off
-
‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు?
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా నేడు (గురువారం) ఐటీఓ కూడలిలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రచారం సాగనుంది. 28న బరాఖంబలో, అక్టోబర్ 30న చంద్‌గిరామ్ అఖారా కూడలి, నవంబర్ 2న మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రచారం సాగనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ఈసారి ఐటీఓ కూడలి నుంచి ప్రారంభిస్తామన్నారు. నవంబర్ 3వ తేదీన 2000 ఎకో క్లబ్‌ల ద్వారా చిన్నారులకు కూడా అవగాహన కల్పించనున్నామన్నారు. 2020వ సంవత్సరంలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ ప్రచారం ప్రారంభించారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు 2019 సంవత్సరంలో దీనిపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. కూడలి సిగ్నల్ వద్ద రెడ్ లైట్ కనిపించినప్పుడు వాహనాల ఇంజిన్లను స్విచ్ ఆఫ్ చేయని పక్షంలో తొమ్మిది శాతం అధికంగా కాలుష్యం వ్యాపిస్తుంది. సాధారణంగా ఢిల్లీలో వాహనదారులు 10 నుండి 12 రెడ్ లైట్ల గుండా వెళుతుంటారు. ఈ కూడళ్లలో వాహనం ఇంజన్ రన్ అవుతూనే ఉంటుంది. ఫలితంగా 25 నుంచి 30 నిమిషాల పాటు అనవసరంగా పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చయి, పొగ రూపంలో కాలుష్యం వ్యాపిస్తుంది. అందుకే కూడలిలో రెడ్ లైట్ పడినప్పుడు వాహనం ఇంజిన్ అపాలని ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తున్నారు. కాగా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం మరింత ఆందోళనకరంగా మారుతోంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆప్ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ‘నాసా’ ఫొటోలలో కారణం వెల్లడి! -
జోయాలుక్కాస్ గుడ్‌న్యూస్: 50 శాతం మేకింగ్ చార్జెస్ తగ్గింపు
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ‘సంవత్సరపు సాటిలేని జ్యువెలరీ సేల్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆభరణాల ముజూరీ చార్జీల (వీఏ)పై 50 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘‘ఈ మార్చి 26 వరకు అందుబాటులో ఉండే ఈ గొప్ప ఆఫర్‌తో ఇంతకు ముందు లేని విధంగా సాటిలేని జ్యువెలరీ అనుభవాన్ని ఆనందించవచ్చు’’ అని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జాయ్ అలూక్కాస్ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఒక సంవత్సరం ఉచిత బీమా, జీవిత కాల ఉచిత నిర్వహణ, బై బ్యాక్ ఆఫర్లను పొందొచ్చని జోయాలుక్కాస్ తెలిపింది. ఇది కూడా చదవండి: 250 కోట్ల బిగ్గెస్ట్ ప్రాపర్టీ డీల్: మాజీ ఛాంపియన్, బజాజ్ ఆటో చైర్మన్ రికార్డు రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు -
వైరల్ వీడియో: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు
-
Revolt RV400: కీ అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్‌తోనే బండి స్టార్ట్
వాహనాన్ని స్టార్ట్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కీ కంపల్సరీ. అది లేకుండా బండి ముందుకు నడవదు. అయితే గత కొంత కాలంగా కీ లేకుండా బండ్లు స్టార్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అవన్నీ రెంటల్ బైక్ సర్వీసెస్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్ బైకులకు సైతం ఈ ఫీచర్‌ని అందుబాటులోకి వచ్చింది. ఓలా రాకతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో పరిస్థితులు మారిపోయాయి. ఈ సెగ్మెంట్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు అందించేందుకు కంపెనీలో పోటీ పడుతునఆనయి. తాజాగా తమ బైకులకు సంబంధించి కీలకమైన మార్పును రివోల్ట్ తీసుకొచ్చింది. కీతో సంబంధం లేకుండానే బండి ఆన్ ఆఫ్ చేసే విధంగా సరికొత్త టెక్నాలజీని రివోల్ట్ అందిస్తోంది. రివోల్ట్ 400 బైకులు స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో రివోల్ట్ యాప్ ద్వారా కీతో సంబంధం లేకుండానే బైను ఆన్, ఆఫ్ చేయవచ్చు. పార్కింగ్ ఏరియాలో బండి ఎక్కడ ఉందో కూడా కనుక్కోవచ్చు. 2021 సెప్టెంబరు నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండే బైకులకు ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. కొత్తవాటితో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న బైకులకు సైతం ఈ ఫీచర్‌ని ఉచితంగానే అందిస్తామని రివోల్ట్ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. రివోల్ట్ షోరూమ్‌కి వెళ్లి కీ లేకుండా బైకులను ఆపరేట్ చేసే ఫీచర్‌ను పొందవచ్చన్నారు. అయితే కీ లెస్ ఫీచర్‌ని కేవలం రివోల్ట్ ఆర్వీ 400 మోడల్స్‌కే పరిమితం చేశారు. ఆర్వీ 300 మోడల్ బైకులకు ఈ ఫీచర్‌ని అందివ్వడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రివోల్ట్ ఆర్వీ 400 మోడల్ స్టాండర్డ్ ధర ఆన్ రోడ్ రూ.1,06,999గా ఉంది. కొత్త మోడల్ వివరాలపై స్పష్టత లేదు. -
వీధి దీపాలు ఆర్పేస్తున్నారు..
ఏ వీధిలోకి వెళ్తే ఆ వీధిలోనే లైట్ల ఆర్పివేత చిలకలూరిపేటలో అధికార పార్టీ కుట్రలు గడపగyýlపకు వైఎస్సార్ కార్యక్రమానికి.. అడ్డంకులు సృష్టించే యత్నం చిలకలూరిపేట టౌన్ : చిలకలూరిపేట పట్టణంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగటం అధికారపార్టీకి కంటగింపుగా మారింది. కార్యక్రమానికి లభిస్తున్న విశేష ఆదరణ, ప్రజాస్పందనను చూసి ఓర్వలేక ఏదో రకంగా అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అధికారం చేతిలో ఉందికదా అని అహంకారంతో అధికార దుర్వినియోగానికి తెరతీసింది. గత నెల 8వ తేదీన నియోజకవర్గంలో ప్రారంభమైన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ గురించి సమాచారం సేకరిస్తున్న అధికార పార్టీ నాయకులు విద్యుత్ సరఫరా నిలిపివేసి సమస్యలు సృష్టిస్తున్నారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం పట్టణంలో ప్రతిరోజు సాయంత్రం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతోంది. దీంతో ఏ వీధిలో కార్యక్రమం జరుగుతుందో ఆ వీధి దీపాలు వెలగకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేయిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు వీధిలోని ఒక లైను దాటి మరో లైనుకు వెళ్లాక కార్యక్రమం ముగిసిన లైనులో వీధి దీపాలు వెలుగుతున్నాయి. కొత్తగా ప్రవేశించినలైనులో వీధిలైట్లు ఆరిపోతున్నాయి. ఈ రకంగా అవాంతరాలు సృష్టిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చార్జింగ్ లైట్లను తెచ్చి ఆ వెలుగులోనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న ఈ అనైతిక చర్య పట్ల ప్రజలు ఏహ్యభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఏమాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నన్ను ఇన్వాల్వ్ చేయకండి..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం అనంతరం మళ్ళీ అధ్యాపక వృత్తిలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. సెప్టెంబర్ 4 తో ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆయన తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెడతారని సహచరులతో చెప్పినట్లుగా వచ్చిన వార్తలపై స్పందించారు. బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో అదేవిషయంపై వ్యాఖ్యానించారు. తనను అనవసర విషయాల్లోకి లాగొద్దని, తాను ప్రపంచంలో ఎక్కడైనా ఉంటానని రఘురాం రాజన్ తెలిపారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన అసోచామ్ సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ రంగ రాజన్ ఆయన భవిష్యత్ జీవితంపై ఎవ్వరూ ఊహా కథనాలు అల్లొద్దని స్పష్టం చేశారు. మరో రెండు నెలలు పదవిలో ఉంటానని, తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా తాను నివసించే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా భారత్ లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. సమావేశం సందర్భంగా మాట్లాడిన ఆయన.. క్రెడిట్ రేటు మందగించడానికి అధిక వడ్డీరేట్లు కారణం కాదన్నారు. బ్యాలెన్స్ షీట్లను పటిష్ఠపరచడం, రుణాలను పెంచడం వంటివి చాలా సున్నితమైన ఆంశాలుగా ఆయన వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకులకు సాయపడుతున్నట్లు తెలిపారు.