Revolt Motors
-
ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ-కామర్స్ సైట్లో భారీ డిస్కౌంట్!
REVOLT RV400 electric bike sale on Amazon: కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీ కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ రెవోల్ట్ మోటర్స్ అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా రెవోల్ట్ ఆర్వీ 400 బైక్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ బైక్ వాస్తవ ధర రూ.1.54 లక్షలు. అయితే ఈ ఈ-కామర్స్ సైట్లో నేరుగా రూ. 15 వేల డిస్కౌంట్‌తో రూ.1.39 లక్షలకు లిస్ట్ చేసింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎస్బీఐ కార్డు ద్వారా వచ్చే తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కలుపుకొంటే మొత్తంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐలో ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే ఏకంగా రూ. 10,500 వరకు వడ్డీ డిస్కౌంట్ పొందొచ్చు. మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, ఏడాది వరకు టెన్యూర్‌తో నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుంది. రెవోల్ట్ 400 ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 4.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. -
అక్కడి కొనుగోలుదారులకు పండగే.. రివోల్ట్ కొత్త డీలర్షిప్స్ షురూ!
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని 'రివోల్ట్ మోటార్స్' భారతీయ మార్కెట్లో మరో మూడు డీలర్‌షిప్‌లను విస్తరించింది. కంపెనీ ఇప్పుడు ఈ రిటైల్ స్టోర్లను ఇండోర్, గౌహతి, హుబ్లీ ప్రాంతాల్లో ప్రారభించింది. రివోల్ట్ మోటార్స్ ప్రారంభించిన ఈ మూడు కొత్త డీలర్‌షిప్‌లతో కలిపి కంపెనీ డీలర్‌షిప్‌ల సంఖ్య 35కి చేరింది. రానున్న రోజుల్లో మరిన్ని డీలర్‌షిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. రట్టన్ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇటీవలే రివోల్ట్ మోటార్స్‌లో 100 శాతం వాటాను పొందింది. భారతదేశంలో 70కి పైగా కొత్త స్టోర్లను ప్రారంభించాలానే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. రివోల్ట్ మోటార్స్ ఇటీవల తన ఫ్లాగ్షిప్ మోడల్ RV400 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు రూ. 2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీలను 2023 మార్చి 31 నాటికి పొందవచ్చు. ఇప్పటికే ఈ బైక్ విరివిగా దేశీయ మార్కెట్లో అమ్ముడవుతోంది. రివోల్ట్ ఆర్వి400 దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఒక ఛార్జ్‌తో 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. రివోల్ట్ ఆర్వి400 గంటకు ఎకో మోడ్‌లో 45 కిమీ, నార్మల్ మోడ్‌లో 65 కి.మీ, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిమీ వేగవంతం అవుతుంది. ఈ బైక్ కేవలం మూడు గంటల్లో 75 శాతం, 4.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. కంపెనీ ఈ బైక్ బ్యాటరీపై 6 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ అందిస్తుంది. -
Revolt RV400: దేశంలోనే తొలి ఏఐ ఎనేబుల్డ్ ఇ-బైక్ బుకింగ్స్ మళ్లీ!
సాక్షి,ముంబై: రరట్టన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గ్రూపు యాజమాన్యంలోని kరివోల్ట్ మోటార్స్ తన బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 బైక్ బుకింగ్‌లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దేశీయ తొలి ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్‌ను స్వాపింగ్ బ్యాటరీ ప్యాక్‌తో తీసుకొచ్చింది. ఇది 125 సీసీ పెట్రోల్ ఇంజీన్ బైక్‌కు సమానమైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఏఐ ఎనేబుల్డ్ రివోల్ట్ ఆర్వీ 400 బైక్ బుకింగ్‌లు ఫిబ్రవరి 22న తిరిగి ప్రారంభిస్తున్నామనీ కేవలం రూ. 2,499 ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. డెలివరీలు మార్చి 31, 2023 నాటికి ప్రారంభ మయ్యే అవకాశం ఉంది. ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్ 72V 3.24kWh లిథియం-అయాన్ బ్యాటరీ 4.5 గంటలలోపు ఛార్జ్ అవుతుంది బ్యాటరీ 3kW మోటార్‌తో అనుసంధానం ఈ బ్యాటరీ 54Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రివోల్ట్ ఆర్వీ 400 బైక్ ఫీచర్ల పరంగా, ఫుల్-LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 4G కనెక్టివిటీతో వస్తుంది. ట్రావెల్ హిస్టరీ, బ్యాటరీ ఆరోగ్యం, పరిధి సమీప స్వాప్ స్టేషన్ వంటి వివరాలకు వోల్ట్ యాప్‌ను బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌కు జత చేయవచ్చు. ఇ-బైక్ కీలెస్ ఇగ్నిషన్‌ను కూడా కలిగి ఉంది. 'ఇంజిన్ నోట్' మరో స్పెషల్ ఫీచర్. ఇది బైక్‌లోని అంతర్నిర్మిత స్పీకర్ల ద్వారా కృత్రిమ ఇంజిన్ సౌండ్‌ను కంట్రోల్ చేస్తుంది. స్క్రూ-టైప్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో రియర్ ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్,మోనో-షాక్‌ను కలిగి ఉంటాయి. ఇటీవల రట్టన్ ఇండియా కొనుగోలు చేసిన రివోల్ట్ మోటార్స్ తన సప్లయ్ చెయిన్‌లో భారీ పెట్టుబడులు పెట్టింది. అలాగే హర్యానాలోని మనేసర్‌లోని వరల్డ్ క్లాస్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది. -
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్త..!
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుదారులకు ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్‌ల కంపెనీ రివోల్ట్ మోటార్స్ గుడ్‌న్యూస్‌ను అందించింది. రివోల్ట్ ఆర్వీ 400 బైక్ బుకింగ్స్ నేటి(అక్టోబర్ 21) నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాదిలో ఆర్వీ400 బైక్ బుకింగ్స్ ఓపెన్ చేయడం ఇది మూడోసారి. దేశ వ్యాప్తంగా నేటి నుంచి 70 నగరాల్లో బుకింగ్ అందుబాటులో ఉండనుంది. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన డీఏ ఆర్వీ400 బైక్‌లో తొలి సారిగా న్యూ ఎక్స్‌టిరియర్ కలర్ థీమ్‌ను రివోల్ట్ మోటార్స్ పరిచయం చేసింది. ఫేమ్ -2 పథకంలో భాగంగా ఆర్వీ400 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.07 లక్షలుగా ఉండనుంది. ఆర్వీ400 కాస్మిక్ బ్లాక్, రెబుల్ రేడ్ కలర్ వేరియంట్‌తో పాటు మిస్ట్ గ్రే కలర్లో కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. భారీ ప్రణాళికలతో..! దేశవ్యాప్తంగా రివోల్ట్ మోటార్స్ విస్తరించేందుకు భారీ ప్రణాళికలను చేస్తోంది. కంపెనీ 100 శాతం స్థానికీకరణపై దృష్టిపెడుతుందని కంపెనీ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ పేర్కొన్నారు. టైర్-1 సిటీల్లోనే కాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా ఆర్వీ 400 బైక్ బుకింగ్‌ను అందుబాటులో ఉందన్నారు. వచ్చే ఏడాదికి భారీ ఎత్తున బైక్‌లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీల ప్రణాళికలను రచిస్తోందని తెలిపారు. హర్యానాలోని మానేసర్ ప్లాట్‌లో బైక్‌లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్ ప్రస్తుతం ప్రతి ఏడాది లక్షకుపైగా యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్(జూబ్లీ హిల్స్), వరంగల్, విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలలో బుకింగ్స్ అందుబాటులో ఉండనుంది. రివోల్ట్ ఆర్వీ400 ఫీచర్స్ 72వీ 3.24 కిలోవాట్స్ లిథియన్ ఇయాన్ బ్యాటరీతో గల 3కిలోవాట్ మోటార్‌తో ఆర్వీ 400 బైక్ నడుస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇకో, నార్మల్, స్పోర్ట్స్ లాంటి మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వరకు వెళ్లనుంది. అంతేగాక, ఇది మైరివోల్ట్ అనే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తో వస్తుంది. చదవండి: క్రికెట్ లవర్స్‌కు ట్విటర్ గుడ్‌న్యూస్..! భారత్‌లో తొలిసారిగా..! -
బైక్ కొనేవారికి రివోల్ట్ మోటార్స్ శుభవార్త!
ఒక పక్క రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుంటే.. మరోపక్క ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెరిగిపోతుంది. ఒకప్పుడు ఏడాదికి ఒకటో, రెండో ఎలక్ట్రిక్ బైక్ ప్రోడక్ట్స్ బయటికి వస్తే.. ఇప్పుడు నెలకు ఒక కొత్త బైక్/స్కూటర్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ఇప్పటికే తమ బైక్/స్కూటర్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కంపెనీలు ఇప్పుడు సంస్థను విస్తరించే పనిలో పడ్డాయి. కంపెనీ విస్తరించే పనిలో భాగంగా రివోల్ట్ మోటార్స్ కొత్తగా మరో 64 నగరాల్లో షోరూమ్ ఓపెన్ చేస్తుంది. ప్రస్తుతం దేశంలో 6 నగరాల్లో మాత్రమే షోరూమ్ అందుబాటులో ఉంది.(చదవండి: పండగనాడు వదల్లేదు.. మళ్లీ బాదేశారు) 70 నగరాల్లో.. రివోల్ట్ మోటార్స్ ఆ సంఖ్యను 2022 ప్రారంభంనాటికి 70కి విస్తరించాలని యోచిస్తోంది. అలాగే, ఈవీ మేకర్ అక్టోబర్ 21, మధ్యాహ్నం 12న తన ఫ్లాగ్ షిప్ బ్యాటరీతో నడిచే మోటార్ సైకిల్ రివోల్ట్ ఆర్వీ400 బుకింగ్స్ తిరిగి ఓపెన్ చేసింది. ఇక నుంచి దేశంలోని ఈ 70 నగరాల్లోని ప్రజలు రివోల్ట్ ఆర్వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ బైక్ ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి ఎంపిక చేసిన భారతీయ నగరాల్లో మాత్రమే కొనుగోలుకు అవకాశం ఉంది. అదే సమయంలో బెంగళూరు, కోల్ కతా, జైపూర్, సూరత్, చండీగఢ్, లక్నో, ఢిల్లీతో సహ మరిన్ని ఇతర ప్రధాన భారతీయ నగరాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో హైదరాబాద్(జూబ్లీ హిల్స్), వరంగల్ నగరాల్లో.. ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలలో అందుబాటులోకి రానుంది. 72వీ 3.24 కిలోవాట్స్ లిథియన్ ఇయాన్ బ్యాటరీతో గల 3కిలోవాట్ మోటార్‌తో ఆర్వీ 400 బైక్ నడుస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇకో, నార్మల్, స్పోర్ట్స్ లాంటి మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వరకు వెళ్లనుంది. అంతేగాక, ఇది మైరివోల్ట్ అనే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తో వస్తుంది.(చదవండి: జియో ఫోన్‌పై మరో రూమర్, అదే నిజమైతే..!) -
Revolt RV400: కీ అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్‌తోనే బండి స్టార్ట్
వాహనాన్ని స్టార్ట్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కీ కంపల్సరీ. అది లేకుండా బండి ముందుకు నడవదు. అయితే గత కొంత కాలంగా కీ లేకుండా బండ్లు స్టార్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అవన్నీ రెంటల్ బైక్ సర్వీసెస్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్ బైకులకు సైతం ఈ ఫీచర్‌ని అందుబాటులోకి వచ్చింది. ఓలా రాకతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో పరిస్థితులు మారిపోయాయి. ఈ సెగ్మెంట్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు అందించేందుకు కంపెనీలో పోటీ పడుతునఆనయి. తాజాగా తమ బైకులకు సంబంధించి కీలకమైన మార్పును రివోల్ట్ తీసుకొచ్చింది. కీతో సంబంధం లేకుండానే బండి ఆన్ ఆఫ్ చేసే విధంగా సరికొత్త టెక్నాలజీని రివోల్ట్ అందిస్తోంది. రివోల్ట్ 400 బైకులు స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో రివోల్ట్ యాప్ ద్వారా కీతో సంబంధం లేకుండానే బైను ఆన్, ఆఫ్ చేయవచ్చు. పార్కింగ్ ఏరియాలో బండి ఎక్కడ ఉందో కూడా కనుక్కోవచ్చు. 2021 సెప్టెంబరు నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండే బైకులకు ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. కొత్తవాటితో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న బైకులకు సైతం ఈ ఫీచర్‌ని ఉచితంగానే అందిస్తామని రివోల్ట్ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. రివోల్ట్ షోరూమ్‌కి వెళ్లి కీ లేకుండా బైకులను ఆపరేట్ చేసే ఫీచర్‌ను పొందవచ్చన్నారు. అయితే కీ లెస్ ఫీచర్‌ని కేవలం రివోల్ట్ ఆర్వీ 400 మోడల్స్‌కే పరిమితం చేశారు. ఆర్వీ 300 మోడల్ బైకులకు ఈ ఫీచర్‌ని అందివ్వడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రివోల్ట్ ఆర్వీ 400 మోడల్ స్టాండర్డ్ ధర ఆన్ రోడ్ రూ.1,06,999గా ఉంది. కొత్త మోడల్ వివరాలపై స్పష్టత లేదు. -
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు రివోల్ట్ గుడ్‌న్యూస్...!
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీదారు రివోల్ట్ ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. తక్కువ ధరలో ఆర్వీ1 అనే కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా ఈ బైక్ ధర ప్రస్తుతం ఉన్న ఆర్వీ300 కన్నా తక్కువ ధరలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి ఆర్వీ1 ఉత్పత్తిలోకి వస్తుందని రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్(ఆర్ఈఎల్) ప్రమోటర్ అంజలి రట్టన్ ఒక ప్రకటనలో తెలిపారు. గుర్గావ్కు చెందిన రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం ఆర్వీ400, ఆర్వీ300 అనే రెండు ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్లో లభిస్తున్నాయి. రివోల్ట్ మోటార్లో సుమారు 43 శాతం వాటాను 150 కోట్ల రూపాయలతో రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేసింది. వచ్చే ఐదేళ్లలో సంవత్సరానికి ఐదు లక్షల బైక్‌లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్-2 తాజా సవరణల్లో భాగంగా రివోల్ట్ బైక్ ధరలు గణనీయంగా తగ్గాయి. రివోల్ట్ ఆర్వీ 400 ప్రస్తుతం ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ. 90, 799గా ఉంది, అయితే రివోల్ట్ నుంచి వచ్చే కొత్త ఆర్వీ1 మోడల్ ధర రూ. 75 వేల నుంచి రూ. 80 వేల మధ్య ఉండొచ్చునని తెలుస్తోంది. తాజాగా రివోల్ట్ కంపెనీ డోమినోస్ పిజ్జాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొద్ది రోజుల క్రితం రివోల్ట్ ఉంచిన ప్రీ బుకింగ్స్‌లో దూసుకుపోయిన విషయం తెలిసిందే. -
డొమినోస్ పిజ్జాతో రివోల్ట్ మోటార్స్ ఒప్పందం
డొమినోస్ పిజ్జా తన ప్రస్తుత పెట్రోల్ బైక్ ఫ్లీట్ ను ఈ-బైక్ లుగా మార్చడానికి ఎలక్ట్రిక్ వాహన తయారీదారు రివోల్ట్ మోటార్స్ తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, డొమినోస్ రివోల్ట్ ఆర్ వీ 300 బైక్ మోడల్ ను ఫుడ్ డెలివరీ చేయడం కోసం మారుస్తున్నట్లు తెలిపింది. డొమినోస్ పైలట్ ప్రాజెక్టు కింద రివోల్ట్ బైక్లును గత కొంతకాలంగా ఫుడ్ డెలివరీల కోసం వాడుతున్నారు. రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ బిజినెస్ ఛైర్మన్ అంజలి రట్టన్ మాట్లాడుతూ.. "ఈ భాగస్వామ్యంలో భాగంగా డొమినోస్ సంస్థతో చేతులు కలపడం సంతోషంగా ఉంది, ఇది పర్యావరణపరంగా మంచి నిర్ణయమే కాకుండా, సంస్థకు భారీగా ఖర్చు తగ్గిస్తుంది" అని పేర్కొన్నారు. ఈ బైక్ లు వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా వాతావరణానికి హాని కలిగించవని రివోల్ట్ మోటార్స్ తెలిపింది. రాబోయే సంవత్సరాల్లో డెలివరీ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ బైక్ వినియోగించడానికి ఈ భాగస్వామ్యం ఒక ప్రారంభమని రివోల్ట్ విశ్వసిస్తుందని కంపెనీ తెలిపింది. తక్కువ ఉత్పత్తి ఖర్చులు, కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ప్రోత్సాహకాల కారణంగా ఎలక్ట్రిక్ బైక్‌ల ధరలు భారీగా తగ్గిపోతుండటం ఈ బైక్ లు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి అని కంపెనీ తెలిపింది. -
ఈ బైక్ చాలా హాట్ గురూ! క్షణాల్లో సోల్డ్ అవుట్!
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారి కంపెనీ రివోల్ట్ మోటార్స్ ఇటీవల ఆవిష్కరించిన ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్స్ అమ్మకాల్లో దూసుకుపోయింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన రెండోసారి కూడా క్షణాల్లో రికార్డు అమ్మకాలను సాధించిందని కంపెనీ ప్రకటించింది. తొలి బుకింగ్స్‌లోనే రికార్డు అమ్మకాలను సాధించిన ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 బుకింగ్‌లను తిరిగి ప్రారంభించిన నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచిందని కంపెనీ వెల్లడించింది. తమ బైక్స్ వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం నాలుగు నెలలు అని, అయితే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, తద్వారా వెయిటింగ్ టైంను తగ్గించడానికి కంపెనీ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై,అహ్మదాబాద్,హైదరాబాద్నగరాల్లో కంపెనీ బుకింగ్ ప్రారంభించింది. అయితే గత నెలలో బుకింగ్స్ ఆరంభించిన రెండు గంటల్లోనే రూ. 50 కోట్ల విలువైన రివోల్ట్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్స్ విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. ఇటీవల రివోల్ట్ ఆర్వీ 300, ఆర్వీ 400 పేరుతో రెండు ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. రివోల్ట్ ఆర్వీ 400 3కిలోవాట్స్ (మిడ్ డ్రైవ్) మోటారుతో లభ్యం. ఇది 72వీ, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ బైక్స్‌కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ మై రివోల్ట్ యాప్ ద్వారా సాంకేతిక సమస్యలను తెలుసుకోవచ్చు. అంతేకాదు బ్యాటరీ స్టేటస్, రైడ్స్ డేటా, ఎన్ని కిలోమీటర్లు పూర్తయ్యాయి లాంటి వివరాలను కూడా అందిస్తుంది. దీంతోపాటు రీచార్జ్ నిమిత్తం సమీప రివోల్ట్ స్విచ్ స్టేషన్‌ను కూడా ఈ యాప్‌ద్వారా గుర్తించవచ్చు. -
రివోల్ట్ మోటార్స్ ఆర్ వీ 400 ఎలక్ట్రిక్ బైక్ సేల్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మోటో సైకిల్ తయారీ కంపెనీ రివోల్ట్ మోటార్స్ తన కొత్త బ్యాచ్ ఆర్ వీ400 ఎలక్ట్రిక్ బైకులు వినియోగదారులకు డెలివరీ కోసం అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. హర్యానాలోని మనేసర్ లోని గ్రీన్ ఫీల్డ్ తయారీ కర్మాగారం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ బైక్ లను పంపిస్తున్నట్లు రివోల్ట్ మోటార్స్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గత కొద్ది రోజుల క్రితం సేల్ కి వచ్చిన కొన్ని గంటల్లోనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అమ్ముడుపోవడంతో బుకింగ్స్ వెంటనే మూసివేసినట్లు కంపెనీ తెలిపింది. ఫ్లాగ్ షిప్ మోడల్ బైక్ ఆర్ వీ400కు కొనుగోలుదారుల నుంచి ఎల్లప్పుడూ "భారీ డిమాండ్" ఉందని తెలిపింది. రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో సేవలు అందిస్తుంది. "బుకింగ్‌లు జరిగిన కొద్ది రోజుల్లోనే కంపెనీ తన కస్టమర్లకు సాధ్యమైనంత త్వరలో ఈ మోటార్ సైకిళ్లను డెలివరీ చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు" రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ బిజినెస్ చైర్మన్ అంజలి రట్టన్ తెలిపారు. ఆర్ వీ400 3.24-కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 72 వోల్ట్ల పవర్ అందిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లు. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఈ బైక్ బ్యాటరీ ప్యాక్ 8 సంవత్సరాలు లేదా 1,50,000 కి.మీ వారెంటీతో వస్తుంది. మూడు సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు ఫ్రీ సర్వీసింగ్ అందిస్తుంది.