తహసీల్దార్ కార్యాలయంపైకి ఎక్కిన సెకండ్ ఏఎన్‌ఎంలు
- పాల్వంచలో రెండో ఏఎన్‌ఎంల నిరసన
పాల్వంచ రూరల్: వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రెండో ఏఎన్‌ఎంలు సోమవారం పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. 43 రోజులుగా విధులు బహిష్కరించి పోరాడుతున్నా..ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ గన్యా వారితో మాట్లాడి కిందికి రప్పించారు. ఈ సందర్భంగా రెండో ఏఎన్‌ఎంలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాజు, సెకండ్ ఏఎన్‌ఎంలు ప్రియాంక, బి.జ్యోతి, ఇందిర, పద్మ, అనిత, సుజాత, నీల, సుధ, శ్యామల, స్వాతి పాల్గొన్నారు.