ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుదారులకు ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ల కంపెనీ రివోల్ట్ మోటార్స్ గుడ్‌న్యూస్‌ను అందించింది. రివోల్ట్ ఆర్‌వీ 400 బైక్ బుకింగ్స్ నేటి(అక్టోబర్ 21) నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాదిలో ఆర్‌వీ400 బైక్ బుకింగ్స్ ఓపెన్ చేయడం ఇది మూడోసారి. దేశ వ్యాప్తంగా నేటి నుంచి 70 నగరాల్లో బుకింగ్ అందుబాటులో ఉండనుంది.
చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన డీఏ
ఆర్‌వీ400 బైక్‌లో తొలి సారిగా న్యూ ఎక్స్‌టిరియర్ కలర్ థీమ్‌ను రివోల్ట్ మోటార్స్ పరిచయం చేసింది. ఫేమ్ -2 పథకంలో భాగంగా ఆర్‌వీ400 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.07 లక్షలుగా ఉండనుంది. ఆర్‌వీ400 కాస్మిక్ బ్లాక్, రెబుల్ రేడ్ కలర్ వేరియంట్‌తో పాటు మిస్ట్ గ్రే కలర్‌లో కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
భారీ ప్రణాళికలతో..!
దేశవ్యాప్తంగా రివోల్ట్ మోటార్స్ విస్తరించేందుకు భారీ ప్రణాళికలను చేస్తోంది. కంపెనీ 100 శాతం స్థానికీకరణపై దృష్టిపెడుతుందని కంపెనీ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ పేర్కొన్నారు. టైర్-1 సిటీల్లోనే కాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా ఆర్‌వీ 400 బైక్ బుకింగ్‌ను అందుబాటులో ఉందన్నారు. వచ్చే ఏడాదికి భారీ ఎత్తున బైక్లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీల ప్రణాళికలను రచిస్తోందని తెలిపారు. హర్యానాలోని మానేసర్ ప్లాట్‌లో బైక్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్ ప్రస్తుతం ప్రతి ఏడాది లక్షకుపైగా యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్(జూబ్లీ హిల్స్), వరంగల్, విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలలో బుకింగ్స్ అందుబాటులో ఉండనుంది.
రివోల్ట్ ఆర్‌వీ400 ఫీచర్స్
72వీ 3.24 కిలోవాట్స్ లిథియన్ ఇయాన్ బ్యాటరీతో గల 3కిలోవాట్ మోటార్‌తో ఆర్‌వీ 400 బైక్ నడుస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇకో, నార్మల్, స్పోర్ట్స్ లాంటి మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వరకు వెళ్లనుంది. అంతేగాక, ఇది మైరివోల్ట్ అనే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తో వస్తుంది.
చదవండి: క్రికెట్ లవర్స్‌కు ట్విటర్ గుడ్‌న్యూస్..! భారత్‌లో తొలిసారిగా..!
Comments
Please login to add a commentAdd a comment