వాహనాన్ని స్టార్ట్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కీ కంపల్సరీ. అది లేకుండా బండి ముందుకు నడవదు. అయితే గత కొంత కాలంగా కీ లేకుండా బండ్లు స్టార్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అవన్నీ రెంటల్ బైక్ సర్వీసెస్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్ బైకులకు సైతం ఈ ఫీచర్‌ని అందుబాటులోకి వచ్చింది.
ఓలా రాకతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో పరిస్థితులు మారిపోయాయి. ఈ సెగ్మెంట్‌లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు అందించేందుకు కంపెనీలో పోటీ పడుతునఆనయి. తాజాగా తమ బైకులకు సంబంధించి కీలకమైన మార్పును రివోల్ట్ తీసుకొచ్చింది. కీతో సంబంధం లేకుండానే బండి ఆన్ ఆఫ్ చేసే విధంగా సరికొత్త టెక్నాలజీని రివోల్ట్ అందిస్తోంది.
రివోల్ట్ 400 బైకులు స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో రివోల్ట్ యాప్ ద్వారా కీతో సంబంధం లేకుండానే బైను ఆన్, ఆఫ్ చేయవచ్చు. పార్కింగ్ ఏరియాలో బండి ఎక్కడ ఉందో కూడా కనుక్కోవచ్చు. 2021 సెప్టెంబరు నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉండే బైకులకు ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు.
కొత్తవాటితో పాటు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న బైకులకు సైతం ఈ ఫీచర్‌ని ఉచితంగానే అందిస్తామని రివోల్ట్ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. రివోల్ట్ షోరూమ్‌కి వెళ్లి కీ లేకుండా బైకులను ఆపరేట్ చేసే ఫీచర్‌ను పొందవచ్చన్నారు. అయితే కీ లెస్ ఫీచర్‌ని కేవలం రివోల్ట్ ఆర్‌వీ 400 మోడల్స్‌కే పరిమితం చేశారు. ఆర్‌వీ 300 మోడల్ బైకులకు ఈ ఫీచర్‌ని అందివ్వడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రివోల్ట్ ఆర్‌వీ 400 మోడల్ స్టాండర్డ్ ధర ఆన్ రోడ్ రూ.1,06,999గా ఉంది. కొత్త మోడల్ వివరాలపై స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment