మలబార్‌ గోల్డ్‌పై తప్పుడు ప్రచారం.. దోషికి శిక్ష | kerala youth fined 2.5 lakh dirhams in Dubai for defaming jeweler | Sakshi
Sakshi News home page

మలబార్‌ గోల్డ్‌పై తప్పుడు ప్రచారం.. దోషికి శిక్ష

Published Tue, Mar 21 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

మలబార్‌ గోల్డ్‌పై తప్పుడు ప్రచారం.. దోషికి శిక్ష

మలబార్‌ గోల్డ్‌పై తప్పుడు ప్రచారం.. దోషికి శిక్ష

హైదరాదాద్‌: మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందనే ఫొటోలను ప్రచారం చేసిన వ్యక్తికి దుబాయ్‌ న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. కోర్టు అది తప్పుడు ప్రచారమని పేర్కొంటూ.. ఈ పనికి పాల్పడ్డ బినిష్‌ పున్నాకల్‌ ఆరుముగన్‌కి బహిష్కరణతోపాటు రూ.44.68 లక్షల జరిమానా విధించిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సోషల్‌ మీడియాను ఉపయోగించుకొని సంస్థలు/వ్యక్తుల కీర్తిప్రతిష్టలను దెబ్బతీయాలని ప్రయత్నించే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం.

ప్రతివాది మమల్ని క్షమాపణ కోరిన వెంటనే మేం కేసును వెనక్కు తీసుకున్నాం. కానీ దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఈ కేసును కొనసాగించింది. తక్కువ వ్యవధిలో ఉత్తమమైన తీర్పు వెలువరించినందుకు దుబాయ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’ అని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌ ఎండీ షామ్‌లాల్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement