ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ.. తాజా కూరలలో రాజా ఎవరండీ... ఇంకా చెప్పాలా వంకాయేనండీ.. అవును నిజమే.. మహానుభావులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినట్లు కూరగాయలలో వంకాయ నిజంగా కింగే! తెలుగువారి మెనూలో కచ్చితంగా ఉండే కూరగాయ ఇది.
గుత్తి వంకాయ, వెన్న వంకాయ, వంకాయ నువ్వుల పులుసు, వంకాయ ఉల్లి పచ్చడి.. ఇలా ఏ రకంగా ఎవరు వండినా, ఎలా వండినా... తనదైన రుచిని వంటకానికి అద్దడం వంకాయ ప్రత్యేకత. కేవలం రుచిలోనే కాదండోయ్... ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ వంకాయ భేష్!
వంకాయలో ఉండే పోషకాలు:
►వంకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు ఉంటాయి.
►చక్కెర, పీచు పదార్థాలు పుష్కలం.
►ఇక విటమిన్ల విషయానికొస్తే... విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటివి ఉంటాయి.
►క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు వంకాయలో ఉంటాయి.
►యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.
►కేలరీలు తక్కువ.
చదవండి: Goru Chikkudu Kaya Benefits: షుగర్ పేషెంట్లు గోరు చిక్కుడు కూర తింటే... ఇందులోని ఆ గుణాల వల్ల...
వంకాయ కూర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
►వంకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
►జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి.
►ఫలితంగా స్థూలకాయాన్ని, గుండెజబ్బులు, రక్తపోటు ముప్పును నివారిస్తాయి.
►వంకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ 15. కాబట్టి ఇది డయాబెటిస్ పేషంట్లకు మంచిది.
►అంతేకాదు వంకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి.
►కొవ్వు శాతం తక్కువ.. నీరు ఎక్కువగా ఉంటుంది.
►కాబట్టి టైప్ 2 మధుమేహ రోగులు, డైట్ కంట్రోల్ చేస్తోన్న స్థూలకాయులు దీనిని తరచూ తినడం మంచిది.
►అదే విధంగా వంకాయ హైబీపీని అదుపు చేస్తుంది.
►రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను వంకాయలు తగ్గిస్తాయి.
►న్యాసునిన్ క్లోరోజెనిక్ రూపంలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు వంకాయలో పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఇవి పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడగలుగుతాయి.
►ఫోలేట్, మెగ్నీషియం, పొటాసియం, విటమిన్ బీ1, బీ6, విటమిన్ కె బీటా కెరోటిన్ వంటివి గుండెవ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
►ఉబ్బసాన్ని తగ్గించడంలో కూడా వంకాయ ఎంతో ఉపయోగపడుతుంది.
గమనిక: ఆర్థరైటిస్ ఉన్నవారు తింటే కొన్నిసార్లు కీళ్లనొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది.
చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
Comments
Please login to add a commentAdd a comment