
సీఎం పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీలేదు
- ‘బాబు’ది కేవలం పబ్లిసిటీ స్టంటే..
- హంద్రీ నీవాను ఏడాదిలో.. అంటూ ప్రగల్బాలు
- పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
పలమనేరు: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లా వాసులకు ఒరిగిందేమీ లేదని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పలమనేరులోని వైఎస్సార్‌సీపీ నాయకుని ఇంట్లో జరిగే వివాహానికి సంబంధించి శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానిక నాయకులతో కలసి శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎస్‌కేఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు జరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది దాటినా జిల్లాకు ఏమైనా మేలు జరిగిందా? కేవలం జిల్లా పర్యటనలకు రావడం.. అది చేస్తా.. ఇది చేస్తానంటూ డైలాగులు చెప్పి ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు తప్ప, వాస్తవం గా ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు.
ఆయనకు సొంత జిల్లాపై ఏమాత్రం ప్రేమలేదని, కేవలం జిల్లా వాసులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏడాదిలోపు కుప్పానికి హంద్రీ నీవా నీరు ఎలా తెస్తారో అర్థం కావడం లేదన్నారు. ఈ మాట చెప్పి ఇప్పటికి 4 నెల లవుతోందని, కావాల్సినన్నీ నిధులే లే కుంటే ఎలా ప్రాజెక్టులు పూర్తి చేస్తారు? ఆయన వద్ద అల్లాద్దీన్ అద్భుత దీపమేదైనా ఉందేమోనని ఎద్దేవా చేశారు. ఇక పోతిరెడ్డిపాడు పనులను పక్కనబెట్టి పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మిస్తామని, దీంతో సీమ సస్యశ్యామలం అవుతుంద నీ జనాన్ని నమ్మించే మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరక అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా త యారైందన్నారు.
ఇవేమీ పట్టించుకోకుండా విదేశీ పర్యటనలు చేస్తూ.. ఇక్క డ రాజధానిని అలా నిర్మిస్తాం.. ఇలా నిర్మిస్తామంటూ ఒట్టి మాటలు చెబుతూ బురిడీ కొట్టిసున్నారన్నారు. ఇక్కడ పాలన కార్పొరేట్ సంస్థల కోసం సాగుతున్నట్టు ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్ర భుత్వంపై ప్రజలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎం దుకు గెలిపించామా అని పశ్చాత్తాపం చెందుతున్నారని అన్నారు. ప్రజల పక్షా న తమ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుం దని ఎమ్మెల్యే సృష్టం చేశారు. నాయకు లు సీవీ కుమార్, మోహన్‌రెడ్డి, మండీ సుధ, చాంద్‌బాషా, ఎస్‌కేఎస్ జాఫర్, కమాల్, శ్యామ్, కోదండరామయ్య, ఖాజా, రహీంఖాన్ పాల్గొన్నారు.