మంగళగిరి : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పెరిగిపోతోందని, దానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని ఉధృతం చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి జేవీ రాఘవులు తెలిపారు.
మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రచారం
Mar 3 2017 11:31 PM | Updated on Sep 5 2017 5:06 AM
మంగళగిరి : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పెరిగిపోతోందని, దానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని ఉధృతం చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి జేవీ రాఘవులు తెలిపారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం రాత్రి పార్టీ డివిజన్ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు. 2014 లో పూర్తి అధికారంతో కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మౌలిక సూత్రాలపై పెద్ద ఎత్తున దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రాజ్యాన్ని, మతాన్ని జోడించి పరిపాలన చేస్తుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు కేరళ ముఖ్యమంత్రి విజయన్ తల తీసుకువస్తే కోటిరూపాయలు ఇస్తామని ప్రకటించినా ప్రధానమంత్రి గానీ, హోంమంత్రి గానీ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. కేరళలో అశాంతి వాతావరణాన్ని నెలకొల్పి ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, ఎస్‌ఎస్ చెంగయ్య, వి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement