రాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక హోర్డింగు
అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రచార పిచ్చి పీక్ స్టేజీకి చేరింది. ఒకవైపు శ్రీకాకుళంలో ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తుపాను బాధితులు ఆందోళన చేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తిత్లీ తుపాను బాధితుల సమస్యలు తీర్చేశామని ప్రచారం చేసుకుంటుంది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తిత్లీ బాధితులకు ప్రభుత్వం కొండంత అండ అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదాయాన్ని దుబారాగా ఖర్చు చేస్తోంది.
నాలుగు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా కవిటిలో చంద్రబాబును అడ్డుకుని నిరసన తెలిపిన తుపాను బాధితులు ఆందోళన చేస్తున్న ఫోటోను వెనక నుంచి తీసి చంద్రబాబుకు ప్రజలు అభివందనం చేస్తున్నట్లు ప్రభుత్వం హోర్డింగుల్లో చిత్రీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment