ప్రచార పర్వంలోనే స్వచ్ఛ ‘భారతం’? | publicity stunt on swachh Bharat? | Sakshi
Sakshi News home page

ప్రచార పర్వంలోనే స్వచ్ఛ ‘భారతం’?

Published Tue, Oct 28 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

ప్రచార పర్వంలోనే స్వచ్ఛ ‘భారతం’?

ప్రచార పర్వంలోనే స్వచ్ఛ ‘భారతం’?

పారిశుద్ధ్యం బాధ్యత పూర్తిగా మునిసిపాలిటీల వంటి స్థానిక సంస్థలదే. పారిశుద్ధ్యం పనుల సమర్థ నిర్వహణకు తగినన్ని నిధులను, సాధన సంపత్తిని, సాంకేతికతను వాటికి సమకూర్చడం తక్షణ అవసరం. అది విస్మరించి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం పేరిట సాగుతున్న ఈ శుద్ధ ప్రచార కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ ఎప్పటికైనా సాధ్యపడేనా?
 
 అంబానీల నుండి గల్లీ లీడర్ల దాకా మీడియా కవ రేజీకి అనువుగా చీపుర్లు పట్టి సుతారంగా రోడ్లు ఊడ్చేస్తుంటే... అర్థరాత్రి, అపరాత్రి అనక రోజూ ఆ పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ము క్కున వేలేసుకోవాల్సి వ స్తోంది. ఇదీ ఈ మధ్య దేశవ్యాప్తంగా ప్రదర్శితమ వుతున్న ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ అనే ప్రహస నం. ప్రభుత్వ ప్రచారార్భాటానికి తోడు భారీ తారా గణంతో దాని హవా సాగుతోంది.    
 
 మన నగరాలు, పట్టణాలు మురికి కూపాలుగా ఉంటున్న మాట వాస్తవం. నిరంతర పారిశుద్ధ్యానికి హామీని ఇవ్వగలిగినంత మంది పారిశుద్ధ్య కార్మి కులు ఏ మునిసిపాలిటీకీ, కార్పొరేషన్‌కూ లేకపో వడమే ఇందుకు ప్రధాన కారణం. పారిశుద్ధ్యం బాధ్యత పూర్తిగా మునిసిపాలిటీల వంటి స్థానిక సంస్థలదే. కానీ తగినంత మంది కార్మికులను నియ మించడానికిగానీ, సాధన సంపత్తిని సమకూర్చడా నికిగానీ వాటి వద్ద నిధులు లేవనేది వాస్తవం. పారి శుద్ధ్యం పనులు సమర్థవంతమైన నిర్వహణకు తగి నన్ని నిధులను, సాధన సంపత్తిని, సాంకేతికతను వాటికి సమకూర్చడం తక్షణ అవసరం. ఆ పని చేయకుండా పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం, వారిని భాగస్వాములను చేయడం పేరిట శుద్ధ ప్రచార కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ ఎప్పటికైనా సాధ్యపడేనా?
 
 ఈ కార్యక్రమంలో అతి కీలకమైనవి, నిరంతర పాత్రధారులు కావాల్సినవి స్థానిక సంస్థలే. వాటిని బలోపేతం చేసి అమలులో ముందునిలిపి, ప్రజ లను భాగస్వాములను చేస్తే ఫలితం ఉంటుంది. సినిమా తారలు, క్రీడాకారుల వంటి సెలబ్రిటీలు, రాజకీయ నేతల ప్రచారం అందుకు తోడైతే ఉప యోగం ఉంటుంది. అంతేగానీ తాత్కాలికమైన ఈ శుద్ధ ప్రచార కార్యక్రమం వల్ల ఒరిగేదేమిటి? పట్ట ణాల్లో పర్వతాల్లా పేరుకు పోతున్న చెత్త అతి పెద్ద సమస్య. రీసైక్లింగ్ ఏర్పాట్లు శూన్యం. ఇక మురుగు నీరు, వాన నీరు ఎక్కడికి పోవాలి? మురుగు నీటిని శుద్ధి చేసే సాంకేతికత ఎప్పుడో అందుబాటులోకి వచ్చినా ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? కాంక్రీటు అరణ్యాలుగా మారిన, మారుతున్న పట్టణ ప్రాం తాల్లో వాన నీటితో చేసే సాగు అత్యావశ్యకం, అనేక సమస్యలకు పరిష్కారం. అందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజలను ఎప్పుడు కదిలించాయి? ప్రతి నీటిబొట్టును జాగ్రత్తగా వాడాలని, భద్రపర చుకోవాలని ప్రజలకు ఏ పాటి అవగాహన కల్పిం చాం? అది తెలిసి వాళ్లు ఎంతవరకు దాన్ని ఆచర ణలో పెడుతున్నారు?
 
 ఇక బహిరంగ మల విసర్జన మరో పెద్ద సమ స్య. ‘‘మరుగు దొడ్డి లేకుంటే పెళ్లి నిరాకరించు’’ అం టూ అన్ని భారాల్లాగే దీన్ని కూడా మహిళల నెత్తికే ఎత్తారు! మరి కట్నం అడిగితే పెళ్లికి  నిరాకరించమని ఎందుకు పిలుపునివ్వలేదో? గ్రామాల్లో 60%, పట్టణాల్లో 20% ఇళ్లల్లో మరుగుదొడ్లు లేవు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా రాబోయే ఐదేళ్లలో దాదాపు  2 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో 11 కోట్ల మరుగుదొడ్లను కట్టాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. గతంలో చేపట్టిన నిర్మల్ గ్రామ్ అభియాన్, టోటల్ శానిటేషన్ కార్యక్రమాలకు కొత్త పేరు పెట్టి చేస్తున్న కొత్త ఖర్చు ఇది. గతంలో చేపట్టిన కార్య క్రమాలలోని లోపాలను, అవినీతిని పట్టించుకో కుండా చేపట్టిన ఇది కూడా వాటిలాగే విఫలం కాక తప్పదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 1986 నుండి మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు దాదాపు ఇంతే మొత్తాన్ని ఖర్చు చేశాయి. 2001 తర్వాత 9.7 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్టు ప్రభు త్వ లెక్కలు చెబుతున్నాయి. 2011 సెన్సెస్ ప్రకారం దేశంలోని మొత్తం మరుగు దొడ్ల సంఖ్య 11.5 కోట్లు. అంటే మధ్య, ఉన్నత తరగతుల వారంతా కట్టించుకున్నవి కేవలం 2 కోట్లేనా? ప్రభుత్వ నిధు లతో కట్టిన మరుగుదొడ్లలో ఎక్కువ భాగం కాగి తాల మీద కట్టినవే. ఉదాహరణకు ఈ పద్దు కింద అత్యధికంగా ఖర్చు చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గత పదేళ్లలో అది రూ. 3,209 కోట్లు ఖర్చు చేసినా 64% ఇళ్లలో మరుగు దొడ్లు లేవు. అలాగే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 50.4% ఇళ్లకు ఇంకా మరుగుదొడ్లు లేవు.
 
 గత వైఫల్యాలకు కారణాలను వెతకకుండా, తప్పులను సరిదిద్దకుండా, కొన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలలో పాతుకుపోయి ఉన్న అలవాట్లను, సంప్ర దాయాలను మార్చకుండా, ప్రజల చురుకైన భాగ స్వామ్యం లేకుండా చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల  మళ్లీ బాగు పడేది కాంట్రాక్టర్లే. కడు పేద దేశం బంగ్లాదేశ్‌లో మరుగుదొడ్లు లేని ఇళ్లు 3% కాగా, మనకంటే తక్కువ తలసరి ఆదాయ దేశం పాకి స్థాన్‌లో 23%. ఇప్పటికైనా ఏలికలు మేల్కొని ప్రచార ఆర్భాటాలు కట్టిపెట్టి, ఆచరణాత్మక స్వచ్ఛ భారత్‌గా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతారని ఆశి ద్దాం. లేకపోతే పేరుకుపోతున్న చెత్త, మురుగు పేద లకే కాదు అన్ని వర్గాల వారికి వినాశకరంగా పరిణ మించక తప్పదు.   
 
 సందర్భం: దేవి (వ్యాసకర్త సామాజిక కార్యకర్త)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement