‘సాదాబైనామా’పై విస్త్రృత ప్రచారం కల్పించాలి
– లబ్ధిదారులకు సమస్య తలెత్తకుండా చూడాలి
–వీడియో కాన్ఫరెన్స్‌లో రేమండ్ పీటర్
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు
నల్లగొండ : సాధా బైనామాలకు సంబంధించి విస్త్రృత ప్రచారం కల్పించాలని భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ రేమండ్ పీటర్ సూచించారు. బుధవారం హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఓఆర్ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి తద్వారా లబ్ధిదారలుకు సమస్యలు రాకుండా చూడాలని కోరారు. వివిధ జిల్లాలో పెండింగులో వున్న దరఖాస్తులను పరిశీలించి నివేదికలు పంపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు వున్నట్లయితే తన దృష్టికి తేవాలన్నారు. హరితహారం బాధ్యతల కారణంగా రెవెన్యూ విధులను మరిచిపోకూడదని గుర్తు చేశారు. గ్రామాల వారీగా సాదా బైనామాకు సంబంధించిన రిపోర్టులను పంపాలని, సరిగా పని చేయని తహసీల్దార్లకు చార్జి మెమోలు జారీ చేయాలని సూచించారు. రెవెన్యూ అంశాలు, సాధాబైనామాలు, అసైన్డ్ భూముల పరిశీలన, మ్యూటేషన్ల పెండింగ్, ఎల్‌ఈసీ దరఖాస్తులు, ఆడిట్ పేరాలు, జిల్లాల రీఆర్గనైజేషన్ మొదలగు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్.సత్యనారాయణ మాట్లాడుతు జిల్లాలో ఇప్పటి వరకు 1 లక్షా 31వేల సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు చెప్పారు. ఇంకా 14వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. మరో రెండు రోజల్లో వీటì ని కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. కొన్ని మండలాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నందువల్ల అనుకున్న లక్ష్యానికి చేరుకోలేదు. వీడియో కాన్ఫరెన్సులో డీఆర్వో రవి, ఆర్డీఓలు, ఎన్‌ఐసీ అధికారి గణపతిరావు, సంబంధిత అధికారులు తదితరులున్నారు.