Revolt Motors reopens bookings for e-bike RV400; check details - Sakshi
Sakshi News home page

Revolt RV400: దేశంలోనే తొలి ఏఐ ఎనేబుల్డ్ రివోల్ట్ ఇ-బైక్‌, బుకింగ్స్‌ మళ్లీ!

Published Mon, Feb 20 2023 4:18 PM | Last Updated on Mon, Feb 20 2023 4:41 PM

Revolt Motors reopens bookings for e-bike RV400 Check price and upgraded features - Sakshi

సాక్షి,ముంబై: రరట్టన్‌ ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూపు యాజమాన్యంలోని kరివోల్ట్ మోటార్స్‌ తన బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ ఏఐ ఎనేబుల్డ్ ఆర్‌వీ 400 బైక్‌ బుకింగ్‌లను తిరిగి  ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దేశీయ తొలి ఏఐ ఎనేబుల్డ్ ఆర్‌వీ 400 ఎలక్ట్రిక్ బైక్‌ను స్వాపింగ్‌ బ్యాటరీ ప్యాక్‌తో తీసుకొచ్చింది. ఇది  125 సీసీ పెట్రోల్  ఇంజీన్‌ బైక్‌కు సమానమైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 

ఏఐ ఎనేబుల్డ్ రివోల్ట్  ఆర్‌వీ 400 బైక్‌ బుకింగ్‌లు ఫిబ్రవరి 22న తిరిగి ప్రారంభిస్తున్నామనీ కేవలం రూ. 2,499 ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. డెలివరీలు మార్చి 31, 2023 నాటికి ప్రారంభ మయ్యే అవకాశం ఉంది. ఏఐ ఎనేబుల్డ్ ఆర్‌వీ 400 ఎలక్ట్రిక్  బైక్‌  72V 3.24kWh లిథియం-అయాన్ బ్యాటరీ 4.5 గంటలలోపు ఛార్జ్  అవుతుంది బ్యాటరీ 3kW మోటార్‌తో అనుసంధానం ఈ బ్యాటరీ 54Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

రివోల్ట్  ఆర్‌వీ 400 బైక్‌ ఫీచర్ల పరంగా, ఫుల్‌-LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 4G కనెక్టివిటీతో వస్తుంది. ట్రావెల్‌ హిస్టరీ, బ్యాటరీ ఆరోగ్యం, పరిధి  సమీప స్వాప్ స్టేషన్ వంటి వివరాలకు వోల్ట్ యాప్‌ను బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌కు జత చేయవచ్చు.

ఇ-బైక్ కీలెస్ ఇగ్నిషన్‌ను కూడా కలిగి ఉంది.  'ఇంజిన్ నోట్' మరో స్పెషల్‌ ఫీచర్‌. ఇది బైక్‌లోని అంతర్నిర్మిత స్పీకర్ల ద్వారా కృత్రిమ ఇంజిన్ సౌండ్‌ను కంట్రోల్‌ చేస్తుంది. స్క్రూ-టైప్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో  రియర్‌ ఇన్‌వర్టెడ్‌  ఫ్రంట్ ఫోర్క్,మోనో-షాక్‌ను కలిగి ఉంటాయి.  ఇటీవల రట్టన్‌ ఇండియా  కొనుగోలు చేసిన రివోల్ట్ మోటార్స్ తన సప్లయ్‌ చెయిన్‌లో భారీ పెట్టుబడులు పెట్టింది. అలాగే హర్యానాలోని మనేసర్‌లోని వరల్డ్‌ క్లాస్‌  ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement