మేలైన ఖర్జూరాలు(డేట్స్) రెండు తిన్నా చాలు... తక్షణ శక్తి లభిస్తుంది అంటారు పెద్దలు. ఎడారుల్లోని ఒయాస్సిసుల దగ్గర పండుతాయి ఖర్జూరాలు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఖర్జూర చెట్లలో ఆడా, మగా రకాలు ఉంటాయి. అయితే, ఆడ చెట్టు నుంచే మనం తినే ఖర్జూర పండ్లు లభిస్తాయి. పండ్లలోని తేమను బట్టి మెత్తటివి, ఎండినవి అంటూ రకాలు ఉంటాయి. సహజంగానే రుచికి తీపిగా ఉండే ఖర్జూరాల్లో ఉండే పోషకాలు, ఈ పండ్లు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువేనండోయ్!
ఖర్జూరాల్లో లభించే పోషకాలు
►ఖర్జూరాలు ముఖ్యంగా ఎండు ఖర్జూరాల్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.
►వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ.
►ఖర్జూరాల్లో కార్బోహైడ్రేట్స్, చక్కెర పదార్థాలు కూడా అధికం.
►ఇక విటమిన్లలో విటమిన్ సీ మెండుగా లభిస్తుంది.
►యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.
►కాల్షియం, పాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు కూడా అధికమే.
ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
►ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కెరోటినాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.
►అదే విధంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
►ఫ్లావనాయిడ్స్ లోని యాంటి ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మధుమేహం, కాన్సర్ ముప్పును తగ్గిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
►ఇందులోని ఫినోలిక్ ఆసిడ్ సైతం గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
►ఖర్జూరాల్లో కాపర్, సెలీనియం, మెగ్నీషియం ఎక్కువ. ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి.
►ఖర్జూరాల్లోని కోలిన్, విటమిన్ బి జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. అల్జీమర్స్ తగ్గిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినడం మేలు.
►ఖర్జూరాలు నిద్రలేమిని దూరం చేస్తాయి.
►పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుదలకు ఉపకరిస్తాయి. వీర్యవ`ద్ధికి తోడ్పడతాయి.
►మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నవాళ్లు ఖర్జూరాలు తింటే మంచిది.
►గర్భిణీలకు ఖర్జూరం తినిపిస్తే మంచిదని చెబుతుంటారు పెద్దలు. గర్భిణులు వీటిని తినడం వల్ల ఇందులోని ఫైబర్ కారణంగా పైల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
►డయేరియా, రక్తపోటుతో బాధపడేవారికి కూడా ఖర్జూరం చక్కగా ఉపయోగపడుతుంది.
►బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో ఖర్జూరం చేర్చుకుంటే ఫలితాలు ఉంటాయి.
చదవండి: Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్ వల్ల..
Comments
Please login to add a commentAdd a comment