సమావేశంలో మాట్లాడుతున్న భిక్షమయ్యగౌడ్
సాక్షి, బొమ్మలరామారం : కాంగ్రెస్ గెలుపును ఏ శక్తీ అ డ్డుకోలేదని ఆలేరు అసెంబ్లీ మహాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పిల్లిగుండ్ల తండా, మర్యాల, చౌదర్‌పల్లి, కాండ్లకుంట తండా, గోవింద్ తండా, లక్క తండా, సీత తండా, చీకటిమామిడి, సోలిపేట్, ప్యారారం, తి మ్మాపూర్, బోయిన్‌పల్లి గ్రామాల్లో సోమవారం ని ర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవాలంటే కాంగ్రెస్æ పార్టీకే పట్టం కట్టాలన్నారు. మరోసారి తనను ఆదరించి ఆలేరు అభివృద్ధికి దో హదం చేయాలని భిక్షమయ్యగౌడ్ ఓటర్లను కో రారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభయహస్తం పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచుతామన్నారు. ఆడ పిల్లలకు వరంలాంటి బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ఆరు లక్షలతో ఎస్సీ, ఎస్టీలకు, ఐదు లక్షల వ్యయంతో బీసీ ఓసీ లకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. బంగారు తెలంగాణ అంటూ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుం బమే బంగారుమయం చేసుకున్నాడన్నారు. కేసీ ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకితోసి రెండు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. పీఏ సీఎస్ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సింగిర్తి మల్లేష్, బొల్లంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పడమటి పావని, తిరుమల కృష్ణగౌడ్, అన్నెమైన వెంకటేష్, కట్టా శ్రీకాంత్‌గౌడ్, మర్రి ఆగం రెడ్డి, రామిడి జంగారెడ్డి, ఎనగండ్ల వీరేశం, మాందాల రామస్వామి, చీర సత్యనారాయణ, బండ వెంకటేష్, మోటే గట్టయ్య, మ హదేవుని రాజు, మోటే వెంకటేష్, గుర్రం శ్రీని వాస్‌రెడ్డి, రాజు నాయక్, గుర్రాల సత్తిరెడ్డి, బో యిన్‌పల్లి రమేష్, శ్రీరాములు నాయక్, చంద్రశేఖర్, మోహన్‌నాయక్, రవికుమార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిక..
మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో సోమవా రం గొల్లకురుమ సామాజిక వర్గానికి చెందిన 30 మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.ఆలేరు మ హాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ కాం గ్రెస్ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సైనికుడిలా పనిచేయాలని కోరారు. రామిడి జంగారెడ్డి, బోగ వెంకటేష్, క్రిష్ణ, రామిడి బాల్‌రెడ్డి, ఇప్పల పల్లి స్వామి, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపేటలో..
రాజాపేట : మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రంగ కిష్టయ్య గౌడ్, రంగ బాలస్వామి గౌడ్‌లతోపాటు 50 మంది యువకులు సోమవారం డీసీసీ ప్రెసిడెంట్ బూడిద భిక్షమయ్య గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుచేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ గెలపుకోసం కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిని పాండు, కార్యదర్శి రంగ నరేష్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రంగ పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment