కోల్‌కతా కాళీఘాట్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తికి అగంతకుడు ఫోన్ చేశాడు. ‘సార్.. సార్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్యు..థ్యాంక్యు..ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు. ఏం లేదు సార్ మీరు గతంలో ఓ సంస్థలో పెట్టుబడి పెట్టారు కదా . ఆ సంస్థ దివాళా తీసింది. ఆ విషయం మీ క్కూడా తెలుసు.
తాజాగా కోర్టు మీ పెట్టుబడిని తిరిగి ఇచ్చేయమని తీర్పిచ్చింది. కోర్టు తీర్పు ఉత్తర్వుల తాలుకూ న్యూస్ పేపర్లలో, టీవీల్లో కూడా వచ్చింది. కావాలంటే మీరే చూడండి.ఈ విషయం చెప్పాలనే మీకు ఫోన్ చేశాను. త్వరలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీ బ్యాంక్ అకౌంట్‌లో జమవుతుంది’ అని ఊరించాడు. కాకపోతే మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాల్ని చెప్పాల్సి ఉంటుందని కోరారు.
నమ్మితేనే కదా మోసం చేసేది
దీంతో సదరు వ్యక్తి ముందుగా అగంతకుడికి తన వ్యక్తిగత వివరాలు ఇవ్వాలా? వద్దా? అని కాస్త సంశయించాడు. ఆ తర్వాత.. ఆ ఇస్తే ఏముందిలే మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా అని మనుసులో అనుకున్నాడు. మొత్తం వివరాల్ని అందించాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. వారం రోజుల తర్వాత సదరు పెట్టుబడి దారుడి అకౌంట్ నుంచి రూ.8లక్షలు మాయమయ్యాయి. పోలీసులు కొంత మొత్తాన్ని రికవరీ చేశారు. ఇదిగో ఈయన 8లక్షలు మోసపోతే గత ఏడాది వాటి విలువ వేల కోట్లకు చేరింది.
వేల కోట్లకు సైబర్ నేరాలు
నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నివేదిక ప్రకారం..2023 ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు సుమారు రూ.5,574 కోట్ల సైబర్ నేరాలు జరిగాయి. 2022లో ఈ మొత్తం రూ.2,296 కోట్లుగా ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి.
సైబర్ నేరాల నుంచి సంరక్షించేందుకు
ఈ తరుణంలో సైబర్ నేరాల నుంచి యూజర్లను సంరక్షించేందుకు ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో టూల్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ల లాక్ స్క్రీన్ నుంచి అనుమానిత ఫోన్ నెంబర్లను నేరుగా బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ వాట్సప్ వెసులుబాటు కల్పిస్తుంది. బ్లాక్ చేస్తే వాటి నుంచి మీకు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావు. మీరు కావాలనుకుంటే వాట్సప్‌కు రిపోర్ట్ చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment