పోలీసుల ఆధీనంలో ఉప్పల్‌ స్టేడియం | Tight security at Uppal stadium for IPL matches | Sakshi
Sakshi News home page

పోలీసుల ఆధీనంలో ఉప్పల్‌ స్టేడియం

Published Fri, Apr 6 2018 3:48 PM | Last Updated on Fri, Apr 6 2018 3:58 PM

Tight security at Uppal stadium for IPL matches  - Sakshi

ఉప్పల్‌ స్టేడియం, మహేష్‌ భగవత్‌ (ఇన్‌సెట్‌లో)

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఉప్పల్ స్టేడియానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఉప్పల్‌లో మొత్తం 7 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో రేపటి నుంచి స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. 2,500 మంది పోలీసులతో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భద్రత కల్పిస్తామన్నారు. స్టేడియం ప్రాంగణంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. మ్యాచ్ ఉన్న రోజు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు.

ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 9, 12, 22, 26, మే 5, 7, 19 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరుగనున్న మ్యాచ్‌( ఏప్రిల్‌ 22)కి వచ్చే వారికి మధ్యాహ్నం 1 గంట నుంచి అనుమతి ఉంటుందని , రాత్రి 8 గంటల మ్యాచ్‌లకి సాయంత్రం 5  గంటల నుంచి అనుమతి ఇస్తామన్నారు. మ్యాచ్‌లకు వచ్చేవారు ఒక సెల్ ఫోన్ మినహా, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, తిను బండరాలు కానీ అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement