వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా మాపై కామెంట్స్‌ సరికాదు: సజ్జల | Sajjala Ramakrishna Reddy Responds on Telangana Minister Harish Rao Comments | Sakshi
Sakshi News home page

వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా మాపై కామెంట్స్‌ సరికాదు: సజ్జల

Published Fri, Sep 30 2022 1:35 PM | Last Updated on Fri, Sep 30 2022 5:26 PM

Sajjala Ramakrishna Reddy Responds on Telangana Minister Harish Rao Comments - Sakshi

సాక్షి, తాడేపల్లి: గడప గడపకు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన ఎంతో బాగుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన పథకాలపై ప్రజల స్పందన తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పీచ్‌ను ఎల్లోమీడియా వక్రీకరించిందని మండిపడ్డారు. అందరూ కలిసి పనిచేయాలని మాత్రమే సీఎం జగన్‌ సూచించారని సజ్జల పేర్కొన్నారు. 

ఉచిత విద్యుత్‌పై మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు సజ్జల. తెలంగాణ మంత్రి హరీష్‌ రావు ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలీదని అన్నారు. వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా తమపై కామెంట్‌ చేయడం సరికాదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ముందు వాళ్ల సమస్యలపై  హరీష్‌ రావు దృష్టి పెడితే మంచిది అని సజ్జల సూచించారు. 

చదవండి: (Sabbam Hari: లాన్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌?.. ఎవరీ అప్పారావు...?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement