చైర్మన్‌ను అక్కడికి పిలిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గురివిరెడ్డి, ఆయన వర్గీయ కౌన్సిలర్లు మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా దిగేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా వరదరాజులరెడ్డి ఆట మొదలు పెట్టారు. ఇందులో ఎవరు గెలుపొందుతారో వేచి చూడాల్సిందే.