on
-
‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు?
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా నేడు (గురువారం) ఐటీఓ కూడలిలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రచారం సాగనుంది. 28న బరాఖంబలో, అక్టోబర్ 30న చంద్‌గిరామ్ అఖారా కూడలి, నవంబర్ 2న మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రచారం సాగనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ఈసారి ఐటీఓ కూడలి నుంచి ప్రారంభిస్తామన్నారు. నవంబర్ 3వ తేదీన 2000 ఎకో క్లబ్‌ల ద్వారా చిన్నారులకు కూడా అవగాహన కల్పించనున్నామన్నారు. 2020వ సంవత్సరంలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ ప్రచారం ప్రారంభించారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు 2019 సంవత్సరంలో దీనిపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. కూడలి సిగ్నల్ వద్ద రెడ్ లైట్ కనిపించినప్పుడు వాహనాల ఇంజిన్లను స్విచ్ ఆఫ్ చేయని పక్షంలో తొమ్మిది శాతం అధికంగా కాలుష్యం వ్యాపిస్తుంది. సాధారణంగా ఢిల్లీలో వాహనదారులు 10 నుండి 12 రెడ్ లైట్ల గుండా వెళుతుంటారు. ఈ కూడళ్లలో వాహనం ఇంజన్ రన్ అవుతూనే ఉంటుంది. ఫలితంగా 25 నుంచి 30 నిమిషాల పాటు అనవసరంగా పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చయి, పొగ రూపంలో కాలుష్యం వ్యాపిస్తుంది. అందుకే కూడలిలో రెడ్ లైట్ పడినప్పుడు వాహనం ఇంజిన్ అపాలని ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తున్నారు. కాగా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం మరింత ఆందోళనకరంగా మారుతోంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆప్ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ‘నాసా’ ఫొటోలలో కారణం వెల్లడి! -
థియేటర్ లో పాప్ కార్న్ రేట్ల పై తేజ సంచలన కామెంట్స్
-
IBS ర్యాగింగ్ కేసులో వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు
-
రాష్ట్రపతి పై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఫైర్
-
టీడీపీ నేతలపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ ..
-
Revolt RV400: కీ అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్‌తోనే బండి స్టార్ట్
వాహనాన్ని స్టార్ట్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కీ కంపల్సరీ. అది లేకుండా బండి ముందుకు నడవదు. అయితే గత కొంత కాలంగా కీ లేకుండా బండ్లు స్టార్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అవన్నీ రెంటల్ బైక్ సర్వీసెస్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్ బైకులకు సైతం ఈ ఫీచర్‌ని అందుబాటులోకి వచ్చింది. ఓలా రాకతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో పరిస్థితులు మారిపోయాయి. ఈ సెగ్మెంట్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు అందించేందుకు కంపెనీలో పోటీ పడుతునఆనయి. తాజాగా తమ బైకులకు సంబంధించి కీలకమైన మార్పును రివోల్ట్ తీసుకొచ్చింది. కీతో సంబంధం లేకుండానే బండి ఆన్ ఆఫ్ చేసే విధంగా సరికొత్త టెక్నాలజీని రివోల్ట్ అందిస్తోంది. రివోల్ట్ 400 బైకులు స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో రివోల్ట్ యాప్ ద్వారా కీతో సంబంధం లేకుండానే బైను ఆన్, ఆఫ్ చేయవచ్చు. పార్కింగ్ ఏరియాలో బండి ఎక్కడ ఉందో కూడా కనుక్కోవచ్చు. 2021 సెప్టెంబరు నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండే బైకులకు ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. కొత్తవాటితో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న బైకులకు సైతం ఈ ఫీచర్‌ని ఉచితంగానే అందిస్తామని రివోల్ట్ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. రివోల్ట్ షోరూమ్‌కి వెళ్లి కీ లేకుండా బైకులను ఆపరేట్ చేసే ఫీచర్‌ను పొందవచ్చన్నారు. అయితే కీ లెస్ ఫీచర్‌ని కేవలం రివోల్ట్ ఆర్వీ 400 మోడల్స్‌కే పరిమితం చేశారు. ఆర్వీ 300 మోడల్ బైకులకు ఈ ఫీచర్‌ని అందివ్వడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రివోల్ట్ ఆర్వీ 400 మోడల్ స్టాండర్డ్ ధర ఆన్ రోడ్ రూ.1,06,999గా ఉంది. కొత్త మోడల్ వివరాలపై స్పష్టత లేదు. -
ఇసుక ర్యాంపులపై దాడులు
- 1062 క్యూబిక్ మీటర్ల ఇసుక స్వాధీనం - కలెక్టర్ కార్తికేయ ఆదేశాలతో కదిలిన భూగర్భ గనులశాఖ యంత్రాంగం - ‘సాక్షి’ ఫోకస్‌కు ఎఫెక్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ/కపిలేశ్వరపురం: అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్న అక్రమార్కులపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపించింది. జిల్లాలో అనుమతి లేని ఇసుక ర్యాంపుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలించి లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్న ఇసుక దందాను గత నెల 23న ‘ప్రతిరేణువుకూ రేటే’ శీర్షికన ‘సాక్షి ఫోకస్’ ద్వారా ఫొటోలతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాథమిక సమాచారం రప్పించుకున్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పందించారు. గనులు, భూగర్భజల శాఖాధికారులతో ఇసుక ర్యాంపుల తనిఖీలు జరపాలంటూ ఆదేశించారు. ఈ మేరకు సంబంధితశాఖలోని రెగ్యులర్, విజిలెన్స్ విభాగాలకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, స్థానిక రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. సాక్షి పత్రికే అజెండా... జిల్లాలోని మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం, కోరుమిల్లి, తాతపూడి, రాజమహేంద్రవరం కుమారి టాకీస్, వేమగిరి, కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం, అంకంపాలెం, జొన్నాడ, మందపల్లి, తునిలో తాండవ నది తదితర ర్యాంపుల్లో ఇసుకను అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో ఇసుక అక్రమాలు అధికంగా జరుగుతున్న కపిలేశ్వరపురం మండలంలోని పలు ర్యాంపులపై దాడులు నిర్వహించారు. మైన్స్ శాఖ రాజమహేంద్రవరం ఆర్ఐ ఎస్.లక్ష్మీనారాయణ, మైన్స్ విజిలెన్స్ (రాజమహేంద్రవరం) ఆర్ఐ పి.మురళి ఆధ్వర్యంలోని బృందం కోరుమిల్లి, కపిలేశ్వరపుర, మాచర గ్రామాల్లో దాడులు నిర్వహించి ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మొదట తాతపూడి ర్యాంపును తనిఖీ చేశారు. యూనిట్ ఇసుక రూ.750లకు బదులు రూ.1100లు విక్రయిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇలాగే ధరలు పెంచి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు అక్కడి నిర్వాహకులను హెచ్చరించారు. సీజ్ చేసిన 1062 క్యూబిక్ మీటర్ల ఇసుక... కోరుమిల్లి, కపిలేశ్వరపురం ర్యాంపుల పరిధిలో పరిసర గ్రామాల్లో వీఆర్వోలతో కలిసి తనిఖీలు నిర్వహించి 13 గుట్టలుగా ఉన్న 1062 క్యూబిక్ మీటర్ల ఇసుకను సీజ్ చేశారు. కోరుమిల్లి ఆరోగ్య ఉప కేంద్రం, శివాలయం, మాచర శివారుల్లో పలు గుట్టలను గుర్తించారు. ఇసుకను లారీలో లోడింగ్ చేసినప్పుడు ఒక యూనిట్ అదనంగా వేయించుకుని నిల్వ చేసుకుని లాభపడుతున్నారని తేల్చారు. కపిలేశ్వరపురం–2 ర్యాంపు సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో ఇసుక గుట్టలను స్వాధీనం చేసుకుని వీఆర్వోలు తవిటికి సత్యనారాయణ, వెంకటరమణకు అప్పగించారు. దేశం నేతల పైరవీలు... ఆరోగ్య ఉప కేంద్రం వద్ద నిల్వలను స్వాధీనం చేసుకుంటుండగా అధికార పార్టీ నేతలు కొందరు అడ్డంపడ్డారు. ఇంటి పునాదులు కోసం నిల్వ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. పునాదులకు ఉచిత ఇసుకను వినియోగించడం నిబంధనలకు విరుద్ధమంటూ ఆ నిల్వలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి నిర్మాణాల కోసం తెచ్చుకున్న వాటిని అక్రమం నిల్వలుగా నిర్ధారించడం సరికాదని వాదనకు దిగారు. ఇంటి నిర్మాణ ప్రదేశంలో లేని నిల్వలను స్వాధీన పర్చుకుంటామన్నారు. నిర్మాణం జరుగుతున్నట్టు వీఆర్వోల సమక్షంలో నిరూపించుకుంటే తిరిగి నిల్వలను వినియోగించుకోవచ్చని మైన్స్ అధికారులు వారికి చెప్పారు.. ఈ సందర్భంగా మైన్స్ ఆర్ఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 5తో కోరుమిల్లి–2, మార్చి–31తో కోరుమిల్లి–1 ర్యాంపులకు గడువు ముగిసిందన్నారు. కపిలేశ్వరపురం–1 ర్యాంపు 2018 ఫిబ్రవరి 16, తాతపూడి ర్యాంపు 2017 నవంబరు 27 వరకు అనుమతి ఉందన్నారు. త్వరలో కపిలేశ్వరపురం–3, కోరుమిల్లి–2, కేదారిలంక ర్యాంపులపై కసరత్తు జరుగుతోందన్నారు. ఈ దాడుల్లో ఎంపీడీఓ వి.అబ్రహంలింకన్, తహసీల్దారు కేపీ నరసింహులు, అంగర ఎస్సై వాసా పెద్దిరాజు, గోదావరి హెడ్ వర్క్స్ ఏఈ డి.రాధాకృష్ణ, వీఆర్వోలు ఎస్.సత్యనారాయణ, వీరబాబు, టి.సత్యనారాయణ, వెంకటరమణలతో కలిసి మైన్స్ అధికారులు పాల్గొన్నారు. -
ఆగని వదంతులు..!
రూ.10నాణేలు చెల్లుబాటు కావంటూ పుకార్లు ∙ తీసుకోవడానికి నిరాకరిస్తున్న వ్యాపారులు ∙ అటువంటిదేమీ లేదంటున్న బ్యాంకర్లు రాయవరం : పది రూపాయల నాణేలు చెల్లవనే వదంతులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. నెల రోజులుగా ఈ పరిస్థితి ఉంది. రూ.10నాణేలను తీసుకునేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తుండగా..నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం వదంతులేనని బ్యాంకర్లు కొట్టిపడేస్తున్నారు. నోట్ల రద్దు నుంచి.. గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ అదే పరిస్థిథి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల నాణేలు చెల్లవని ఆటోవాలాలు, చిరు వ్యాపారులు, పండ్లు, కూరగాయలు, పాల వ్యాపారులు..ఇలా ప్రతి ఒక్కరూ తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. రూ.10నాణేలు వచ్చిన కొత్తలో, ఆ తర్వాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకోవడానికి ఆసక్తి చూపారు. చాలా మంది వ్యాపారులు మూటలు కట్టి ఇళ్లలో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న పుకార్లతో వారు ఆ నాణేలను బయటకు తీస్తున్నారు. అయితే వీటిని తీసుకోవడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీని వల్ల చిన్న చిన్న తగాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారికి చిల్లరగా కండక్టర్లు రూ.10నాణేలు ఇస్తే అటు ప్రయాణికులు..ఇటు కండక్టర్లు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయి.. రూ.10 నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం అపోహలు మాత్రమే. రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని రూ.10నాణేల మారకాన్ని వినియోగించుకోవాలి. – డి.సత్యనారాయణ, ఏజీఎం, ఆంధ్రాబ్యాంకు, రాయవరం -
భయాందోళనలో చంద్రబాబు
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు ప్రయత్నం అర్థం లేని నిర్ణయాలతో పేదలకు రేషన్ అందకుండా చేస్తున్నారు సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీతానగరం (రాజానగరం): ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర భయాందోళనలో ఉన్నారని, అందుకే అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేందుకు పూనుకుంటున్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఇక్కడికి వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసి ఏడాది పూర్తి కావొస్తోందన్నారు. తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. రేషన్ షాపుల్లో క్యాష్‌లెస్ విధానం అంటు లబ్ధిదారులకు సరుకులు అందించకుండా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలు ప్రవేశపెట్టింది రేషన్ సరుకులు నిలిపివేయడానికేనని ఆరోపించారు. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను వైఎస్సార్ సీసీ బయట పెట్టడంతో, తమను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ప్రజల దృష్టిలో దోషులుగా నిలిచారని చెప్పారు. బస్సు ప్రమాదంలో జేసీ బ్రదర్స్‌ను కాపాడేందుకు చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తమ పార్టీ నాయకుల్ని కాపాడుకునేందుకు చూస్తున్నారే తప్ప ప్రజా సేవను పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. ఇసుక, మట్టి వ్యాపారం చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ దందా వంటి పలు అక్రమాలకు పాల్పడడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టి, పాలన పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనేఉన్నాయన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్ బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చళ్ళమళ్ళ సుజీరాజు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు -
నేనసలే పిచ్చోడిని... రెచ్చగొట్టకండి
ఎమ్మెల్యేను నిలదీసిన మహిళపై సహనం కోల్పోయిన వర్మ కొత్తపల్లి : ప్రజా ప్రతినిధిని సమస్యలపై నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. సహనంగా సమాధానం చెప్పాల్సిన ప్రజాప్రతినిధే సహనం కోల్పోతే. అదే జరిగింది కొత్తపల్లి మండలంలో. తన సమస్యలను చెప్పుకుంటున్న ఓ మహిళపై పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ‘నేను అసలే పిచ్చోడిని...నన్ను రెచ్చగొట్టొ’’ద్దంటూ సభలోనే చిర్రెత్తిపోవడంతో అక్కడున్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించింన ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. దీంతో కొత్తపల్లి ఎస్సీపేటకు చెందిన ఒక మహిళ నిలబడి సమస్యలపై ఎమ్మెల్యే వర్మను నిలదీసింది. రోడ్లు సామాన్య ప్రజల ఇళ్ళ వద్ద కాకుండా తమ పార్టీ నాయకులు ఇళ్ళ వద్దే వేసుకుంటున్నారని, వర్షం వస్తే మా వీధిలో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని, తన కుమారుడు చనిపోయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా తన కోడలకు పింఛను మంజూరు చేయలేదని నిలదీయడంతో సర్దిచప్పాల్సిందిపోయి ‘నేను అసలే పిచ్చోడిని నన్ను రెచ్చగొట్టొ‘ందంటూ పలుమార్లు కూర్చో కూర్చోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకపల్లికి చెందిన టి.మంగకు పింఛను మంజూరైందని చెప్పి సభకు రప్పించారు. కొత్త పింఛను వస్తుందని ఆశగా వచ్చిన ఆమెకు పింఛనును మంజూరు కాలేదని చెప్పడంతో ఆమె సభలోనే కన్నీళ్ళపర్యంతమైంది. -
ముక్కలపై ఉప్పెన
భద్రాచలం కోసం ఆఖరి పోరాటం నేడు డివిజన్ బంద్‌కు పిలుపు అఖిలపక్షం అత్యవసర సమావేశం భవిష్యత్ కార్యాచరణపై చర్చ సీపీఎం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం ఏజెన్సీ బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య భద్రాచలం : భద్రాచలం పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, వర్తక, వాణిజ్య సంఘాలన్నీ ఏకమైయ్యాయి. మంగళవారం భద్రాచలంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కమిటీ నాయకులు రావుల పల్లి రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ లతో పాటు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు పాలకుల తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో భద్రాచలం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. నాడు నాలుగు మండలాలు, నేడు రెండు మండలాలు పోతే ఇక భద్రాచలం డివిజన్లో మిగిలేవి మూడేనని, ఇది భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. దీనిపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. బుధవారం భద్రాచలం బంద్‌కు పిలుపునిస్తున్నట్లుగా ప్రకటించారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజానీకం మద్దతు తెలుపాలని వారు కోరారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కడియం రామాచారి, గంటా కృష్ణ, టీడీపీకి చెందిన కొమరం ఫణీశ్వరమ్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, బీజేపీ నాయకులు ఆవుల సుబ్బారావు, నాగబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కంభంపాటి సురేష్, చారుగుళ్ల శ్రీనివాస్, టీవీ, నరేష్, సుబ్బారావు, ఉపేంద్రవాసు, దేశప్ప, సురేష్‌నాయుడు,, కృష్ణ, సాయి, రాజు పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం వాజేడు, వెంకటాపురం మండలాలను కొత్తగూడెం జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మంగళవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించటం సరైంది కాదని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. ఖమ్మంలో భద్రాచలంను మూడో జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సారెడ్డి, నూకరత్నం, శ్రీను, కృష్ణార్జునరావు, రాఘవయ్య, కొండలరావు, ముక్తేశ్వరి, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే రాజయ్య, ఎన్డీ నేత కెచ్చెల రంగారెడ్డి భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం చేపట్టిన బంద్‌లో భాగంగా భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ధర్నా చేశారు. ఆదివాసీ ప్రాంతాలను విచ్ఛిన్నం చేయాలని పాలకులు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే రాజయ్య ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భద్రాచలం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీ చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, భవిష్యత్‌లో మనుగడ ప్రశ్నార్థకం కాబోతుందని న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీల స్వయం పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో కెచ్చెల కల్పన, ప్రసాద్, జోగారావు, ప్రమోద్, జీఎస్పీ నుంచి చలపతి, ప్రకాష్, సత్యనారాయణ, కొండరెడ్ల సంఘం నాయకులు ముర్ల రమేష్ పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు -
వృద్ధురాలిపై అత్యాచారం
దమ్మపేట: మండలంలోని నాగుపల్లిలో 60 ఏళ్ల ఓ వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బండి రమేష్ (35) బుధవారం రాత్రి అత్యాచారం చేశాడు. ఎస్ఐ జలకం ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..సదరు వృద్ధురాలి భర్త, చిన్న కుమారుడు గతంలోనే చనిపోయారు. పెద్ద కొడుకు పెళ్లయ్యాక అత్తారి ఊరిలో ఉంటున్నాడు. ఈమె గ్రామంలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. గండుగులపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బండి రమేష్ నాగుపల్లిలో ఉంటూ పనిచేసుకుంటూ..బంధువైన బాధితురాలి ఇంటికి వచ్చి వెళుతుంటాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో అతను మద్యం సేవించి వృద్ధురాలి ఇంటికి వచ్చి..నిద్రిస్తున్న ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయట ఎవరిౖకెనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం తాను పనిచేస్తున్న గ్రామంలోని కృష్ణారావు అనే వ్యక్తికి ఈ ఘటన గురించి ఏడుస్తూ చెప్పడంతో..ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు బాధిత వృద్ధురాలి ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట సీఐ రవికుమార్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ వివరించారు. -
‘విత్తన కంపెనీలపై కేసులు పెట్టాలి’
రఘునాథపాలెం : విత్తనం అమ్మిన డీలర్లపైనే కాదు విత్తనాలు తయారు చేసిన కంపెనీలపై కూడా కేసులు నమోదు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. గురువారం రఘునాథపాలెం మండలంలో నకిలీ విత్తనాలు, తెగుళ్లతో దెబ్బతిన్న మిరప, పత్తి పంటలను జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ భారీ వర్షాలతోపాటు నకిలీ విత్తనాలతో జిల్లా రైతాంగం పెద్ద మొత్తంలో నష్టపోయిందని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతుంటే కొంతమంది అధికార పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 2,500 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మద్దినేని స్వర్ణకుమారి, కోటిరెడ్డి, ఏలూరి శ్రీనివాసరావు, గొడ్డెటి మాధవరావు, సుమంత్, హరీష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే, నాయకులు ఆత్మహత్యకు పాల్పడిన వెంకన్నకు చెందిన పత్తి పొలాన్ని పరిశీలించారు. -
వరదలపై అప్రమత్తం
l గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్‌గా ఉండాలి l ముంపు మండలాల వారికి సహకరించాలి l భద్రాద్రిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం భద్రాచలం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలొస్తే..ఎదుర్కొనేందుకు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆదివారం ఐటీడీఏ పీఓ చాంబర్లో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం, పీఓ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ..ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత, పెన్‌గంగ, ఇంద్రావతితో పాటు పెద్దఎత్తున వరద నీరు గోదావరిలో కలుస్తోందని, సోమవారం నాటికి సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు భద్రాచలం వద్దకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది 52 అడుగులకు ప్రవాహం చేరిందని గుర్తు చేశారు. డివిజనల్, మండల అధికారులు హెడ్ క్వార్ట్‌ర్స్‌లో ఉండాలని, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో ఫో¯ŒSలో మాట్లాడానని, ప్రభుత్వం నుంచి హెలీకాప్టర్, ఆర్మీ బృందాలు కావాలంటే కలెక్టర్, ఎస్పీకి అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, సీడబ్ల్యూసీ వారి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారులకు సమాచారం అక్కడి ప్రజలను కాపాడేందుకు సహకరించాలని సూచించారు. తాను సమావేశానికి వస్తున్నానని తెలిసినా కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలకు ఆదేశించారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జెడ్పీ సీఈఓ నగేష్, డీఎస్ఓ ఉషారాణి, డీఈఓ నాంపల్లి రాజేష్, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు, డీపీఓ నారాయణ, కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్, పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
బాలికపై గ్యాంగ్‌రేప్
కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్లు ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఖమ్మం క్రైం : ఓ బాలికను కిడ్నాప్ చేసి.. ఆపై గ్యాంగ్‌రేప్ చేసిన సంఘటన ఖమ్మం నగరంలోని త్రీటౌన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్రీటౌన్ ఎస్సై మల్లయ్య కథనం ప్రకారం.. నగరంలోని పీఎస్ఆర్ రోడ్‌కు చెందిన బాలిక(15) జూన్ 20వ తేదీన ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చింది. తాను ప్రేమించిన చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ రోశయ్య వద్దకు తీసుకెళ్లాలని.. అతడి స్నేహితుడు, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ సోందుపాషా వద్దకు వచ్చి అడగ్గా.. ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. అదే ఆటోలో పాషా సోదరుడు షేక్ దాదా కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఆటోను కాల్వొడ్డు వైపు తిప్పుతుండగా.. అనుమానం వచ్చిన బాలిక పాషాను ప్రశ్నించింది. అరిస్తే చంపుతానని బెదిరించి.. ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి తెల్దారుపల్లి సాగర్ కాల్వ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత రూరల్ మండలం గొల్లగూడెం ప్రాంతానికి చెందిన మరో ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. అతడు కూడా అక్కడికి చేరుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆమెను ఖమ్మం బస్టాండ్‌లో దింపి వెళ్లిపోయారు. బస్టాండ్‌లో ఉన్న బాలిక తాను ప్రేమించిన రోశయ్యకు ఫోన్ చేయగా.. అతడు అక్కడికి చేరుకుని ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అయితే భయంతో గ్యాంగ్‌రేప్ విషయం రోశయ్యకు చెప్పలేదు. పెళ్లి చేసుకున్న రోశయ్య బాలికను తన స్వగ్రామం కోమట్లగూడెంకు ఉంచాడు. కాగా.. షాపులో పని చేసేందుకు వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. అదృశ్యమైన బాలిక చింతకాని మండలం కోమట్లగూడెంలో ఉన్నదని ఈనెల 10వ తేదీన పోలీసులకు తెలియడంతో.. వారు వచ్చి విచారించగా విషయం బయటపడింది. దీంతో డీఎస్పీ సురేష్‌కుమార్ అధ్వర్యంలో సీఐ మొగిలి, ఎస్సై మల్లయ్య రంగంలోకి దిగి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే బాలికను పెళ్లి చేసుకున్న రోశయ్యపై పోలీసులు అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు చేసి.. అతడిని కూడా అరెస్ట్ చేశారు. -
ఇదొక మహానాటకం
అక్షర తూణీరం రాష్ట్ర విభజన నాటి నుంచి ప్రత్యేకహోదా మహానాటకం నడుస్తూనే ఉంది. నేతలంతా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ నాటకం తుది మొదలు లేకుండా, పరిష్కారంలేని దిశగా ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది. ఇంత పెద్ద నాటకాన్ని నెలల తరబడి నడిపిస్తూ, బోలెడన్ని అంతర్నాటకాలను జనం దృష్టికి రాకుండా కళ్లు కప్పుతున్నారని కొందరి ఆరోపణ. ‘‘ప్రత్యేక హోదా’’ అంటే కల్పతరువు. స్పెషల్ స్టేటస్ అంటే కామధేనువు. మీరు ఏమి అడిగితే అవి బంగరు పళ్లాలలో వచ్చేస్తాయి - అని కదా అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి అట్టు తిరగబడింది. ప్రత్యేక హోదా ఒక మిథ్య! అందువల్ల రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజ నాలు శూన్యం. అంతకంటే పరమాద్భుతమైన ప్యాకేజీ ఇస్తాం. అందుకని ధన్యులవండని ఇప్పుడంటున్నారు. కల్పతరువు ఏటా మూడు కాపులే కాస్తుంది. మేమిచ్చే ప్యాకేజీ ఆరు కాపులిస్తుంది. అది కామధేనువైతే, ఇది కామధేనువు గ్రాండ్ మదర్! రాష్ట్ర విభజన నాటి నుంచి ఒక మహానాటకం నడుస్తూనే ఉంది. అందులో నేతలంతా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక దృశ్యంలో ఒక నాయ కుడు అలుగుతాడు. ఢిల్లీ వారంతా ముందే చదువుకుని బట్టీ పట్టిన డైలాగుల్ని సానుభూతి రసం ఒలికిస్తూ వల్లిస్తారు. రేపో ఎల్లుండో ఢిల్లీ ఖజానా తాళాలు వెంకయ్యనాయుడుకిచ్చి చంద్రబాబు నాయుడికి పంపించే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగు తాయి. నాలుగో రోజున కేంద్ర ఆర్థికమంత్రి అరిగి పోయిన ప్లేటుని మరోసారి వినిపిస్తారు. ఈ మహానాటకానికి తుది మొదలు లేదు. పరిష్కారంలేని దిశగా ఇది రోజుల తరబడి, ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది. ఈ మహావేదిక మీంచి ఎవరూ నిష్ర్కమించరు. అట్లాగని క్రియాశీలక పాత్ర పోషించరు. ఒకటో అరో అరిగిపోయిన డైలాగ్ వారి అధీనంలో ఉంటుంది. సైడ్ వింగ్లోంచి సైగ అందగానే ఆ సంభాషణని వదిలి హాయిగా గాలి పీల్చుకుంటారు. వీళ్లంతా ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధులు. మీడియాకి నాట కీయ దృశ్యాలు ఎప్పుడూ ఆకర్షణలే. రాజకీయాలను, ప్రభుత్వాలను విస్పష్టంగా నిగ్గదీసే అలవాటుని మీడియా ఈ మధ్యకాలంలో బొత్తిగా విస్మరించిందనే ప్రథ ప్రజల్లో వినిపిస్తోంది. ప్రత్యేక హోదా లాంటి పెద్ద నాటకాన్ని నెలల తరబడి నడిపిస్తూ, బోలెడన్ని అంత ర్నాటకాలను జనం దృష్టికి రాకుండా కళ్లు కప్పు తున్నారని కొందరి ఆరోపణ. ఒకవైపు కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పూర్తి చేశారు. మరోవైపు కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంకోవైపు విశ్వ విఖ్యాత మహానగరం అంచెలంచెలుగా రూపుదిద్దుకుంటోంది. నిన్నగాక మొన్న రెండు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్న సమయంలో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మందీ మార్బ లంతో క్షేత్రాలను స్వయంగా చేరి లక్షలాది ఎకరాల్లో పంటలకు కొత్త చిగుళ్లు తొడిగారు. ఇదొక వినూత్న చరిత్రగా స్వయంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కాకపోతే, మా నేతకైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
బహిష్కరణపై భగ్గు
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆరెగూడెం బాధిత రజకులు అండగా నిలిచిన ప్రజా సంఘాల నాయకులు నేలకొండపల్లి: మండలంలోని ఆరెగూడెంలో రజక కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేయాలని గ్రామపెద్దలు కొందరు టముకు వేయించడం, పనులకు పిలవకుండా దూరంగా ఉంచడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నెల 27వ తేదీన గ్రామస్తులు సమావేశమై 28వ తేదీ జరుపుకునే ముత్యాలమ్మ పండుగ వేడుకలో సల్లకుండ పట్టుకొని రజకులు ఇంటింటికీ తిరగాలని గ్రామపెద్దలు ఆదేశించగా..ఉన్న పది కుటుంబాల్లో వృద్ధులు తిరగలేరని, చదువుకున్న యువకులు ఆ పని చేసేందుకు నిరాకరిస్తున్నారని సదరు రజకులు చెప్పడంతో..కొందరు గ్రామ పెద్దలు ఆగ్రహించారు. రజకులందరినీ సాంఘిక బహిష్కరణ చేస్తున్నామని, వీరితో పని చేయించుకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని 27వ తేదీన టముకు వేయించడంపై సోమవారం మీడియాలో కథనాలు రావడంతో..ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో కూడా ఇలా అవమానించడం, ఆత్మగౌరవం దెబ్బతీయడం తగదని, సదరు గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పండగపూట ఊరి రజకులంతా..ఏడుస్తూ, బహిష్కరణ అవమానంతో బాధ పడుతూ గడిపారని..ఈ దుశ్చర్య బాధాకరమని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. ఫిర్యాదు..విచారణ ఆరెగూడెంలో పది కుటుంబాల రజకులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..పలు సంఘాల నాయకులు నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై పి.దేవేందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావుకు విన్నవించారు. ఎస్సై గ్రామంలో విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు బాసట పలు ప్రజాసంఘాల నాయకులు సోమవారం ఆరెగూడెం గ్రామాన్ని సందర్శించి బాధిత రజకులను కలిసి మాట్లాడారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, గౌరవ అధ్యక్షుడు తమ్మారపు బ్రహ్మాయ్య, బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీలక్ష్మి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నందిపాటి మనోహార్, ఎమ్మార్పీఎస్ నేత వంగూరి ఆనందరావు, పీవైఎల్ రాష్ట్ర నాయకులు సీౖÐð .పుల్లయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకన్న, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు భద్రునాయక్, ఇప్టూ నేత పగిడికత్తుల రామదాసు తదితరులు బాధితులను కలిసిన వారిలో ఉన్నారు. చర్యలు తీసుకోవాల్సిందే.. రజకులను బహిష్కరించడం బాధాకరం. ఆరెగూడెం సంఘటనలు పునరావృతం కావొద్దంటే బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. –పాగర్తి సుధాకర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు. పనికి రావొద్దంటున్నారు.. ఊరిలో గతంలో మాదిరి బట్టలు ఉతికేందుకు వెళితే గ్రామ పెద్దలు రావద్దంటున్నారు. టముకు వేయించి..అవమానించిండ్రు. బాధగా ఉంది. –ఎలిమినేటి వీరమ్మ.ఆరెగూడెం. అవమానంపై ఆగ్రహం.. సత్తుపల్లి రూరల్: ఆరెగూడెంలో పది రజక కుటుంబాలను గ్రామ పెద్దలు సాంఘిక బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో రజకసంఘం నాయకులు మోటార్‌సైకిల్ ర్యాలీ తీసి, రింగ్సెంటర్లో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి..నినాదాలు చేశారు. సీఐ పి.రాజేంద్రప్రసాద్‌కు, తహసీల్దార్ దొడ్డా పుల్లయ్యకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి తెలగారపు అప్పారావు కోరారు. కార్యక్రమాలలో చింతల సత్యనారాయణ, ఈలప్రోలు రామ్మూర్తి, కోటా సత్యనారాయణ, టోపీ శ్రీను, బి.శ్రీనివాసరావు, మరికంటి సత్యనారాయణ, రాయల కోటేశ్వరరావు, కానూరి శ్రీనివాసరావు, పగిళ్ల చెన్నయ్య పాల్గొన్నారు. -
భవనంపైకెక్కి..నినాదాలు చేసి
పాల్వంచలో రెండో ఏఎన్ఎంల నిరసన పాల్వంచ రూరల్: వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రెండో ఏఎన్ఎంలు సోమవారం పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. 43 రోజులుగా విధులు బహిష్కరించి పోరాడుతున్నా..ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ గన్యా వారితో మాట్లాడి కిందికి రప్పించారు. ఈ సందర్భంగా రెండో ఏఎన్ఎంలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాజు, సెకండ్ ఏఎన్ఎంలు ప్రియాంక, బి.జ్యోతి, ఇందిర, పద్మ, అనిత, సుజాత, నీల, సుధ, శ్యామల, స్వాతి పాల్గొన్నారు. -
‘పోడు’పై పోరాటం
ఖమ్మం సిటీ: ఆదివాసీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు కుట్ర సాగిస్తున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. జిల్లాలోని అదివాసీల అణచివేతకు వ్యతిరేకంగా, పోడు రైతులకు అటవీ హక్కు పత్రాలు.. బ్యాంక్ రుణాలు ఇవ్వాలన్న డిమాండ్లతో సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, అనంతరం ధర్నాచౌక్‌లో ధర్నా జరిగాయి. ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా బృందాకారత్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల నుంచి గిరిజన బిడ్డలను వెళ్లగొట్టే లక్ష్యంతో వారిపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని విమర్శించారు. ‘‘అటవీకరణ, అడవుల పరిరక్షణ పేరుతో మోడీ; హరితహారం పేరుతో కేసీఆర్.. గిరిజనులను అడవుల నుంచి దూరంగా తరిమేసేందుకు కుట్రలు సాగిస్తున్నారు’’ అని మండిపడ్డారు. ప్రధాని మోడీకి మిత్రునిగా, అడవి బిడ్డలకు శత్రువుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘జాతి ద్రోహులు, ఘరానా దొంగలు, పెద్ద పెద్ద నేరగాళ్లపై పెట్టాల్సిన తీవ్రమైన కేసులను.. తెలంగాణలో అమాయక గిరిజనులపై పెడుతున్నారు, జైలుకు పంపుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపనకుగాను కార్పొరేట్ కంపెనీలకు పాలకులు అనుమతిస్తున్నారు, అడవిపై హక్కులు కల్పిస్తున్నారు. కానీ, ఆ ప్రాంతంలోని గిరిజనులు పొట్ట పోసుకునేందుకు అక్కడి అటవీ భూమిని సాగు చేసుకోవడాన్ని మాత్రం సహించడం లేదు’’ అని విమర్శించారు. అటవీ హక్కుల కోసం గిరిజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాలు, బ్యాంకు రుణాలు ఇచ్చేంత వరకు సీపీఎం పోరాడుతోందన్నారు. పోడు భూములను దున్నాయంటూ మూగ జీవాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించడం ద్వారా సరికొత్త జాతీయ రికార్డును తెలంగాణ సీఎం సృష్టించారని బృందాకారత్ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులకు సీపీఎం వ్యతిరేకం కాదు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి సీపీఎం వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలి. పరిశ్రమలు స్థాపించాలి. దానికి భూములు తీసుకోవాలి. తీసుకున్న భూములకుగాను తగిన నష్ట పరిహారం ఇవ్వాలి. మల్లన్న సాగర్, సింగరేణి ఓసీ నిర్వాసితులందరికీ 2013 చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి’’ అని అన్నారు. రాష్ట్రంలోని చట్టాలను తన చుట్టాలుగా మార్చుకునేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘ఓట్లు, సీట్లు ఎన్ని వచ్చాయన్నది ముఖ్యం కాదు. మీకు ఎన్నొచ్చినా ఉపయోగం లేదు. టీఆర్ఎస్లో చాలా వర్గాలు– కాంగ్రెస్ టీఆర్ఎస్, టీడీపీ టీఆర్ఎస్, ఎర్ర టీఆర్ఎస్, అసలు టీఆర్ఎస్ ఉన్నాయి. భవిష్యత్తులో వీరంతా తన్నుకోవటం ఖాయం’’ అన్నారు. ప్రజావ్యతిరేక టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఎర్ర జెండాలన్నీ ఏకం కావాలన్నారు. ధర్నాలో జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘తూర్పు’లో దళితులపై దాడి
-
దళితులపై దాడితో కలకలం
నిరసించిన దళిత సంఘాలు, నేతలు ∙ ఆవుల వధ అనుమానంతో అనాలోచిత దాడి ∙ అమలాపురంలో ధర్నాలు, రాస్తారోకోలు తమ ఆవులను అపహరించి, గోవధకు పాల్పడుతున్నారన్న అనుమానం వారితో ఓ అమానుషానికి పురిగొల్పింది. తమ చర్మకార వృత్తిలో భాగంగా చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న ఇద్దరి దళిత సోదరులకు గోవుల అపహరణ, వధ అంటగట్టి, అకారణంగా దాడి చేసిన ఘటన జిల్లావ్యాప్తంగా మంగళవారం కలకలం రేకేత్తించింది. జిల్లాలో దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దళిత నేతలు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించడమే కాకుండా, నిరసనలు కూడా తెలిపారు. – అమలాపురం టౌన్/ అమలాపురం రూరల్ అమలాపురం మండలం కామనగరువులో ముగ్గురు రైతులకు చెందిన మూడు ఆవులు కనిపించకుండా పోవటం, వాటిని అమలాపురం పట్టణానికి చెందిన చర్మకారులు మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు(లాజర్)లే అపహరించి, మాంసం కోసం గో వధకు పాల్పడుతున్నారని నిర్ధారణకు వచ్చారు. అసలు ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోకుండా చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న వారిపై దాడికి దిగటంతో దాడి చేసిన వారు నిందితులయ్యారు. కామనగరువుకు చెందిన ఉర్రింక నారాయణరావు, కామన దుర్గారావు, రాజులపూడి నరేష్, వాకా ప్రసాద్, వాకా గోపి, రాజులపూడి గంగాధరరావు, అతని కుమారుడితో పాటు మరి కొంతమంది కలిసి దళిత సోదరులపై దాడి చేసిశారంటూ వారిపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల రంగప్రవేశం ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం శ్మశానంలో చనిపోయిన ఆవును చర్మాన్ని వలుస్తున్న దళితులపై దాడి చేసి గాయపరచగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. అల్లవరం ఎస్సై డి.ప్రశాంత కుమార్ శ్మశానానికి చేరుకుని, రక్తపు గాయాలతో ఉన్న ఎలీషా, లాజర్, వ్యాన్ డ్రైవర్ సరవపు లక్ష్మణకుమార్‌ను తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోనసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గంపల దుర్గాప్రసాద్, ఇతర దండోరా నాయకులు సోమవారం అర్ధరాత్రి అమలాపురం ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఆందోళన చేశారు. ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న నిరసనలో ఉన్న ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా మంగళవారం ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడి, ఈ ఘటనపై నిరసన తెలిపారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, సీపీఐ నాయకుడు కె.సత్తిబాబు, సీపీఎం నాయకుడు ఎం.రాజశేఖర్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి గెడ్డం సంపదరావు, జిల్లా మానవ హక్కుల వేదిక ప్రతినిధి రవి తదితర దళిత నేతలు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, ఈ ఘటనపై నిరసన తెలిపారు. అమలాపురం గడియారం స్తంభం వద్ద కేవీపీఎస్ నేతలు ధర్నా చేశారు. 24 గంటల్లో అరెస్టు చేస్తాం : ఎస్పీ కాకినాడ సిటీ: అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో చర్మకారులపై దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. మంగళవారం రాత్రి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సంఘటనకు సంబంధించి కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దీంతో పార్టీలకు, గోసంరక్షణ, ఆర్ఎస్ఎస్ వంటి సంఘాలకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. కేవలం ఉప్పలగుప్తం మండలం సూదాపాలేనికి చెందిన యువత వారి గ్రామానికి చెందిన ఆవును దొంగిలించి, చర్మం వలుస్తున్నారని ఉద్రిక్తతకు లోనై, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. సమాచారం అందిన తక్షణమే పటిష్ట చర్యలు తీసుకుని, పోలీసు పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ దాడిలో ఏడుగురు ఉన్నట్టు పేర్లు వచ్చాయని, వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో సెక్షన్–30 అమలు జిల్లావ్యాప్తంగా సెక్ష–30 అమలులో ఉన్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ఈ నెల 31 వరకు జిల్లాలోని కాకినాడ, రామచంద్రపురం అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్లలో అమలవుతుందని పేర్కొన్నారు. -
6న జయశంకర్ స్మారకోపన్యాసం
కేయూ క్యాంపస్ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ నాలుగో స్మారకోపన్యాసం ఈనెల 6న కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనంలోని సెనేట్హాల్లో నిర్వహించనున్నట్లు ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీకేఎం కళాశాల మాజీ ప్రిన్సిపా ల్ వి.వరవరరావు తెలంగాణ భాష సంస్కృతి, సాహిత్యం అంశంపై ప్రసంగిస్తారన్నారు. కేయూ వీసీ, ప్రొఫెసర్ ఆర్.సాయన్న ఉపన్యాసానికి అధ్యక్షత వహిస్తారని ఆయన పేర్కొన్నారు. -
‘సాదాబైనామా’పై విస్త్రృత ప్రచారం కల్పించాలి
– లబ్ధిదారులకు సమస్య తలెత్తకుండా చూడాలి –వీడియో కాన్ఫరెన్స్‌లో రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు నల్లగొండ : సాధా బైనామాలకు సంబంధించి విస్త్రృత ప్రచారం కల్పించాలని భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ రేమండ్ పీటర్ సూచించారు. బుధవారం హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్ఓఆర్ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి తద్వారా లబ్ధిదారలుకు సమస్యలు రాకుండా చూడాలని కోరారు. వివిధ జిల్లాలో పెండింగులో వున్న దరఖాస్తులను పరిశీలించి నివేదికలు పంపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు వున్నట్లయితే తన దృష్టికి తేవాలన్నారు. హరితహారం బాధ్యతల కారణంగా రెవెన్యూ విధులను మరిచిపోకూడదని గుర్తు చేశారు. గ్రామాల వారీగా సాదా బైనామాకు సంబంధించిన రిపోర్టులను పంపాలని, సరిగా పని చేయని తహసీల్దార్లకు చార్జి మెమోలు జారీ చేయాలని సూచించారు. రెవెన్యూ అంశాలు, సాధాబైనామాలు, అసైన్డ్ భూముల పరిశీలన, మ్యూటేషన్ల పెండింగ్, ఎల్ఈసీ దరఖాస్తులు, ఆడిట్ పేరాలు, జిల్లాల రీఆర్గనైజేషన్ మొదలగు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇన్చార్జి కలెక్టర్ ఎన్.సత్యనారాయణ మాట్లాడుతు జిల్లాలో ఇప్పటి వరకు 1 లక్షా 31వేల సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు చెప్పారు. ఇంకా 14వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. మరో రెండు రోజల్లో వీటì ని కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. కొన్ని మండలాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నందువల్ల అనుకున్న లక్ష్యానికి చేరుకోలేదు. వీడియో కాన్ఫరెన్సులో డీఆర్వో రవి, ఆర్డీఓలు, ఎన్ఐసీ అధికారి గణపతిరావు, సంబంధిత అధికారులు తదితరులున్నారు. -
వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు
కొత్తగూడెం క్రైం: వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై వన్‌టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మండలంలోని సర్వారం పంచాయతీ గుడితండాకు చెందిన ఓ వివాహితను అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. శుక్రవారం భర్తతో కలిసి ఉండగా కార్తీక్ దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి ఆమె భర్తను నెట్టివేశాడు. ఆందోళనకు గురైన వివాహిత వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై చంద్రమౌళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.