మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తే వివిధ రకాల అనారోగ్యాల బారినపడడమేగాక, ఏ పనిచేయక పోయినా అలసిపోతాము. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు ప్రయత్నించండి. ఉత్సాహంగా ఉంటారు.
►ఉడకపెట్టిన వేరుశనగ విత్తనాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఉడికించిన వాటిని తినడం వల్ల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుకరిగి, హృదయ సంబంధ సమస్య ల ముప్పు తగ్గుతుంది. బరువు కూడా నియంత్రణ లో ఉంటుంది.
►ఖర్జూరాలను పాలల్లో ఉడక బెట్టి తినాలి. దీనివల్ల రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది.
►దీనిలో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్స్, జింక్ పుష్కలంగా ఉంటాయి.
►ఎప్పుడూ నీరసంగా అనిపించేవారు.. రాత్రంతా కిస్‌మిస్‌లను నీళ్లలో నానబెట్టుకుని ఉదయం ఆ నీటిని తాగాలి.
►క్రమం తప్పకుండా కొద్దికాలం పాటు ఇలా చేస్తే శరీరంలో నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి.
►మధుమేహం ఉన్నవారు కివి, చెర్రీ, పియర్, యాపిల్, ఆవకాడోలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల నీరసం దరిచేరదు.
చదవండి: Skin Care Tips: డ్రైఫ్రూట్స్, గుడ్లు, చేపలు తిన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment