Revolt RV400 Electric Bike Sale On Amazon With Huge Discount, Check Price Details - Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనాలనుకుంటున్నారా? ఈ-కామర్స్‌ సైట్‌లో భారీ డిస్కౌంట్‌!

Published Mon, Aug 7 2023 10:17 PM | Last Updated on Tue, Aug 8 2023 10:43 AM

REVOLT RV400 electric bike sale on Amazon huge discount - Sakshi

REVOLT RV400 electric bike sale on Amazon: కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీ కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ రెవోల్ట్ మోటర్స్‌ అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ బైక్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.  

ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా రెవోల్ట్ ఆర్‌వీ 400 బైక్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది.  ఈ బైక్ వాస్తవ ధర రూ.1.54 లక్షలు. అయితే ఈ ఈ-కామర్స్‌ సైట్‌లో నేరుగా రూ. 15 వేల డిస్కౌంట్‌తో రూ.1.39 లక్షలకు లిస్ట్‌ చేసింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్‌ కింద రూ. 4,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎస్‌బీఐ కార్డు ద్వారా వచ్చే తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కలుపుకొంటే మొత్తంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

నో కాస్ట్ ఈఎంఐలో ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే  ఏకంగా రూ. 10,500 వరకు వడ్డీ డిస్కౌంట్ పొందొచ్చు. మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, ఏడాది వరకు టెన్యూర్‌తో నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుంది. రెవోల్ట్ 400 ఎలక్ట్రిక్‌ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 4.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement