సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వ్యవహారం దొంగతనం చేసి దబాయించినట్లుగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు తేల్చింది వైఎస్సార్ సీపీ కాదని, ఐటీశాఖ అని పేర్కొన్న సజ్జల.. ఐటీకి సమాధానం చెప్పాల్సిందిపోయి తనను రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
దోపిడీ చేసి నిజాయితీ పరుడైనట్లు చిత్రీకరించుకునేందుకు బాబు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరిపి చంద్రబాబును అరెస్ట్ కూడా చేయాల్సి ఉందన్నారు. కానీ ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ముడుపులన్నీ ఎటు ఎటు తిరిగి చంద్రబాబు గూటికి చేరాయో.. ఐటీశాఖ వివరంగా ఆ నోటీసుల్లో పేర్కొందని తెలిపారు.
‘తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు. పాపం పండినప్పుడు చంద్రబాబు అరెస్ట్ కావడం ఖాయం. చంద్రబాబు చట్టానికి అతీతులు కారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చి సీఎం జగన్‌పై బురద జల్లటమే ఎల్లో మీడియా విధానం. చంద్రబాబు ఐటీ నోటీసులపై నిశ్శబ్ధాన్ని పాటిస్తున్నది అందుకే. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి సానుభూ పొందాలనేది చంద్రబాబు కుట్ర. పుంగనూరు, భీమవరంలో అదే జరిగింది. తనకు ఇబ్బంది ఎదురైతే జనాన్ని రెచ్చగొట్టటం చంద్రబాబు నైజం’ అని సజ్జల మండిపడ్డారు.
చదవండి: ఆ క్రెడిట్ కూడా బాబుకే దక్కుతుంది.. విజయసాయిరెడ్డి సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment