
కరెంటు ఆదాపై మంత్రి వినూత్న ప్రచారం
కరెంటు ఆదా చేయడమంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడమేనంటూ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ప్రచారం అందరిని ఆలోచింపజేస్తోంది.
నంగునూరు : కరెంటు ఆదా చేయడమంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడమేనంటూ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ప్రచారం అందరిని ఆలోచింపజేస్తోంది. శనివారం నంగునూరు మండలం తిమ్మాయిపల్లిలో రూ. వంద విలువజేసే ఎల్‌ఈడీ బల్బును జెడ్పీవైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి గ్రామస్తులకు రూ .75కే అందజేశారు. అన్ని గ్రామాల్లో కరెంటు ఆదా చేయాలనే ఉద్దేశంతో నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు తన వంతుగా ఒక్కో బల్బుకు రూ. 25 ప్రోత్సహకం అందజేశారని మంత్రి ఓఎస్‌డీ బాలరాజు చెప్పారు. పెలైట్ ప్రాజెక్ట్‌గా తిమ్మాయిపల్లిని ఎంచుకున్నామని ఇది విజయవంతమైతే సిద్దిపేట నియోజక వర్గంలో అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులను వాడేలా అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామస్తులకు అందించిన విద్యుత్ బల్బుల ప్యాకింగ్‌పై ‘ సేవింగ్ పవర్ మీన్స్ జనరేటింగ్ పవర్ ’ అనే సందేశం ఉంటుంది. ఇది చూసిన గ్రామస్తులు వేసవి కాలంలో విద్యుత్ ఆదా చేస్తే కరెంటు తిప్పలు తప్పుతాయని చర్చించుకుంటున్నారు.